Jump to content

అమృతకు చిల్లిగవ్వ కూడా దక్కొద్దు!


snoww

Recommended Posts

అమృతకు చిల్లిగవ్వ కూడా దక్కొద్దు!
13-06-2019 03:55:48
 
636959949496307870.jpg
  • మారుతీరావు వీలునామా.. పరువు తీసిందన్న కసి
  • ప్రణయ్‌ హత్యకు రూ.కోటితో సుపారీ
  • చార్జిషీట్‌లో వెల్లడించిన పోలీసులు
నల్లగొండ, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): కూతురంటే వల్లమాలిన ప్రేమ.. కానీ, ఆ ప్రేమే ద్వేషంగా మారింది.. తన గారాలబిడ్డ కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని భావించాడు.. తన కూతురు రిసెప్షన్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని పథకం పన్నాడు. కూతురికి ఆస్తి దక్కకూడదని, ఆమె భర్త కూడా ఉండకూడదని నిశ్చయించుకున్నాడు. రూ.కోటి సుపారీ ఇచ్చి మరీ ప్రణయ్‌ని హత్య చేయించాడు.. ఇదీ మిర్యాలగూడకు చెందిన మారుతీరావు నిర్వాకం. సంచలనం సృష్టించిన అమృత భర్త ప్రణయ్‌ హత్య కేసులో నల్లగొండ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. ప్రణయ్‌ హత్యకు మాజీ ఐఎ్‌సఐ తీవ్రవాదులతో మారుతీరావు కోటి రూపాయలకు డీల్‌ కుదుర్చుకున్నాడని పేర్కొన్నారు.
 
తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా అమృతకు చెందకూడదని, తన స్వార్జితమైన ఆస్తులపై ఆమెకు ఎటువంటి హక్కు లేదని వీలునామాలో స్పష్టం చేశాడని.. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన పరువు హత్య అని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత సెప్టెంబరు 14న జరిగిన ప్రణయ్‌ హత్య కేసును జిల్లా ఎస్పీ రంగనాథ్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తొమ్మిది నెలలపాటు సమగ్ర విచారణ జరిపిన అనంతరం బుధవారం చార్జిషీట్‌ దాఖలు చేశారు. అందులో ఏముందంటే.. ‘‘తన ఏకైక కూతురు అమృతవర్షిణి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్‌ని ప్రేమ వివాహం చేసుకోవడంతో మారుతీరావు పరువు పోయినట్లుగా భావించారు. మిర్యాలగూడలో ప్రణయ్‌, అమృత రిసెప్షన్‌ నిర్వహించి ఆ వీడియోలను మిర్యాలగూడలోని చాలా మందితో పాటు మారుతీరావు బంధువులకూ షేర్‌ చేయడంతో ప్రణయ్‌ హత్యకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. మిర్యాలగూడలోని కిరాయి ముఠాలతో సంప్రదించినా ఫలితం లేకపోవడంతో మిత్రుడు కరీం ద్వారా నల్లగొండలోని ఐఎ్‌సఐ మాజీ తీవ్రవాదులు బారీ, అస్గర్‌అలీలను సంప్రదించాడు.
 
అస్గర్‌అలీకి రాజమండ్రి జైల్లో కలిసిన బిహార్‌ వాసి సుభా్‌షశర్మ గుర్తొచ్చాడు. దీంతో కరీంను పిలిచి హత్యకు ప్రణాళిక రూపొందిస్తానని చెప్పాడు. రూ.కోటి ఇస్తే ఈ హత్య పథకాన్ని పూర్తి చేస్తానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత సుభా్‌షశర్మకు ప్రణయ్‌ హత్య గురించి వివరించి రూ.15లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని బిహార్‌ నుంచి రప్పించారు. అతను మిర్యాలగూడలో కరీం ఇంట్లో షెల్టర్‌ తీసుకున్నాడు. 45 రోజుల పాటు మకాం వేసిన సుభా్‌షశర్మ పలుమార్లు ప్రణయ్‌ హత్య కోసం రెక్కీ నిర్వహించాడు. రెండు సార్లు ప్రణయ్‌ హత్యాప్రయత్నం విఫలమైంది. మూడోసారి అమృతవర్షిణి ఆస్పత్రికి వెళ్లిన సమయంలో మారుతీరావు ఇచ్చిన పక్కా సమాచారంతో సుభా్‌షశర్మ ప్రణయ్‌ని హత్య చేశాడు. బారీ, అస్గర్‌అలీ సంఘటనా స్థలానికి సమీపంలోనే ఉండి హత్యను పర్యవేక్షించారు.’’ అని చార్జిషీటులో పేర్కొన్నారు.
 
మారుతీరావుకు ఉరే సరి..
ప్రణయ్‌ హత్య కేసులో మారుతీరావుకు ఉరి శిక్షే సరైందని, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సమర్పిస్తున్నట్లు పోలీసులు చార్జిషీట్‌లో ఉటంకించారు. ప్రణయ్‌ హత్య కోసం కోటి రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడని, ఇందుకుగాను బ్యాంకు నుంచి నగదు డ్రా చేయడం, దాన్ని కరీం ద్వారా బారీ, అస్గర్‌అలీలకు చేరవేశారంటూ ఆధారాలను చార్జిషీట్‌లో పేర్కొన్నారు. మొత్తం 120 మందిని విచారించిన పోలీసులు 1600 పేజీల్లో చార్జిషీట్‌ నివేదికను పొందుపర్చి హత్యలో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చారు.
 
 
Link to comment
Share on other sites

2 minutes ago, LastManStanding said:

India lo gofundme lantidi untunda? Unte e Amrutha millions earn chesedi emo 

millions kadu

crores fro sure

Link to comment
Share on other sites

Just now, kevinUsa said:

millions kadu

crores fro sure

Yes bro! Nuvvu nenu movie type fans andaru donate chese vallu tala oka 100

Link to comment
Share on other sites

3 minutes ago, kevinUsa said:

millions kadu

crores fro sure

arey kevinu, avasarama manaku ivvanni. asalu aa pilla ippudu yekkadundho kuda evadiki telvadu.

Link to comment
Share on other sites

3 minutes ago, LastManStanding said:

Yes bro! Nuvvu nenu movie type fans andaru donate chese vallu tala oka 100

naya paisalu kuda ivvaru baa.

Link to comment
Share on other sites

1 minute ago, shamsher_007 said:

naya paisalu kuda ivvaru baa.

Mee peddollunnare ane batch untaru kadha bro..valla deggara paisalu emi ekkuva undav anuko tbh

  • Upvote 1
Link to comment
Share on other sites

12 minutes ago, LastManStanding said:

India lo gofundme lantidi untunda? Unte e Amrutha millions earn chesedi emo

government ichindi anukunta kada money and land

government job kooda vasthadi soon 

Link to comment
Share on other sites

Just now, snoww said:

government ichindi anukunta kada money and land

government job kooda vasthadi soon 

Veellu inka fast ga unnaru kadha bro..anthe le votes >> cash

Link to comment
Share on other sites

eedu elago Bail mida baitaki vachadu. Malli velle chance ledhu. High Ct 10yrs, Supreme Ct 20 yrs, president - again supreme ct - 40 yrs time

verdict vache sariki inko 50 Yrs for sure  aa lopu eede old-age Natural death aiythadu. Happy ga bail mida vundochu life long

Link to comment
Share on other sites

Maruti Rao ankul paisal iyakapothey Amrutha bratakadam kastame...In laws degara aithe pedaga paisal vunatu aithe kanipiyaledu, in las will start to feel as a burden of not already...

Edo oka roju Amrita has to go back to their parents...only the question when anthe...

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...