Jump to content

మాట్రి‘మనీ’ మోసం..!

Paidithalli

Recommended Posts

మాట్రి‘మనీ’ మోసం..! 
 
ఏడాదిన్నర కాలంలో రూ.కోటి కొట్టేసిన కేటుగాళ్లు 
వితంతువులు.. రెండో పెళ్లికి సిద్ధమైన మహిళలే లక్ష్యం 
బహుమతులు తెస్తూ విమానాశ్రయంలో చిక్కామంటూ బురిడీ 

hyd-gen5a_183.jpg

‘మాట్రిమొనీ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుంటారు.. వితంతువులను, రెండో పెళ్లి చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్న మహిళల్ని లక్ష్యంగా చేసుకుంటారు.. విదేశాల్లో ఉన్న తమకు సంప్రదాయంగా ఉండే తెలుగు మహిళలంటే ఇష్టం అని నమ్మబలుకుతారు.. కొద్దిరోజులపాటు వాట్సాప్‌లో సంభాషణలు సాగించిన అనంతరం మన స్నేహానికి గుర్తుగా విలువైన బహుమతుల్ని తీసుకొస్తున్నామని ఆశ పెడతారు.. మిమ్మల్ని కలిసేందుకు వస్తే విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారని వాపోతారు.. విడిపించేందుకు సహకరించాలని కోరుతూ వీలైనంత మేర డబ్బును కొట్టేస్తారు..’ ఈ తరహాలో మాట్రిమొనీ వెబ్‌సైట్లను వేదికగా చేసుకొంటున్న సైబర్‌ నేరగాళ్ల మోసాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే ఏడాదిన్నర కాలంలో బాధితురాళ్లను నమ్మించి రూ.కోటి వరకు కాజేయడం గమనార్హం.

గొర్రె కసాయివాడినే నమ్మినట్లు మాట్రిమోనీ వెబ్‌సైట్లలో పేర్లు నమోదు చేసుకుంటున్న మహిళలు.. సైబర్‌ నేరగాళ్లను నమ్మి భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ మోసంలో భాగంగా తొలుత ఆయా సైట్లలో నేరస్థులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. అలా వెబ్‌సైట్‌ నిర్వాహకుల నుంచి పెళ్లి సంబంధాల ప్రొఫైళ్లను చూసేందుకు అనుమతి పొందుతున్నారు. అనంతరం తమ వలకు చిక్కే బాధితురాళ్లనే ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా విడాకులు పొంది రెండో పెళ్లి చేసుకునేందుకు సంబంధాలను వెతుకుతున్న మహిళలు, వితంతువులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.తొలుత వాట్సాప్‌లో సంభాషణలు.. ఆతర్వాత నేరుగా ఫోన్‌లో మాటలు.. మరికొందరైతే ఏకంగా వీడియో కాల్‌లోనే సంభాషిస్తున్నారు. తాము విదేశాల్లో ఉంటున్నామని, భారీగా ఆస్తి ఉందని, భారతీయ మహిళలు, సంప్రదాయాలు అంటే ఇష్టమని చెబుతూ నమ్మిస్తున్నారు. అనంతరం అసలు మోసానికి తెర తీస్తున్నారు.

hyd-gen5b_83.jpg

హనీ.. డియర్‌.. డార్లింగ్‌ 
బాధితురాళ్ల ఎంపికలో సైబర్‌ మోసగాళ్లు పకడ్బందీ ప్రణాళిక అమలు చేస్తున్నారు. తొలుత మాట్రిమొనీ వెబ్‌సైట్‌లో మహిళల ప్రొఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వితంతువులను, భర్తను పోగొట్టుకొని/విడిపోయి రెండో పెళ్లికి సిద్ధంగా ఉన్న ఒంటరి మహిళలనే ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా వివిధ వృత్తుల్లో స్థిరపడి దండిగా డబ్బు సంపాదిస్తున్న వారినే ఎంపికలో ప్రాధాన్యమిస్తున్నారు. అనంతరం వారికి సంబంధించిన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. తదితర సామాజిక మాధ్యమ ఖాతాల్ని అధ్యయనం చేసి వారి అభిరుచుల్ని పసిగడుతున్నారు. తర్వాత రంగంలోకి దిగి వాట్సాప్‌ సంభాషణల్లోకి దిగుతున్నారు. అవసరమైతే నేరుగా చరవాణుల ద్వారా సంభాషిస్తున్నారు. ఈక్రమంలో బాధితురాళ్లకు దగ్గరయ్యేందుకు ‘హనీ’, ‘డియర్‌’, ‘డార్లింగ్‌’ అంటూ సంబోధిస్తున్నారు. అదివరకే వారి అభిరుచుల గురించి తెలుసుకొని ఉంటున్నారు కాబట్టి వాటికి అనుగుణంగా నడుచుకుంటూ బాధితురాళ్ల మనసు చూరగొంటున్నారు.

తెర పైకి ‘విలువైన బహుమతులు’ 
అలా కొద్దిరోజులపాటు సంభాషణలు సాగించిన అనంతరం త్వరలోనే స్వయంగా హైదరాబాద్‌కు వస్తున్నాననో.. లేదంటే తన ప్రతినిధిని పంపుతున్నాననో బాధితురాలికి కబురు పంపుతున్నారు. మన స్నేహానికి గుర్తుగా గిఫ్ట్‌బాక్స్‌(రూ.కోట్ల విలువ)ను వెంట తెస్తున్నానని చెప్పి.. సదరు బహుమతులు ఇవేనంటూ వజ్రాభరణాలు, చరవాణులు, ఖరీదైన గడియారాలు, నగలు తదితర ఫొటోలను వీడియోలను బాధితురాలి వాట్సాప్‌కు పంపుతున్నారు. ఇక్కడే బాధితురాళ్లు బోల్తా పడుతున్నారు. తొలుత బహుమతులు వద్దంటూ కొందరు తిరస్కరిస్తున్నా.. నేరగాళ్ల ఒత్తిడి మేరకు అంగీకరిస్తున్నారు. అలా బాధితురాలి అంగీకారం కుదిరిన వెంటనే ఫలానా రోజు దిల్లీకి చేరుకుంటానని చెబుతున్నారు.

విమానాశ్రయంలో కస్టమ్స్‌కు చిక్కా.. 
అప్పటివరకు విదేశీ ఫోన్‌ నంబర్‌తో మాట్లాడుతున్న మోసగాళ్లు.. సరిగ్గా ఆ రోజు భారత్‌ చరవాణి నంబరును వినియోగించడం ఆరంభిస్తున్నారు. అలా తాము దిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకున్నానంటూ ఫోన్‌లో చెబుతున్నారు. తర్వాత కొంతసేపటికే మళ్లీ ఫోన్‌ చేసి విలువైన బహుమతులతో కూడిన గిఫ్ట్‌బాక్స్‌ను విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను విడిపించేందుకు సహకరించాలని అర్థిస్తున్నారు. అవసరమైతే ఏడ్చేస్తున్నారు. అలా బాధితురాళ్లకు ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమొత్తం డబ్బు కడితే తప్ప గిఫ్ట్‌బాక్స్‌తో సహా తమను వదిలిపెట్టేలా లేరని బుకాయిస్తున్నారు. ఎలాగూ కొంతసేపట్లో విలువైన బహుమతులు తమకు చేరుతాయి కదా అనే ఆశతో ఉంటున్న బాధితురాళ్లు.. మోసగాళ్లు చెప్పే బూటకపు కబుర్లను నమ్మి డబ్బు కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో మోసగాళ్ల ముఠాకే చెందిన మరొకరు కస్టమ్స్‌ అధికారుల పేరుతో ఫోన్‌ చేసి తాము సూచించే బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. అలా కస్టమ్స్‌ సుంకం, ఆర్‌బీఐ టాక్స్‌, యాంటీ టెర్రరిస్ట్‌ ఫండ్‌.. అంటూ రకరకాల పేర్లతో బాధితురాలి నుంచి అందినకాడికి దండుకొని తర్వాత ఫోన్లు ఆపేస్తున్నారు. అప్పటికిగానీ బాధితురాళ్లు తాము మోసపోయామని గుర్తించలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పురుషులూ ఈ మోసగాళ్ల బారిన పడుతూ డబ్బులు పోగొట్టుకుంటుండటం కొసమెరుపు.

సైబరాబాద్‌లో నమోదైన కేసుల వివరాలు ఇలా.. 
సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గత ఏడాది 19 కేసులు నమోదుకాగా.. బాధితురాళ్లు దాదాపు రూ.అరకోటి సమర్పించేసుకున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి మాట్రిమొనీ మోసాలపై ఇప్పటికే 21 ఫిర్యాదులందాయి. వీటిల్లో 9 ఘటనలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్లు నమోదు చేశారు. ఈ తొమ్మిది కేసుల్లోనే బాధితురాళ్లు సుమారు రూ.అరకోటికిపైగా పోగొట్టుకోవడం గమనార్హం.

నేరుగా సంప్రదించకుండా నమ్మొద్దు 
రోహిణి ప్రియదర్శిని, క్రైమ్స్‌ డీసీపీ, సైబరాబాద్‌ 
మాట్రిమొనీ సైట్లలో పెళ్లి సంబంధాల ప్రొఫైళ్లు చూసినంత మాత్రాన నేరుగా సంప్రదించకుండా అపరిచితుల్ని నమ్మొద్దు. ఏమాత్రం సంబంధం లేకుండా భారీమొత్తంలో విలువైన బహుమతులను ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా ఉండరు. కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నా వ్యక్తిగత ఖాతాలకు నగదు బదిలీ చేయించుకునే పరిస్థితి ఉండదని తెలుసుకోవాలి. అలా చెబుతున్నారంటే అది తప్పనిసరిగా మోసమే అని గ్రహించాలి.

Link to comment
Share on other sites

27 minutes ago, Paidithalli said:

Yaa reverse lo kooda jarguthayi, good looking papala pics petti, stamping kosam India ocha ani biscuit esindi, oka fafa... but I was able to figure it out, but 2 weeks pattindi 

Link to comment
Share on other sites

3 minutes ago, jajjanaka_jandri said:

Yaa reverse lo kooda jarguthayi, good looking papala pics petti, stamping kosam India ocha ani biscuit esindi, oka fafa... but I was able to figure it out, but 2 weeks pattindi 

కొన్ని సందర్భాల్లో పురుషులూ ఈ మోసగాళ్ల బారిన పడుతూ డబ్బులు పోగొట్టుకుంటుండటం కొసమెరుపు.

Link to comment
Share on other sites

7 hours ago, r2d2 said:

కొన్ని సందర్భాల్లో పురుషులూ ఈ మోసగాళ్ల బారిన పడుతూ డబ్బులు పోగొట్టుకుంటుండటం కొసమెరుపు.

yup, koncham close ayyaka, I have a family emergency ani cheppi money nokkestharu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...