Jump to content

కమ్మేసిన సోషల్‌ మీడియా


Chinna84

Recommended Posts

తెలుగుదేశం పార్టీలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద నేతవరకు చివరికి అధినేత సయితం అంతా ఒకే తానులో గుడ్డముక్కలే. వారు ఓటమిని ఏనాడు అంగీకరించరు. పక్క వారి పైకినెట్టడం ఆపార్టీలో ప్రతి ఒక్కరికి జన్మహక్కులాంటిది. రెండేళ్లక్రితమే చంద్రబాబు ఓటమిని గుర్తించారు.అప్పటికే రాష్ట్ర ఇంటిలిజెన్సీ, నానారకాల సర్వేలు నీ ఓటమి తప్పదయ్యా! చంద్రయ్యా!! అని హెచ్చరికలు చేస్తునే ఉన్నాయి. అయితే తన జేబులో కార్యాలయాలు పెట్టుకుని నడుస్తున్న మీడియాల్లో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ పెద్దలు వికృతరాతలతో బాబును పక్కదారి మళ్లింపులో ర్యాంకుమార్కులు ఎప్పటికప్పుడే బాబువద్ద పుచ్చే సుకునేవారు. ఇంతగా చెబుతున్న మీడియా పెద్దలమాటను అవినీతి ఆనకొండ చంద్రన్న ధనమగత మీద నమ్మేసేవారు. అవునా? కాదా? అనే ఆలోచనలకు బాబు ఏనాడు శ్రీకారం చుట్టలేదు.

బాబు అవినీతిలో కాళ్లతో కూడేసే కరెన్సీనోట్ల మద్య ఎప్పుడో ఓడే దానికి ఇప్పుడు నుంచి ఎందుకు పరిష్కారం ఆలోంచాలని తేలిగ్గా తీసుకునే వారు. తను అనునిత్యం జిల్లాల్లో పర్యటించేటప్పుడు ఏవర్గమైన ఏకులపు నేతలయినా ఫలానాహామీ ఇచ్చారు. ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తే చచ్చింది గొర్రె అనేతీరులో పోలీసులను ఆప్రశ్నించే వారిపై ఉసిగొలిపేవారు. ప్రశించేవాళ్లను రాత్రంతా జైలుగోడల పక్కనే కూర్చోబెట్టి జీవితంపై విరక్తి కలిగేలా పోలీస్‌ టార్చర్‌ చేయించడం ఆనవాయితీగా బాబు పెట్టుకున్నారు. ఇదే బాబు ఎంపిక చేసుకునే ఉక్కుపాదంతో అణచివేత ప్రక్రియ. బాబు తీరు ఒక్కటే.

పదేళ్ల తర్వాత ఊహించని గెలుపునిచ్చారు. అందులో  రైతురుణమాఫీ, నిరుద్యోగులకు బాబు వస్తే జాబు గెలిపించాయి. అమలు చేయలేని హామీలే అధికార మిచ్చాయి అని చెప్పకుండా బాబును ఎత్తుకుని గాల్లో తిప్పే పచ్చమీడియా మరోలా ప్రచారంలో పెట్టింది. కొత్త రాష్ట్రం (13జిల్లాలు) అనుభవజ్ఞుడైన చంద్రబాబును ఏరికోరి ప్రజలే ముఖ్యమంత్రిని చేసారని సొల్లు ప్రచారం చేసింది. ఆ ప్రచారం జనాల్లోకి అద్భుతంగా దూసుకుపోయింది. పదేళ్లుగా అవినీతికి ఆమడదూరంలో నెట్టబడ్డ టీడీపీకి గెలుపు గుర్రమెక్కించిన జనాలు అల్లాటప్పల్లా కన్పించారు. ఇచ్చిన హామీలు అడిగితే ఉక్కుపాదమే జవాబుదారి అన్నట్లుగా సాక్షాత్తు చంద్రబాబే జనాలను ఈసడించడంలో చెలరేగేవారు.

రైతులు రుణమాఫీ చేస్తానన్న మాటను కనీసం నెలలు గడుస్తున్నా దాని తలంపులోనే లేరాయే. పచ్చమీడియా మాత్రం బాబును భుజాలపై ఎక్కించుకుని తిప్పుతుండేది. ఏపీికి ఆర్థిక వనరులు అంతంతమాత్రమే. అయినా కార్యదీక్షాపరుడు, నిరంత శ్రామికుడు ఇచ్చిన హామీలు ఎలాగైనా చెల్లించే దిశలో ఉన్నారనే రాతలతో రోజులు వెళ్లదీస్తూ ఎదురుచూసే జనాలకు చుక్కలు చూపాయి. జనాలు కూడా నిజమే. వనరులే లేని రాష్ట్రమాయే. అపార అనుభవజ్ఞుడు ఏదో ఒకటి చేసి చెల్లిస్తాడులే అనుకున్నారు. ఆదిశలో బాబు లేనేలేరు. సహస్ర బాహువులతో అందినకాడికి దోచేసి తన బినామీల బొక్కసాలు నింపడంలో అహర్నిశలు శ్రమించడం పనిగాపెట్టుకున్నారు.

మంత్రులకు ఎంఎల్‌ఏలకు, కార్యకర్తలకు ఎవరి రేంజ్‌లో వారు గుటకాయస్వాహ చేసుకునేలా ముఖ్యమంత్రి కన్ను చేరేసారు. అధికారం చేపట్టిన నెలలకే  అన్నివైపులా పచ్చనేతలు పిచ్చపిచ్చగా అందినకాడికి బకాసుర భోజనాలు ఆరంభించేసారు. ఎక్కడ హాంఫట్‌ జరుగుతుందో అక్కడ జనాలు ఔరా ఇంత దారుణమా? అని నోళ్లు వెళ్లబెట్టి కోళ్లు తిన్నోళ్లు (కాంగ్రెస్‌)పోయి గొర్రెలు బర్రెలు (టీడీపీ)తినోటోళ్లు వచ్చారే అని నొచ్చుకుని తలలు పట్టుకున్నారు. అలా ఐదేళ్లూ తలలు ఇంకేదేదో పట్టుకుని విలవిలలాడిపోయారు. జనవ్యతిరేకత ఉధృతమయ్యింది. అప్పటకీ పచ్చమీడియా బాబును ఎత్తుకో వడంలోనే ఉంది.

కానీ, ఇతరత్రా మీడియాల్లో బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాటేమిటి? రాష్ట్రం బాబు చేతిలో అవినీతి ఆనకొండయ్యింది. తినేదంతా టీడీపీ నేతలో, కార్యకర్తలో, ఎంఎల్‌ఏలో, మంత్రులో ఇలా ఆధారాలతో ఏకరువు పెడితే ఇదంతా జగన్‌ మీడియా కల్లబొల్లి ఆరోపణలు అని బాబే కొట్టిపారేయడం విశేషం అయ్యింది. పక్కలో బల్లెంలాంటి సోషల్‌మీడియాలో వేలెత్తిచూపే న్యూస్‌స్టోరీలు అనుసరించే జనాలు బాబు అవినీతికి విస్తుపోతుండేవారు. మారానన్న బాబు మారడుగాక మారడని తెలుగువారు గుర్తించారు. సోషల్‌మీడియాను ఫాలోఅయితే, పాలనలో మార్పులు చేసుకోవచ్చని ప్రధాని నరేంద్రమోడీ పదేపదే తనక్యాడర్‌కు చెప్పడాన్ని కూడా బాబు పట్టించుకోలేదు.

బాబు దృష్టిలో పచ్చమీడియాయే మహామీడియాగా గుర్తింపబడింది. తనను ఎత్తిపొగడే పచ్చమీడియా కోరికలు తీరుస్తూ వారికి కోరిన భూమి పుట్టా చేతుల్లో పెడుతూ సాగారు. వారికే ఫుల్‌పేజీ ఏడ్సు, జాకెట్‌ఏడ్సు ఇచ్చేస్తూ వారిని సంతోష పరచడంలో చిన్నా పెద్ద మీడియాలకు ఇవ్వవల్సిన ఏడ్సు ఎండగడుతూ అప్రతిహాతంగా సాగారు. చంద్రబాబు ముదిమితో మదితప్పిన ఆలోచనలతో ఐదేళ్ల పాలనను తనకు తోచిన విధంగా నడిపించారు. పైగా, అహం ఆయన్ని కమ్మేసింది. తను ఏమిచేసినా చెల్లుబాటే అన్నట్లుగా సాగారు. ఆయన్ని, ఆయన పాలనను అసెంబ్లీలో తూర్పారపడితే తట్టుకోలేనితనం ఆయన్ని పూర్తిగా వెర్రి ఆవేశానికిలోను చేసింది.

దాంతో ప్రత్యర్ధులను మాట్లాడనీయకుండా తన మందిని ఎగదోసారు. అసెంబ్లీలో ఏమీ అడగడానికి లేదన్నట్లుగా తయారుచేసారు. లక్షకోట్లను తిన్నావు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెడతావని తనమందితో పదేపదే సభలో ప్రతిపక్ష నేతను దుయ్యబట్టించడంలో ఎనలేని ఆనందాన్ని బాబు పొందారు. ఇలా చేస్తే వైకాపా జనాల్లో చులకనై కనుమరుగవుతుందని అనుకున్నారు. కానీ, జనాలు బాబు అండ్‌కో తీరునే ఏవగించుకునేవారు. నిలదీసే ఎంఎల్‌ఏ రోజాను సభ నుంచి బహిష్కృతురాలిని చేసారు. వైకాపా ఎంఎల్‌ఏలు గెలిచిన 67 నియోజకవర్గాల్లో వారికి కాళ్లూ చేతులు ఆడకుండా చేసారు. వారికి ఎలాంటి ప్రోటోకాల్‌ వర్తించకుండా చూసారు. అక్కడ జన్మభూమి కమిటీలదే రాజ్యాధికారమన్నట్లు పాలనలో జొప్పించారు. ఇవన్నీ బాబుపై జనాల్లో ఏవగింపు పెరిగి ఆపైన కుదగొట్టాయి.

ఫలితంగా ఘోర పరాజయాన్ని తను తనపార్టీ యావత్తు చవిచూసేలా చేసాయి. ఇంతపతనం చవిచూసిన బాబును ఎత్తుకునే పచ్చమీడియా బాబును దించకుండా ఇంకా ఎత్తుకోవడంలోనే ఉంది. జనాలను మనం ఇంతగా వేధించామా అని బాబు బాధపడ్డట్లు కథనాన్ని వండివార్చాయి. ఆ మరుసటిరోజు క్యాడర్‌కు అధైర్యపడొద్దు. మేము అన్నింటా బాసటగా ఉంటామన్న భరోసా ఇచ్చినట్లు మరోకధనాన్ని జనాల్లోకి తీసుకుపోయారు. మాసంగతి దేముడు ఎరుగు. ముందు నీసంగతి చూసుకో చంద్రన్నా! జనాల్లోకి ఏముఖం పెట్టుకుని వెళ్లగలవు? ఏదో తప్పయ్యింది అనడానికి లేదు. తెలిసి చేసిన తప్పులతడకవు నీవు అని జనాలు విరుచుకుపడతారు అనేట్టు పార్టీ క్యాడర్‌లో గుసగుసలారంభం అయ్యాయి.

ఇక జగన్‌పాలన ఆరంభం అవుతుంది. లక్షల కోట్లు అప్పులు, జీతాలకు చెల్చించాల్సిన నిధులుపక్కకు మళ్లించిన వైనం, బాబు మెడకు చుట్టుకుంటుంది అని టీడీపీలో ప్రతిఒక్కరికి తెలుసు. వీరికంటే ముందే బాబుకు తెలుసు. అందుకే ఈవీఎమ్‌లు, వివి ప్యాట్‌లు బూట కాలని దేశంలో గల పలుపార్టీలనేతలను కలుసుకుని నోటికి వచ్చిన అబద్దాలు చెప్పి ఎగదోసారు. ఆ తర్వాత మోదీ తనను  ముంచడానికి చేయని ఎత్తుగడ లేదంటూ విమర్శలు గుప్పించారు. జూన్‌ 8వరకు నాకు పాలించే అధికారం ఉంది. ఎవరూ గెలిచినా ఓడినా నన్ను దించలేరన్నారు. ఇలా పచ్చ మీడియాకే కళ్లు పచ్చబడినట్లు పిచ్చిపిచ్చి ప్రేలాపనలతో 41రోజులు గడిపేసారు. ఫలితాల రోజున జనాలు 23సీట్లకు పరిమితంచేసి బాబును ఇంట్లో ఎంచక్కా కూర్చోబెట్టారు.

అయ్యో! జనాలను ఇంతకష్టపెట్టానా అనే మెత్తని మనస్సు గల నేత  బాబు కానేకాడు. 30వేలకోట్లు సంక్షేమపథకాల పేరిట ఇస్తే బుక్కేసి నాకు ఓటేయరా అని జనాలను తిట్టి పోసేరకం. అందుకే వాళ్లకు ఐదేళ్లు తోక కోసి ఉప్పుకారం అద్దాను అని మాటలాడే నేత చంద్రన్న. పైగా పచ్చమీడియా ప్రమేయం లేకుండా తనకు తానే కొన్ని నిజమైన వ్యాఖ్యలు బుధవారం పార్టీసమావేశంలో చేసారు. జగన్‌ పాలనకు కొంత అవకాశం ఇద్దాం. ఆయన ఇచ్చిన హామీలు ఏమేరకు ఎన్ని చేస్తాడో చూద్దాం ఆపైన స్పందిద్దామన్నారు. బాబు ఇస్తామన్న అవకాశం వరకు లేనేలేదు. బాబు చేసే వికృత పాలన నీడలు అనుక్షణం జగన్‌పాలనలో అడ్డంపడతాయి.

బాబు అన్ని శాఖల్లో తినమరిగిన తోడేలు అయ్యారు. ఏశాఖను ముట్టుకున్నా ఆశాఖలో పుచ్చపువ్వులా కన్పించే చంద్రన్న అవినీతి రేఖలు జగన్‌సర్కారుకు అడ్డంపడతాయి. ముందా అవినీతిరేఖలు పనిపడితే అప్పుడు ముందుకు సాగే పాలనబండి అవుతుంది. లేకుంటే పాలన అక్కడే ఆగిపోతుంది. పోలవరంకు ఇచ్చిన నిధులు ఎలా ఖర్చుచేసింది చెప్పండి అని కేంద్రం అడిగితే బాబు ఇవ్వకుండా తాత్సారం చేసారు. ఇప్పుడా ఖర్చులు జగన్‌ ఆరాతీసి అందులో అవినీతిని బయటికి లాగితేగాని కేంద్రం ఒక్క  రూపాయి రాల్చదు. ఇలా అన్నిశాఖల్లో చంద్రన్న మార్కు అవినీతి హస్తం నిక్షిప్తమై ఉంది.

మరోవైపు కోడికత్తి కేసు. ఇంకోవైపు వివేకానందరెడ్డి హత్యకేసు ఇలాంటి నేరాలు బాబును తరుముకుంటూ ఆవరిస్తాయి. జగన్‌ ఉసిగొలపకుండానే చట్టం దాని పని అది చేసుకుంటూపోతుంది. ఇవన్నీ బాబుకు తెలియంది కాదు. అందుకే ఓటమిని అసలు జీర్ణించుకోలేక ఇంట్లో బిక్కుబిక్కుమని పోసాగారు. ఎన్‌టీఆర్‌ను వాడు వీడు అని ఎన్నికల ముందు ఓపచ్చమీడియా పెద్దమనిషి ముందు మాట తూలిన వైనం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. చంద్రన్న తిరిగి ఎన్‌టీఆర్‌ జయంతి పేరిట కలుగులోంచి బయటికి వచ్చి ఎన్‌టీిఆర్‌ విగ్రహానికి హారతులు పట్టాల్సి వచ్చింది. ఎంతగా పార్టీలోంచి ఎన్‌టీఆర్‌ శేషం లేకుండా చేద్దామన్నా కుదిరి చావట్లేదు అని లోలోపల అనుకుంటునే హారతులు ఇచ్చారు.

ఐదేళ్లూ ఎన్‌టీఆర్‌ బొమ్మ ముందుపెట్టి సాగాలి. బాబు వదులుకుందామనుకున్నా వదలని ఎన్టీఆర్‌ నీడలు. ఇప్పుడు గెలిచిన ఎంపీలు, ఎంఎల్యేలు బాబు ఇటు పిలిస్తే అటు పలికేలా ఉంటూ అంతా కాకపోయినా కొద్దిమంది జారిపోతారు. అందులో ఫిరాయింపులకు, వెన్నుపోట్లకు ఆల వాలమైన టీడీపీలో వెన్నతో పెట్టిన విద్యలాంటిది. ఒకవైపు క్యాడర్‌ జారిపోకుండా బాబు చూడాల్సి ఉంది. ఆపైన తను చేసిన అవినీతిపాలనలో అవకతవకలకు మెడకు చుట్టుకునే కేసులకు స్పందిస్తూ బాబు నిద్రాహారాలు మానుకుని ముళ్ల మీద కత్తిసాము చేయడమే. ఇక బాబులో నిండిపోయిన అహం, అనుక్షణం ఎత్తుకునే పచ్చమీడియా అధికారంలో లేని బాబును ఏవిధంగా రక్షించలేవు. చంద్రబాబు ఇకపట్టులో పిట్టలా రేపటి పాలకులకు జవాబుదారి కాకతప్పదు.

Link to comment
Share on other sites

తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నది సామెత. మోడీ లాంటి బలమైన మిత్రుడిని శతృవును చేసుకునే వరకు, చేసే వరకు నిద్రపోలేదు, బాబుగారి, ఆయన పార్టీ హితవు కోరే ఓ మీడియా. వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతిని చేసిన దగ్గర నుంచి రకరకాలుగా వార్తలు, కథనాలు వండి వార్చి బాబుకు-మోడీకి మధ్య ఎడం ఎంత పెంచాలో అంతా పెంచేసారు. అదే సమయంలో మోడీకి వ్యతిరేకంగా కథనాలు వండి వార్చారు. ఆంధ్ర జనాల్లో మోడీని భయంకరమైన భూతం మాదిరి చూపించి, తద్వారా తేదేపాకు ఓట్లు రాబట్టాలని చూసారు.

కానీ ఇదంతా వికటించింది. మోడీ అభిమానులు తెలుగుదేశానికి పూర్తిగా దూరం అయ్యారు. కేవలం మూడు ఎంపీ సీట్లు, అది కూడా అతి కష్టం మీద రావడానికి కారణం అదే. సరే, ఆంధ్ర సంగతి అలావుంచితే తెలంగాణలో మాత్రం కేసిఆర్ పదిలంగా ఎందుకు వుండాలి? కేసిఆర్ ను కూడా మోడీకి దూరం చేద్దాం అనే ప్రణాళికలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పడిప్పుడే అంతంతమాత్రంగా వున్నాయి మోడీ-కేసిఆర్ బంధం. కానీ మోడీ బలం చూసిన తరువాత కేసిఆర్ దూరం జరిగే ధైర్యం చేయరు. మరి అలాంటపుడు ఏం చేయాలి. దూరం జరిగేలా చేయాలి. తెలంగాణలో భాజపా అర్జెంట్ గా ఏదో చేసేయబోతోందని, ఏదో చేసేస్తుందని కథనాలు వండి వారిస్తే, కేసిఆర్ తన అస్తిత్వం కూడా పోరాటం మొదలుపెట్టేస్తారు. దాంతో మోడీ దూరం అయిపోతారు.

అప్పుడు గతంలో ఇదే మీడియా ఆశించిన తెలుగుదేశం-తెరాస పొత్తు సాధ్యమైతే తెలంగాణలో మళ్లీ తాము పాగా వేసేయవచ్చు. అసలే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి కీలకమద్దతు దారులైన కమ్మ సామాజిక వర్గం పప్పులు ఉడకడంలేదు. పైగా ఆంధ్రలో కూడా పగోడు వచ్చి పగ్గాలు చేతపట్టాడు. అందువల్ల మెలమెల్లగా కథనాలు రాసి, రాసి, పలుకులు పలికి పలికి, కేసిఆర్ ను కూడా మోడీకి దూరంగా లాగేస్తే, ఓ పనైపోతుంది అనే ఆలోచన కనిపిస్తోంది.

ఇలాంటి రాంగ్ గైడెన్స్ ఇచ్చే బాబుకు, ఆయన పార్టీకి ఈ పరిస్థితి వచ్చేలా చేసారు. ఈ మాటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. బాబుకు ఆ మీడియా శల్య సారథ్యం చేసి, కింద పడేసిందని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పడు కేసిఆర్ దగ్గర వచ్చారు. ఆయన ఈ మీడియా మాటలు పట్టించుకుంటారో? దూరం పెడతారో? చూడాలి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...