Jump to content

బెజవాడ-సింగపూర్‌ సర్వీసు రద్దు!


snoww

Recommended Posts

బెజవాడ-సింగపూర్‌ సర్వీసు రద్దు!
29-06-2019 06:21:57
 
636973861171752972.jpg
విజయవాడ: బెజవాడ నుంచి నడుస్తున్న సింగపూర్‌ విమాన సర్వీసు రద్దయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) విధానంలో నడుస్తున్న ఈ సర్వీసుకు జూన్‌ 30తో కాంట్రాక్టు గడువు ముగుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఈ ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉండగా వైసీపీ సర్కారు సుముఖత చూపలేదు. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) నుంచి ఈ మేరకు ఈమెయిల్‌ రావటంతో.. ఇండిగో సంస్థ సింగపూర్‌ సర్వీసును రద్దు చేయాల్సిందిగా ఇక్కడి ప్రాంతీయ అధికారులకు సమాచారం పంపింది. దీంతో జూలై 9 నుంచి సింగపూర్‌ విమాన సర్వీసును రద్దు చేశారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ను ఆపేశారు.
Link to comment
Share on other sites

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    7

  • Somedude

    3

  • andhrano1

    3

  • jalsa01

    3

Top Posters In This Topic

అంతర్జాతీయం..ఆరు నెలలే
 

amr-gen7a_170.jpg

ఆగిపోయిన సింగపూర్‌ విమాన సర్వీసులు
ఇండిగో, విమానాశ్రయ అధికారులకు ఆదేశాలు
ఈ నెల 27న వెళ్లిన  ప్రయాణమే ఆఖరిది
ఈనాడు, అమరావతి

గన్నవరం నుంచి అంతర్జాతీయ ప్రయాణం.. ఆరు నెలల ముచ్చటగానే మిగిలింది. ఇక్కడి నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దీగా నడుస్తున్నప్పటికీ.. అర్ధంతరంగా ఆగిపోయాయి. ఈ నెల 27న సింగపూర్‌కు నడిచిన విమాన సర్వీసే ఆఖరిది కావడం గమనార్హం. ఏళ్ల తరబడి గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసుల కోసం ఎదురుచూసిన కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల వాసుల చిరకాల కోరిక నెరవేరిందనే ముచ్చట తీరకుండానే.. ఆరు నెలలకే మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సర్వీసులను నడుపుతున్న ఇండిగో సంస్థకు సర్వీసులు ఆపేయాల్సిందిగా రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నుంచి శుక్రవారం ఆదేశాలు అందాయి. విమానాశ్రయ అధికారులకు సైతం ఇదే సమాచారం తాజాగా అందింది. దీంతో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒప్పందం చేసుకోవడం, లేదంటే.. ఏదైనా విమానయాన సంస్థ ముందుకొచ్చి ఎలాంటి ఒప్పందాలు లేకుండా నడిపితే తప్ప అంతర్జాతీయ సర్వీసులు నడిచేందుకు అవకాశం ఉండదు.
రాష్ట్ర ప్రభుత్వం ఇండిగో సంస్థతో కుదుర్చుకున్న లోటు భర్తీ నిధి(వీజీఎఫ్‌) విధానం జూన్‌తో ముగిసింది. దీంతో జూన్‌ 27 తర్వాత విమాన టిక్కెట్లను ఇండిగో నెల కిందటే ఆపేసింది. మళ్లీ మూడు రోజుల కిందట సింగపూర్‌కు సర్వీసులు నడపాలంటూ అధికారుల నుంచి ఇండిగో సంస్థకు ఆదేశాలు అందాయి. మరో ఆరు నెలలు వీజీఎఫ్‌ పద్ధతిలోనే గడువును పొడిగించనున్నట్లు చెప్పడంతో.. ఇండిగో టిక్కెట్ల విక్రయాన్ని.. జులై 9 నుంచి మళ్లీ అందుబాటులో ఉంచింది. వీటిని కొందరు ప్రయాణికులు ఈ మూడు రోజుల్లో బుక్‌ చేసుకున్నారు. అయితే.. తాజాగా విమాన సర్వీసులు ఆపేయాలంటూ.. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నుంచి అధికారిక సమాచారం అందింది. దీంతో ఇప్పటి వరకూ విక్రయించిన టిక్కెట్ల ప్రయాణికులను.. ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసుకుంది. గన్నవరం నుంచి సర్వీసులను పూర్తిగా ఆపేసింది. దీంతో ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాల కథ.. మళ్లీ మొదటికే వచ్చింది. గన్నవరం నుంచి సింగపూర్‌ విమాన సర్వీసు నేరుగా ఉండడంతో కేవలం ఆరు గంటల్లో వెళ్లిపోయేవారు. ప్రస్తుతం సింగపూర్‌కు వెళ్లాలంటే.. ఒన్‌స్టాప్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇతర నగరాలకు వెళ్లి అక్కడి నుంచి సర్వీసులను అందుకుని వెళ్లాల్సిందే. దీనికి.. ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతుంది.
మళ్లీ కష్టాలు..
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి నాలుగు జిల్లాల నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య ఏటా భారీ సంఖ్యలో ఉంటుంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి విమానాశ్రయాలకు వెళ్లి, అక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసులను అందుకోవాల్సిన పరిస్థితి. ఏటా ఇలా పాతిక లక్షల మంది వరకూ ఇతర నగరాల విమానాశ్రయాలకు ఇక్కడి నుంచి వెళ్లి సర్వీసులను ఎక్కుతున్నట్లు ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ గతంలో ఓ అధ్యయనం చేసి పౌర విమానయాన శాఖకు లేఖను సైతం రాసింది. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులను దుబాయి, సింగపూర్‌లకు నడపాలంటూ స్థానికంగా ఉండే పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార సంఘాల నుంచి అనేక విజ్ఞప్తులు, లేఖలు రాయడం జరిగింది. దీంతో గన్నవరం విమానశ్రయానికి అంతర్జాతీయ హోదాను కేంద్రం ప్రకటించింది. కానీ.. ఏడాదిన్నర అయినా అంతర్జాతీయ సర్వీసుల ఊసు లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని.. టెండర్లను పిలిచి.. ఇండిగో విమాన సంస్థతో సింగపూర్‌కు సర్వీసులు నడిపేలా వీజీఎఫ్‌ పద్ధతిలో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం గడువు ముగియడంతో.. సర్వీసులు ఆగిపోయాయి. సింగపూర్‌కు ఇక్కడి నుంచి వెళ్లిపోతే.. అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా సులభంగా చేరుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే.. ఇక్కడి నుంచి సింగపూర్‌ సర్వీసును ప్రారంభించినప్పటి నుంచి భారీ డిమాండ్‌ ఉంటోంది. డిమాండ్‌ క్రమంగా పెరుగుతున్న ఈ సమయంలో.. ఆపేయడంతో ఒక్కసారిగా మొత్తం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అంతర్జాతీయ సర్వీసులను వెంటనే పునరుద్ధరించకపోతే.. గన్నవరం విమానాశ్రయంలో రూ.4 కోట్లకు పైగా వెచ్చించి నిర్మించిన అంతర్జాతీయ టెర్మినల్‌, కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ అనుమతులు అన్నీ.. మళ్లీ మొదటికి వస్తాయి. అన్ని అనుమతులూ మళ్లీ కేంద్రం నుంచి రావాల్సి ఉంటుంది.

Link to comment
Share on other sites

 Nice g balupu kakunte evani ayya sommani Praja danani airlines vallaki appananga kattabedtunaru balsinodi deggara paisal 10gi gbalupolla gap funding ani create chesi ichikomanandi kavalante

Link to comment
Share on other sites

3 minutes ago, pahelwan said:

 Nice g balupu kakunte evani ayya sommani Praja danani airlines vallaki appananga kattabedtunaru balsinodi deggara paisal 10gi gbalupolla gap funding ani create chesi ichikomanandi kavalante

antha peeling unte adedo vgf lekunda airlines ni oppinchi nadipinchali gaani  musi mingakudadu ...   efficiency anedi elanti decisions batti arthamavutundi...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...