Jump to content

Karamchedu


Lucifer

Recommended Posts

కారం చేడు మృత వీరుల #_రుధిర_క్షేత్రం  

"సరిగ్గా ముప్పైఒక్క ఏళ్ళ కింద ఈ రోజు ప్రకాశం జిల్లా కారంచేడు 
దళిత వాడ నెత్తుటి కుప్పయ్యింది.... 
నరనరాన అహంకారం నిండిన కమ్మ భూస్వామ్యం 
దళితులను ముక్కలు ముక్కలు గా నరికిందక్కడ... 
అగ్రకుల రాక్షసమూకలు నెత్తిటి ఏరులుపారించారక్కడ..... 
బరిసెలు, గొడ్డళ్ళు, కత్తులతో దళిత మహిళలను, పిల్లలను, ముసలివారిని, యువకులను వెంటాడి..వేటాడి చంపారక్కడ ... 
మహిళలను చెరిచారు.... పసి పిల్లలను కింద పడేసి తొక్కారు.... 
ఆరుగురిని హత్య చేసి, ఎందరో మహిళలపై అత్యాచారాలు చేసి, 
మరెంతో మందిని నెత్తుటి ముద్దలను చేశారు. 

ఇదంతా చేసింది ఆ ఊరి కమ్మ భూస్వాములు... 
అప్పటి ముఖ్యమంత్రి వియ్యంకుడి అద్వర్యంలో ఇదంతా జరిగింది....
తెలుగు నేల యావత్తూ బిత్తర పోయి చూసింది. 
మూగగా రోధించింది. కమ్మ భూస్వాముల మారణ హోమంలో 
1)దుడ్డు వందనం 2) దుడ్డు రమేశ్ 3) తేల్ల మోషే 4) తేల్ల ముత్తయ్య 
5) తేల్ల యెహోషువా 6) దుడ్డు అబ్రాహాం లు మరణించారు. 

అసలు దాడికి కారణమేంటంటే.... 
కారంచేడులో మాల, మాదిగ, ఎరుకల కులాల వారు ఒకే దగ్గరుంటారు. 
కొత్త తరం దళిత యువకులు కొందరు పెద్ద చదువులు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, కమ్మలు చేసే తప్పులను ప్రశ్నించడం 
అక్కడి కమ్మ భూస్వాములకు కళ్ళమంటగా ఉండేది. 
వారి కెట్లైనా బుద్ది చెప్పాలని సమయం కోసం కాచుక కూర్చున్నారు. 
ఆ గ్రామంలోని కమ్మ యువకులు ప్రతి రోజూ దళిత, 
ఎరుకల యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు. 
వాళ్ళ ఇళ్ళళ్ళ్కొచ్చి మరీ ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు. వెంకటేషు అనే కమ్మ యువకుడు ఒకరోజు తిరుపతయ్య అనే 
ఎరుకలతని ఇంటికి వచ్చి అతని కూతురుతో అసభ్యం గా 
ప్రవర్తించడం మొదలు పెట్టాడు. 
తిరుపతయ్య అతని భార్య, వెంకటేశ్ ను వారించడానికి ప్రయత్నించడంతో అతను వారిద్దరి పై దాడి చేసి కొట్టాడు. 
అక్కడే ఉండి ఈ తతంగాన్ని గమనిస్తున్న కొందరు దళిత యువకులు వెంకటేశ్ ను అడ్డుకొని బలవంతంగా అక్కడినుండి పంపించారు. 
ఇది ఆ ఊరి కమ్మలకందరికి ఆవేశాన్ని తెప్పించింది. 
అలాగే బహిర్భూమికి పోయే దళిత మహిళల పట్ల కమ్మ యువకులు 
ప్రతి రోజూ అసభ్యంగా ప్రవర్తించేవారు. 
ఇటువంటి సంఘటనలు జరుగుతున్న సమయంలోనే ఎన్నికలొచ్చాయి. 
ఆ ఎన్నికల్లో నిలబడ్డ దగ్గుబాటి చెంచురామయ్య 
కొడుకు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావుకు మద్దతివ్వాలని 
చెంచురామయ్య దళిత కుల పెద్దలను కోరాడు. 
కానీ వాళ్ళు అతనికి హామీ ఇవ్వలేదు. 

ఆ ఎన్నికల్లో దళితులంతా కాంగ్రెస్ కు ఓటు వేశారని 
చెంచురామయ్య భావించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు 
దళితులు నీళ్ళు తాగే చెరువులో ఇద్దరు కమ్మ యువకులు 
తమ బర్రెలను కడుగుతూ కుడితిని పారబోయటాన్ని 
అక్కడికి మంచినీళ్ళ కోసం వచ్చిన మున్నంగి సువార్త అనే 
మాదిగ మహిళ ప్రశ్నించింది. 
దాంతో వాళ్ళ అగ్రకుల అహానికి దెబ్బతగిలి ఆమెను చెర్నకోలాతో కొట్టారు. సువార్త కూడా తన బిందెతో వారికి సమాధానం చెప్పింది. 
వేల ఎకరాల భూములున్న భూస్వాములను, 
కోట్లాది రూపాయల బిజినెస్ లున్న వ్యాపారులను, 
సినీ రాజకీయ రంగాలను ఏలుతున్న వారిని, 
అందులోనూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావు 
కులం వారిని, చుట్టాలను, ఓ దళిత మహిళ ఎదిరించడమా ? 
కమ్మలందరూ రగిలి పోయారు.... 
కూడబలుక్కున్నారు.... 
చుట్టుపక్కల గ్రామాల్లోని తమవారికి సమాచారం పంపించారు. 

1985 జూలై 17 వ తేదీన వేలాది మంది కమ్మ అగ్రకుల దురహంకారులు కారం చేడు దళిత వాడ పై దాడి చేశారు. 
మానవత్వం నశించిన ఆ దుర్మార్గులు రాక్షసుల వలె ప్రవర్తించారు. 
పశువులు కూడా అసహ్యించుకునే రీతిలో మహిళపై అత్యాచారాలు చేశారు. హత్యలు చేశారు. కత్తులతో, బరిశెలతో వీరంగం సృష్టిస్తూ 
వికటాట్టహాసాలు చేశారు. 
ఇది మొత్తం దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు తండ్రి, 
ఎన్,టీ,రామారావు వియ్యంకుడు అయిన 
దగ్గుబాటి చెంచురామయ్య అద్వర్యంలో,
కనుసన్నలో సాగింది. 

ప్రభుత్వం మాత్రం ఈ కేసుకు సంభంధించి ఎఫ్ఫైఆర్ లో 
చెంచురామయ్య పేరును కూడా చేర్చలేదు. 
ఆ తరువాత ఈ మారణ హోమానికి వ్యతిరేకంగా, 
హంతకులను శిక్షించాలనే డిమాండ్ తో విప్లవ, దళిత ఉధ్యమకారులు 
చాలా కాలంపాటు ఉధ్యమాలు చేశారు. 
ఆ ఉధ్యమాల మూలంగా దేశం యావత్తూ కారం చేడు వైపు చూసింది.
 ఆ ఉధ్యమకారణంగా ఆ తరువాత దళిత ఉధ్యమం 
ఒక కొత్త చరిత్రను లిఖించింది. 

ఆ తర్వాత కొంత కాలానికి ఇప్పుడు మావోయిస్టు పార్టీగా పేరు మార్చుకున్న అప్పటి పీపుల్స్ వార్ పార్టీ చెంచురామయ్యను చంపేసింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...