Jump to content

ఏపీకి ప్రత్యేక హోదా అసాధ్యం


snoww

Recommended Posts

ఏపీకి ప్రత్యేక హోదా అసాధ్యం

రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి

ఈనాడు, అమరావతి: ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌, చంద్రబాబు ప్రధానిగా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేరని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ప్యాకేజీ సాధించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. భాజపాలో చేరాక తొలిసారి ఆదివారం విజయవాడ వచ్చిన ఆయనకు భాజపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని ఒక కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో, సాయంత్రం విలేకరులతో సుజనా మాట్లాడారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ధర్మ పోరాట దీక్షల పేరుతో అధర్మ పోరాటాలు చేశారని విమర్శించారు. దేశవాప్తంగా పరిమిత స్థానాల్లో భాజపా విజయం సాధించి ఉంటే హోదా డిమాండు చేసే వాళ్లమని జగన్‌మోహన్‌రెడ్డి అనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

Link to comment
Share on other sites

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కేంద్ర ప్రభుత్వం జైలులో పెడుతుందని తాను అనుకోవడం లేదని ఇటీవల టీడీపీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఏదైనా అంశంలో నిజాయితీగా విచారణ జరిపిస్తే చెప్పలేమన్నారు. బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందా లేదా అన్నది విచారణ జరిపిస్తే గానీ చెప్పలేమని, అయితే పాలన మాత్రం గాడి తప్పిందని చెప్పగలనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అన్యాయం చేయలేదన్నారు.

స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులను మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందని చెప్పారు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని, ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇస్తానన్న ప్యాకేజీని తీసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి మంచిదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఈ నెల 24న పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రమంతటా పర్యటిస్తానని చెప్పారు. విజయవాడకు వచ్చిన సుజనా చౌదరికి ఆయన అభిమానులు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ... ఎన్నికల ముందు రాష్ట్రంలో జరిగినవి ధర్మపోరాటాలు కాదు అధర్మ పోరాటాలు అని అన్నారు. విజయవాడలో సుజనా చౌదరి సన్మాన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హాజరు కాలేదు.

చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం: సునీల్‌ దేవ్‌ధర్‌ 
వచ్చే రెండేళ్లలో అవినీతి చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ అన్నారు. విజయవాడలో సుజనా చౌదరి సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో గత ఐదేళ్లలో టీడీపీ నేతలు కోట్ల రూపాయలు లూటీ చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని దుష్ట కాంగ్రెస్‌ అనేవారని గుర్తుచేశారు. చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావడంతోపాటు కాంగ్రెస్‌ పార్టీతోనూ కలిసిపోయారని విమర్శించారు. చంద్రబాబు బీజేపీ సహకారం లేకుండా ఎప్పుడూ అధికారంలోకి రాలేదన్నారు.

Link to comment
Share on other sites

Ae mata ki a mata...party marina maata matram maraledu Sujana Chow di...

apudu ipudu...okate mata..SS raadu...

Jagan gadu ie point baaga vadukunte, CBN defend chesuko leka self goal esukunadu

#40-Years

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

Ae mata ki a mata...party marina maata matram maraledu Sujana Chow di...

apudu ipudu...okate mata..SS raadu...

Jagan gadu ie point baaga vadukunte, CBN defend chesuko leka self goal esukunadu

#40-Years

Lol

It's about what visa redd thinking

Link to comment
Share on other sites

11 minutes ago, Anta Assamey said:

Jagan gadu testanu ani annadu ... So we are waiting .... gallery_8818_2_281352.gif?1403646236

 

Testha ani epudu chepaledu

poratam chestha, medalu vachi prayatnam chestha ani matrame chepindu

Link to comment
Share on other sites

17 minutes ago, Android_Halwa said:

Ae mata ki a mata...party marina maata matram maraledu Sujana Chow di...

apudu ipudu...okate mata..SS raadu...

Jagan gadu ie point baaga vadukunte, CBN defend chesuko leka self goal esukunadu

#40-Years

Pandula flights veerudu Sujana Chowdary di okate maata eppudu ina. maata thappani / maarchani veerudu 

Link to comment
Share on other sites

6 minutes ago, snoww said:

Pandula flights veerudu Sujana Chowdary di okate maata eppudu ina. maata thappani / maarchani veerudu 

Sujana gadu dealer like visa 

Link to comment
Share on other sites

17 minutes ago, Android_Halwa said:

Testha ani epudu chepaledu

poratam chestha, medalu vachi prayatnam chestha ani matrame chepindu

Medalu Vanchi mari testam .... ani annadu ... Go back to the videos... during all those past 4 years ... gallery_8818_2_281352.gif?1403646236

Offcourse after coming to power.... Sir Sir Please Sir ani antam ani cheppadu ... that's different but during all those padayatralu was different. ...gallery_8818_2_281352.gif?1403646236

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

Vella term ayyipoyaka ee state nunchi pampistaru malli rajya sabha ki ?

party ki funding arrange sesthe Assam nundi ina pampistharu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...