Jump to content

Where is Divya vani Aunty man


RameshKesari

Recommended Posts

వైసీపీకి 175 సీట్లు వచ్చి ఉంటే బాగుండేది: టీడీపీ నేత దివ్యవాణి

Jun 04, 2019
 
వైసీపీకి 175 సీట్లు వచ్చి ఉంటే బాగుండేది: టీడీపీ నేత దివ్యవాణి


టాలీవుడ్ నటి దివ్యవాణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘పెళ్లి పుస్తకం’ సినిమాతో కుర్రకారును గిలిగింతలు పెట్టిన ఈ ‘బాపు బొమ్మ’ ఇటీవల టీడీపీలో చేరి చురుగ్గా వ్యవహరించారు. ప్రత్యర్థుల విమర్శలకు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. టీడీపీ గెలుపుపై చివరి వరకు ధీమాగానే ఉన్నప్పటికీ అంచనాలు తారుమారయ్యాయి. పార్టీ ఓటమి తర్వాత చాలారోజులపాటు మీడియాకు దూరంగా ఉన్న దివ్యవాణి సోమవారం మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. 

రెండోసారి ప్రధాని అయిన నరేంద్రమోదీకి, ఏపీలో విజయం సాధించిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. పార్టీ ఓటమి తనను బాధించిందని, మరీ ఇంత ఘోరంగా ఓడిపోతామని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.  ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వచ్చి ఉంటే తాను చాలా ఆనందించేదానినని పేర్కొన్నారు. అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు తన ముద్దులొలికే మనవడితో మాట్లాడే సమయం మరింత ఎక్కువగా దొరికేదని అభిప్రాయపడ్డారు. 

ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆమె త్వరలోనే పార్టీని వీడి వైసీపీలో చేరబోతున్నారని, ఆమె మాటల వెనక ఆ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా మొత్తం దీనితోనే నిండిపోయింది. దీంతో స్పందించిన దివ్యవాణి ఆ వార్తలను కొట్టిపడేశారు. తాను పార్టీని వీడబోనని, డబ్బుల కోసం, పదవుల కోసం వైసీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.  
 
పార్టీని వీడాలంటే దొంగచాటుగా ఆ పనిచేయనని, టీడీపీలో ఇమడలేనని భావించిన రోజున చంద్రబాబుకు ఆ విషయాన్ని చెప్పే వెళ్తానని నటి స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు  ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. వైసీపీలో చేరమంటూ ఎంతోమంది తనను పిలిచారని, కానీ తాను డబ్బులకు ఆశపడే రకం కాదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తానెప్పుడూ విమర్శలు చేయలేదని పనిలోపనిగా చెప్పుకొచ్చారు.  

Link to comment
Share on other sites

elechans time lo vache divya vani, hyper aadi, posani , pruthvi raj and aali veellantha paid artist lu, tissue paper lekka

panaipogaane they reach their place

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...