Jump to content

తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన మృగాళ్లు.. 


AndhraneedSCS

Recommended Posts

తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన మృగాళ్లు.. 
24-06-2019 22:14:15
 
636970113634730612.jpg
 
తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులపై అత్యాచారాల పర్వానికి అడ్డుకట్ట పడటం లేదు. అటు.. ప్రకాశం జిల్లాలో బాలికను ఆరు రోజుల పాటు నిర్బంధించి అరాచకానికి పాల్పడిన సంఘటన మరువకముందే విజయనగరం జిల్లాలో మరో దుర్మార్గం వెలుగుచూసింది. నిందితులు చంపుతామని బెదిరించడంతో ఈ విషయం ఆలస్యంగా బయటపడింది.
 
 
విజయనగరం జిల్లా గుర్ల మండలం దేవుని కణపాక పంచాయితీకి చెందిన కొర్ననిపేట గ్రామంలో బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పశువులు మేపడానికి వెళ్లిన బాలికపై ఆనంద్‌, వరహాలరావు అనే ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. అంతేకాకుండా ఆ దుర్మార్గాన్ని వీడియో తీశారు. విషయం ఎవరికైనా చెబితే ఈ వీడియో అందరికీ చూపిస్తామని, ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించారు. దీంతో బాలిక భయంతో ఎవరికీ చెప్పలేదు.
 
 
కొద్దిరోజులుగా బాలిక ముభావంగా ఉండటంతో కుటుంబసభ్యులు ఏం జరిగిందని ప్రశ్నించారు. అయితే.. భయం భయంగానే బాలిక జరిగిన దారుణాన్ని చెప్పింది. దీంతో.. బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
 
పోలీసులకు ఫిర్యాదు అందగానే.. స్పందించారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని సీఐ రమేష్‌ చెప్పారు.
 
ఇదిలా ఉంటే... 
 
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఊళ్లో మరుగుదొడ్లు నిర్మించే పనులకోసం వచ్చిన ఓ యువకుడు.. గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి ముల్కలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
 
ములకలపల్లి మండలం మోటుగూడెం గ్రామానికి చెందిన గిరిజన బాలిక పై మొగరాలగుప్పకి చెందిన యువకుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వ్యక్తిగత మరుగుదొడ్ల పథకంలో భాగంగా తాపీ మేస్త్రీగా వచ్చిన కొండ్రు భాస్కర్‌.. మూడు రోజులుగా మోటుగూడెంలోనే ఉంటున్నాడు.
 
 
ఆదివారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన బాలికను బలవంతంగా నిర్మానుష్యప్రాంతానికి లాక్కెళ్లి భాస్కర్‌ అత్యాచారం చేశాడు. బాలిక రావడం ఆలస్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెకోసం వెతుకుతుండగా.. భాస్కర్‌ పారిపోతూ కనిపించాడు. బాలిక జరిగిన విషయం చెప్పడంతో కుటుంబసభ్యులు ముల్కలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...