Jump to content

నేడే కేబినెట్‌ తొలి భేటీ

snoww

Recommended Posts

నేడే కేబినెట్‌ తొలి భేటీ

ఎనిమిది ప్రధాన అంశాలపై చర్చ.. నిర్ణయం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర మంత్రిమండలి తొలిసారిగా సోమవారం భేటీ కానుంది. ఉదయం 10:30 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో 8 అంశాలపై ప్రధానంగా చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. ఈ 8 అంశాలను కేబినెట్‌ భేటీకి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయా శాఖల నుంచి సమాచారాన్ని తెప్పించారు. సామాజిక పింఛనును రూ.2వేల నుంచి రూ.3వేల వరకూ పెంచుకుంటూ పోతామని ఎన్నికల ముందు జగన్‌ ప్రకటించారు. అందులో భాగంగా మొదటి విడతగా రూ.250 పెంచుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడే తొలి సంతకం చేశారు. ఈ పెంపును కేబినెట్‌ ఆమోదించనుంది. అలాగే సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్లోకి ప్రవేశించినపుడు ఆశా వర్కర్లకు వేతనాన్ని రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ జగన్‌ తొలి సంతకం చేశారు. దానికీ కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనుంది. అక్టోబరు నుంచి అమలు చేయనున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా రూ.12,500 చెల్లించే పథకానికి కేబినెట్‌ సమ్మతం తెలపనుంది. ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటించేందుకు అనుమతించనుంది. అలాగే కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) రద్దు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, హోంగార్డుల వేతనాల పెంపు, మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. చర్చ అనంతరం వీటిపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వీటితోపాటు మరికొన్ని కొత్త అంశాలూ చర్చకు వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సచివాలయంలో కార్యాలయాలను పరిశీలించిన మంత్రులు
ఈనాడు డిజిటల్‌, అమరావతి: మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తికావడంతో వారికి పేషీ(కార్యాలయం)ల ఏర్పాటుపై సాధారణ పరిపాలన శాఖ దృష్టిసారించింది. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో ఉన్న పురపాలకశాఖ మంత్రి పేషీని పరిశీలించారు. సతీమణి ఝాన్సీతో కలిసి సచివాలయానికి చేరుకున్న ఆయన పేషీని, పురపాలక శాఖ కమాండ్‌ కంట్రోల్‌ రూంను పరిశీలించారు. అవసరమైన మార్పులు, చేర్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు. దేవాదాయశాఖ, విద్యాశాఖ మంత్రుల పేషీలను దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అనుచరులు పరిశీలించారు.

Link to comment
Share on other sites

33 minutes ago, Kuppampsyco said:

Roja lekunda suddatam kastamgane undi

roja ni meere social media lo lepinaru bhayya, ame kanna better qualified ministers chal mandi unde list lo

ministry anedi asha mashi kadu, roja noti durusu inka baga control chesukovali

women's wing ni baga  develop chesindi, rajanna canteen's ni mundu ki tisuku vellindi, kani paripakvathanam anedi inka raledu, lets see anduke 2 1/2 years lo 90% ministers ni marusthanu antunnadu ga, may be next term lo chance vache avakasam undi

Link to comment
Share on other sites

2 minutes ago, bhaigan said:

Recent times norru koosintaa adupulone petti..matured ga undhi. Jagan tho kasta kaalam lo unna women leader roja and also she faced a lot during tdp rule. Kodali nani, anil yadav, darmana krishna das eela laga first nunchi unnadi roja. She definitely deserves. 1st list lo undalsina candidate

  • Upvote 1
Link to comment
Share on other sites

11 minutes ago, Kuppampsyco said:

Recent times norru koosintaa adupulone petti..matured ga undhi. Jagan tho kasta kaalam lo unna women leader roja and also she faced a lot during tdp rule. Kodali nani, anil yadav, darmana krishna das eela laga first nunchi unnadi roja. She definitely deserves. 1st list lo undalsina candidate

she will surely get chance in second expansion after 2.5 years. 

Jagan is not use and throw type like CBN. He will surely reward in future. 

Link to comment
Share on other sites

6 minutes ago, snoww said:

she will surely get chance in second expansion after 2.5 years. 

Jagan is not use and throw type like CBN. He will surely reward in future. 

She will surely be rewarded. Roja akka ki mundala isthe bagundu ani naa yoka abhiprayam

Link to comment
Share on other sites

2 hours ago, bhaigan said:

yes

2 hours ago, snoww said:

will be huge if he does that

Huge ante govt ki burden Or employees lo jagannna palukubadi or both 😀

Link to comment
Share on other sites

1 hour ago, bhaigan said:

roja ni meere social media lo lepinaru bhayya, ame kanna better qualified ministers chal mandi unde list lo

ministry anedi asha mashi kadu, roja noti durusu inka baga control chesukovali

women's wing ni baga  develop chesindi, rajanna canteen's ni mundu ki tisuku vellindi, kani paripakvathanam anedi inka raledu, lets see anduke 2 1/2 years lo 90% ministers ni marusthanu antunnadu ga, may be next term lo chance vache avakasam undi

Roja kanna RK , Srikanth reddy more elgible anipistadi, roja aunty ki kuda istadu Edo chairman etc ubtavi kada

Link to comment
Share on other sites

2 hours ago, kothavani said:

Roja kanna RK , Srikanth reddy more elgible anipistadi, roja aunty ki kuda istadu Edo chairman etc ubtavi kada

Srikanth ki already chief whip icharu

Roja ki RTC istunaru

Inga RK ki em istaro ?

Link to comment
Share on other sites

6 minutes ago, Android_Halwa said:

I was hoping RK would be made a minister..I'm sure he is worth of ministry...bagane kastapadinattu vunadu...

Karan ki ttd board member post anta kada

Link to comment
Share on other sites

10 hours ago, bhaigan said:

roja ni meere social media lo lepinaru bhayya, ame kanna better qualified ministers chal mandi unde list lo

ministry anedi asha mashi kadu, roja noti durusu inka baga control chesukovali

women's wing ni baga  develop chesindi, rajanna canteen's ni mundu ki tisuku vellindi, kani paripakvathanam anedi inka raledu, lets see anduke 2 1/2 years lo 90% ministers ni marusthanu antunnadu ga, may be next term lo chance vache avakasam undi

Ade plan baa. Okavela ivvakapothe adi yedaina Jaggad ki opposite ga matladudhi anedi veella chinna aasha. But ippudu adi Jaggad ni yemi analedu. Daniki Ministery ivvadam kante inkokati ichukovatam jaga ki better lekunte Minister ga vundi aa gabbu mouth tho CBN ni yedo okati ante vadiki sympathy like By election :giggle:

Link to comment
Share on other sites

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలివే..  
* సీపీఎస్‌ రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం. ఆర్థిక మంత్రి ఛైర్మన్‌గా దీనిపై కార్యాచరణ కమిటీ  ఏర్పాటు.
* గిరిజన ప్రాంతాల్లోని కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు వేతనం రూ.4వేలకు పెంపు
* ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రైతు కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం. దీనిలో ఆరు లేదా ఏడుగురు సభ్యులు ఉంటారు. దీనిలో రైతు సంఘ నాయకులు, నిపుణులు సభ్యులుగా ఉంటారు. వ్యవసాయంలో పురోగతి, రైతు సంక్షేమం, ధరల స్థిరీకరణను ఈ కమిషన్‌ పర్యవేక్షిస్తుంది. త్వరలోనే ఇది ఏర్పాటు.
* గ్రామ వాలంటీర్లను పార్టీలకతీతంగా పారదర్శకంగా ఎంపిక చేస్తాం. పట్టణాల్లో వాటికి ఉత్తీర్ణత డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత, గిరిజన ప్రాంతాల్లో పదో తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించాం. ఆగస్టు 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం. గ్రామ సచివాలయానికీ అవసరమైన ఉద్యోగాల నియామకం చేపడతాం.
* ఆర్టీసీ కార్మికుల సమస్యలపై గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్ని కమిటీల రద్దు. 
* ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకొస్తాం.
* తితిదే పాలకమండలిని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం
* ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వ్యాధుల్ని తీసుకొస్తాం.
* అక్టోబర్‌ 15న రైతుభరోసా ప్రారంభం. ఈ పథకం కింద రైతులకు రూ.12,500 చొప్పున ఏడాదికి అందజేయనున్నాం. రాష్ట్రంలో సుమారు 50 లక్షలకు పైగా రైతులకు ప్రయోజనం కలగనుంది.
* రైతులకు· వడ్డీలేని రుణాలు అందించాలని కేబినెట్‌ నిర్ణయం. వైఎస్సార్‌ పేరుతో కార్యక్రమానికి రూపకల్పన. పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతుకూ వడ్డీ చెల్లించే అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులతో ఒప్పందం చేసుకుని ఆ వడ్డీలను బ్యాంకులకు చెల్లిస్తుంది. వడ్డీ రశీదును గ్రామ వాలంటీర్ల ద్వారా రైతులకు అందజేస్తాం.
* 2014 నుంచి 2019 వరకు రైతులకు చెల్లించకుండా ఉంచిన రూ.2వేల కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలను తక్షణమే చెల్లించాలని నిర్ణయం. 
* ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి కింద రూ.2వేల కోట్లతో ఏర్పాటు
* రూ.3వేల కోట్లతో మార్కెట్‌ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు నిర్ణయం.
* పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఉచిత బోర్ల ఏర్పాటుకు పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రిగ్గులను అందుబాటులో ఉంచి ప్రాధాన్యతల వారీగా ఉచితంగా బోర్లు వేయించాలని నిర్ణయం.  
* పండించిన పంటకు కనీస మద్దతు ధర రాని చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం
పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం. పంట నష్టం జరిగి క్లెయిమ్‌ను రైతుకు అందజేసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది.
* గ్రామాల్లో అర్హత కలిగి ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి ఇళ్ల స్థలాలు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ ఇంటి ఇల్లాలి పేరుపై రిజిస్ట్రేషన్‌ చేసి ఉగాది రోజున పట్టాలు అందివ్వాలని నిర్ణయం. రెండో ఏడాది నుంచి పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం.. 25 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయం.
* జ్యుడీషియల్‌ కమిటీ ఏర్పాటు చేయాలని సీజేను సీఎం కోరారు.
* అమ్మ ఒడి కార్యక్రమం జనవరి 26 నుంచి ప్రారంభం. అదే రోజున పిల్లల్ని చదివించే ప్రతి తల్లికీ చెక్కుల్ని అందించాలని నిర్ణయం.
* సహకార రంగం పునరుద్ధరించాలని కేబినెట్‌ నిర్ణయం. మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.
* జులై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27శాతం మధ్యంతర భృతి అమలు చేయాలని నిర్ణయం. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.815 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ నిర్ణయంతో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 
* అర్హత, అనుభవం ఆధారంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్‌ నిర్ణయం. దీనిపై కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
* అన్ని విభాగాల్లోని కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికులకు రూ.18వేల వేతనం ఇవ్వాలని నిర్ణయం. దీని అమలుకు ‘కమిటీ ఆఫ్‌ సెక్రటరీస్‌’ ఏర్పాటు.
* మెప్మా, సెర్ప్‌లో డ్వాక్రా మహిళా సంఘాలకు సేవలందిస్తున్న ఉద్యోగులకు రూ.10వేల గౌరవవేతనం అందివ్వాలని నిర్ణయం.
* అంగన్వాడీ వర్కర్లు, ఆయాలకు వేతనం పెంపు. అంగన్వాడీ వర్కర్ల వేతనం 11,500కు పెంపు.
* రేషన్‌ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం. మరో ఐదు లేక ఆరు నిత్యావసర సరకులు పంపిణీ.. సెప్టెంబర్‌ 5 నుంచి అమలు. గ్రామవాలంటీర్ల ద్వారా ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీకి నిర్ణయం.
* ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయం. ప్రస్తుతం ఉన్న పాఠశాలల యథాస్థితిని ఫొటోలు తీసి, వాటిని మరమ్మతులు చేయించి తర్వాత మళ్లీ ఫొటోలు తీసి ఎలా మారాయనేది వివరించనున్నారు.  
* మధ్యాహ్న భోజనం కార్మికుల వేతనాలను రూ.3వేలకు పెంపు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...