Jump to content

ఆమెకు 50.. అతనికి 60 సహజీవనం కోసం ఉపాధ్యాయిరాలిపై ఒత్తిడి అంగీకరించలేదని కాల్చివేత.. ఆపై నిందితుడి ఆత్మహత్య


kevinUsa

Recommended Posts

మడికెరి, న్యూస్‌టుడే: ఆమె వయస్సు యాభై.. అతని వయస్సు అరవై.. ఇద్దరూ ఒంటరివారే. తనతో జీవితాన్ని గడపాలని అతడు ఆమెను బలవంతపెట్టాడు. ఆమె ససేమిరా అనటంతో కోపం పెంచుకున్నాడు. బడికి వెళ్లేందుకు బస్టాప్‌లో ఎదురుచూస్తున్న సమయంలో రివాల్వర్‌తో కాల్చి చంపాడు. ఆపై సమీప కాఫీతోటల్లోకి వెళ్లి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. దారుణ ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేట తాలూకా బాళలె గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. హతురాలిని ఆశా కావేరమ్మ, నిందితుడిని జగదీష్‌గా గుర్తించారు. ఆశా కావేరమ్మ విరాజ్‌పేట సమీప గోణికొప్పలులోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. భర్త మృతిచెందడంతో ఒంటరిగా ఉంటున్నారు. భార్యను కోల్పోయిన జగదీష్‌ అనే వ్యక్తి సహజీవనం చేయాలనే ఆశతో ఆమెను సంప్రదించాడని, ఆమె దాన్ని వ్యతిరేకించిందని సమాచారం.  రెండేళ్లుగా జగదీష్‌ కావేరమ్మను వేధిస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. చివరకు శుక్రవారం ఉదయం ఆమె  బస్టాప్‌లో వేచి ఉన్న సమయంలో జగదీష్‌ రివాల్వర్‌ ఎక్కుపెట్టాడని ప్రత్యక్షసాక్షుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. ఆ సమయంలో అడ్డుకున్న ఇద్దరు గాయపడ్డారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...