Jump to content

వందేళ్ల తర్వాత రికార్డుస్థాయి వర్షం


snoww

Recommended Posts

24 గంటల్లో మాదాపూర్‌లో 10.4సెం.మీ వర్షం
23-06-2019 08:43:13
 
636968761926254359.jpg
  • వందేళ్ల తర్వాత రికార్డుస్థాయి వర్షం
  • భారీ వర్షంతో వణికిన ఐటీ కారిడార్‌
హైదరాబాద్‌ సిటీ: నగరంలో శుక్రవారం కురిసిన భారీవర్షం పలు ప్రాంతాలను వణికించింది. వందేళ్ల తర్వాత నగరంలో ఒకే రోజులో అత్యధికంగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు ఆల్‌టైం రికార్డుగా 24 గంటల్లో 1914 జూన్‌ 26న 12.2సెం.మీ వర్షపాతం నమోదవగా ఈ సంవత్సరం జూన్‌ 21-22తేదీల్లో మాదాపూర్‌లో 10.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు శేరిలింగంపల్లి మాదాపూర్‌ ప్రాంతంలో 24 గంటల్లో 10.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో ఐటీకారిడార్‌ పరిసర ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి. శనివారం ఉదయం వరకు రోడ్లపై పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 24 గంటల్లో హయత్‌ నగర్‌ వైదేహినగర్‌- 6.2, అబ్దుల్లాపూర్‌మెట్‌- 6.0, గచ్చిబౌలి-5.7, పెద్ద అంబర్‌పేట-5.4, వనస్థలిపురం-5.2 సెం.మీ వర్షపాతం నమోదైంది.
 
 
పడిపోయిన ఉష్ణోగ్రతలు..
భారీ వర్షంతో నగరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. రెండు రోజుల క్రితం సాధారణం కంటే 4-5డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవగా శనివారం హైదరాబాద్‌లో 31.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఒక డిగ్రీ ఉష్ణోగ్రత తగ్గింది. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో వాతావరణం చల్లబడింది.
 
 
గత పదేళ్లలో జూన్‌లో 24గంటల్లో నమోదైన వర్షపాతం
సంవత్సరం వర్షపాతం(తేదీ)
2019     10.4(22)
2018     6.3(23)
2017     8.7(6)
2016     4.5(6)
2015     5.3(5)
2014     4.7(3)
2013     4.8(4)
2012     5.4(18)
2011     7.6(28)
2010     8.2(19)
2009     2.6(13)
1914     12.2(26)
             ఆల్‌ టైం రికార్డు
Link to comment
Share on other sites

వరద.. నగరం విలవిల..!
23-06-2019 08:48:12
 
636968764920548201.jpg
  • ఇళ్లు, రోడ్లపైకి చేరుతోన్న వరద నీరు
  • గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌
హైదరాబాద్‌ సిటీ: ‘వరద నీరు నిలిచే ప్రాంతాల్లో పరిష్కార చర్యలు చేపట్టాం. అవసరం, సాధ్యాసాధ్యాలను బట్టి డ్రైన్‌లు, బాక్స్‌ కల్వర్టులు నిర్మిస్తున్నాం’ మాన్‌సూన్‌ ముందు జీహెచ్‌ఎంసీ చేసే ప్రకటనలివి.
 
 
వర్షం పడితే మాత్రం ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతోంది. మహానగరమా...? మహా సముద్రమా.? అన్నట్టుగా పరిస్థితి మారుతోంది. కాలనీ, ప్రధాన రహదారి ఏదైనా.. అదే దుస్థితి. వెరసి గంటల తరబడి జామ్‌ జాటం. ఇంధన వ్యయం.. పని గంటలు వృథా. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఐటీ కారిడార్‌ పూర్తిగా స్తంభించగా.. ఇతర ప్రాంతాల్లోనూ సిటీజనులు ఇబ్బందులు పడ్డారు. గొలుసు కట్టుగా నిర్మించిన చెరువులకు అనుసంధానంగా ఉన్న నాలాలు కనుమరుగు కావడంతో సాధారణ వర్షానికే జల వనరులు పొంగి పొర్లుతున్నాయి. 10.34 సెం.మీల వర్షం కురవడంతో పలు చెరువులు పొంగి హైటెక్‌సిటీ ఆరేడు గంటలు స్తంభించింది. ఇప్పుడే కాదు.. ప్రతి యేటా నగరం మునక సాధారణంగా మారగా.. ఇంతకు మించి ఏం చేయలేమన్న స్థితిలో ప్రభుత్వ విభాగాలు ఉండగా.. అనుభవించాల్సిందే తప్పదేమో అన్న ఆవేదన పౌరుల్లో వ్యక్తమవుతోంది.
 
 
మెహిదీపట్నంలో...
రేతిబౌలి ప్రధాన చౌరస్తాలో వర్షపునీరు మిలటరీ ఏరియా నుంచి పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చి చేరుతోంది. దిగువకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి. మెహిదీపట్నం సంతో్‌షనగర్‌ కాలనీ నుంచి దిల్షాహీద్‌నగర్‌ కాలనీకి వెళ్లే ఎస్‌బీఐ కాలనీ రహదారిపై కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు ఆ రోడ్డుపై వరదనీరు పారుతోంది. వరదనీరు వెళ్లే ప్రాంతం కబ్జాలకు గురికావడం, ఇళ్ల మధ్య నుంచి వరదనీటికి చిన్న పైప్‌లైన్లు ఉండడమే సమస్యకు ప్రధాన కారణం. గుడి మల్కాపూర్‌లో నాలాను కబ్జాదారులు మింగేశారు. అదే నాలాలోకి వరదనీరు వెళ్లేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు చిన్న చిన్న పైప్‌లైన్లు వేసినా.. దిగువకు నీరు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో భారీగా వరద నీరు నిలుస్తోంది.
 
 
రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో....
రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని ఉప్పర్‌పల్లి 191 పిల్లర్‌వద్ద వర్షం వచ్చినప్పుడల్లా నీరు రోడ్డుపై నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం రహదారి కావడం.. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో వర్షం పడితే రెండు, మూడు కిలోమీటర్ల ప్రయాణానికి మూడు, నాలుగు గంటలు పడుతోంది. శివరాంపల్లి బెస్ట్‌ ప్రైజ్‌ ముందు నాలా పొంగి వర్షపు నీరు రోడ్డుపైకి రావడంతో చెరువును తలపిస్తోంది.
 
 
ముషీరాబాద్‌, అంబర్‌పేటలో...
ముషీరాబాద్‌ నియోజకవర్గంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రం ముందు నీరు వెళ్లే అవకాశం లేక తటాకాన్ని తలపిస్తోంది. వీఎ్‌సటీ చౌరస్తా వద్దా అదే దుస్థితి. ఆర్టీసీ కల్యాణ మండపం వద్ద భారీగా రోడ్డుపై వర్షపు నీరు నిలుస్తోంది. అంబర్‌పేటలోని ఛేనెంబర్‌ చౌరస్తా, సీగల్‌ కేఫ్‌ చౌరస్తా, తిలక్‌నగర్‌ రైల్వే బ్రిడ్జి, ఫీవర్‌ ఆస్పత్రి చౌరస్తా, శంకరమఠం మెయిన్‌ రోడ్‌, నింబోలిఅడ్డ రైల్వే బ్రిడ్జి, జిందాతిలిస్మాత్‌నగర్‌, కాచిగూడ టూరిస్ట్‌ హోట ల్‌, తెలంగాణ యువతి మండలి చౌరస్తా, పటేల్‌నగర్‌ చౌరస్తా, ప్రేమ్‌నగర్‌, గోల్నాక, డీమార్ట్‌ చౌరస్తా తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలుస్తోంది.
 
 
కూకట్‌పల్లిలో...
కూకట్‌పల్లిలోని తూ ర్పు కమాన్‌, వివేకానందనగర్‌ కాలనీలోని రిలయన్స్‌ ఫ్రెష్‌ వద్ద వర్షం నీరు పెద్దఎత్తున నిలుస్తోంది. ప్రధానరహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. సమస్య తీవ్రత దృష్ట్యా మూడేళ్లుగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం కనిపించడం లేదు.
 
 
ప్రగతిభవన్‌ పరిసరాల్లో..
సనత్‌నగర్‌లోని ప్రగతి భవన్‌ సమీపాన, రాజ్‌భవన్‌ రోడ్డులోని లేక్‌వ్యూ గెస్ట్‌ హౌజ్‌ వద్ద, అమీర్‌పేట, ఎర్రగడ్డ ఛాతీవ్యాధుల ఆస్పత్రి సమీపంలో, మైత్రివనం తదితర ప్రాంతాల్లో నీరు నిలుస్తోంది. బల్కంపేట నుంచి బేగంపేటకు వెళ్లే లింక్‌ రోడ్డు రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద గత సంవత్సరం వర్షంలో వాహనాలతో పాటు వాహనదారులు కొట్టుకుపోయారు. సనత్‌నగర్‌లోని ప్రధాన రహదారి సమీపంలోని టయోటా షోరూం రోడ్డు ఎగుడు, దిగుడుగా ఉండడంతో నీరు నిలుస్తోంది. సాక్షాత్తు సీఎం నివాస పరిసరాల్లో కూడా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమయ్యారు.
 
 
అమీర్‌పేటలో..
అమీర్‌పేట నుంచి ఎల్లారెడ్డిగూడకు వెళ్లే దారిలో చర్మాస్‌ వద్ద చిన్న పాటి వర్షానికే భారీగా వరద నీరు నిలుస్తోంది. 30 సంవత్సరాలుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించడంలో ఇంజనీరింగ్‌ విభాగం విఫలమైంది. గతంలో ఓ సారి వరద నీరు నిలవకుండా సుమారు 25 లక్షల రూపాయలు వెచ్చించి పైప్‌లైన్‌ వేసినా ఫలితం లేదు. మూడు రోజుల పాటు నీరు రోడ్డుపైనే ఉంటోంది.
 
 
  • పాతబస్తీ ఛత్రినాక చౌరస్తాలో వర్షం వచ్చినప్పుడల్లా రాజన్న శివాజీనగర్‌ నాలా పొంగి ఛత్రినాక చౌరస్తా చెరువులా తయారవుతోంది. వర్షపు నీటికితోడు డ్రైనేజీ కాలువలు పొంగి వాహనదారుల ప్రయాణం నరకంగా మారుతోంది.
  • వర్షం పడినప్పుడల్లా చాంద్రాయణగుట్ట బ్రిడ్జి కింది భాగంలో, చాంద్రాయణగుట్ట నుంచి బండ్లగూడ వెళ్లే మార్గంలో బ్రిడ్జి దిగగానే పెట్రోల్‌ బంక్‌ సమీపంలో వర్షపు నీరు రోడ్డుపై నిలిచి చెరువులా కనిపిస్తోంది.
  • యాకుత్‌పురా గంగానగర్‌ నాలా, డబీర్‌పురా నాలా కుంచించుకుపోవడంతో భారీ వర్షం పడితే వరద నీరు పొంగి పొర్లుతోంది.
  • బహదూర్‌పురా చౌరస్తాలో కిషన్‌బాగ్‌ వైపు వెళ్ళే రహదారిలో మోకాళ్ళలోతు నీరు చేరుతోంది. ఎగువ బస్తీల నుంచి వచ్చిన వర్షపు నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. రెండు, మూడు గంటలైతే తప్ప ఇక్కడ నీరు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండదు.
  • సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్‌ చౌరస్తా నుంచి మరాఠబస్తీ, శాస్త్రీనగర్‌, అడ్డగుట్ట ఏబీసీడీ సెక్షన్లు, కమ్యూనిటీ హాలు, సమోసా గార్డెన్‌ ఎత్తైన ప్రాంతాల్లో బస్తీలు చిత్తడిగా మారుతున్నాయి.
  • మహ్మద్‌గూడ నాలా ప్రధాన రహదారిపై, శ్రీనివా్‌సనగర్‌ ఫ్రైడేమార్కెట్‌, ఇందిరానగర్‌ కాలనీ, న్యూఅశోక్‌నగర్‌, ఎల్‌.నారాయణనగర్‌ ప్రాంతాలు చినుకు పడితే తటాకాల్లా మారుతున్నాయి. నాలాను విస్తరించక పోవడమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
  • బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌, సాగర్‌ కాంప్లెక్స్‌లో అవుట్‌లెట్‌ సరిగా లేక కొద్ది పాటి వర్షానికే కాలనీలు జలమయమవుతున్నాయి.
  • క్యాచ్‌పిట్ల నుంచి నీరు వెళ్లకపోవడంతో చింతల్‌కుంట అండర్‌పాస్‌ వద్ద జాతీయ రహదారిపై వర్షం నీరు భారీగా నిలుస్తోంది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి.
  • వనస్థలిపురం డివిజన్‌లోని లోతట్టు ప్రాంతంలో ఉన్న గుంటి జంగయ్య కాలనీలో వరద నీటి ప్రవాహ వ్యవస్థ లేక కాలనీ నీట మునుగుతోంది.
 
ఇంజనీరింగ్‌ విభాగం విఫలమైంది!
చర్మాస్‌ దగ్గర నెలకొన్న సమస్యను పరిష్కరించడంలో ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు విఫలమవుతున్నారు. అసలు సమస్య ఎక్కడ ఉంది అనే కోణంలో ఆలోచించడం లేదు. గతంలో మాజీ మంత్రి కేవీఆర్‌ నిధులు మంజూరు చేశారు. వాటిని సక్రమంగా వినియోగించుకోలేక పోయారు. సమస్యకు మూలం తెలుసుకోకుండా పైప్‌లైన్‌ వేసి చేతులు దులుపుకున్నారు.
- వారాల జగదీశ్వరరావు, సామాజిక కార్యకర్త
 
 
అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి
వర్షాకాలంలో ఛత్రినాక చౌరస్తాలో తరచూ ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ సమస్యను గ్రేటర్‌ అధికారులు త్వరగా పరిష్కరించాలి. అవసరమైన మేర పైపులైన్‌ను మార్చాలి. లేదంటే ప్రతి సంవత్సరమూ వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతూనే ఉండాలి.
- డి.సుశీల్‌, చైతన్య యూత్‌ అసోసియేషన్‌, ఛత్రినాక
 
 
వర్షపు నీరు డ్రైనేజీ పైపుల్లోకి ప్రవేశిస్తోంది
సాగర్‌ కాంప్లెక్స్‌ ఫేజ్‌1,2 కాలనీలు కొద్ది పాటి వర్షానికి చెరువును తలపిస్తున్నాయి. పై కాలనీల నుంచి పోటెత్తుతోన్న వరద నీరు బయటికి వెళ్లే అవకాశం లేక డ్రైనేజీ పైపుల్లోకి చేరుతోంది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
- కృష్ణారెడ్డి, సాగర్‌ కాంప్లెక్స్‌ ఫేజ్‌-1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...