Jump to content

త్వరలో సర్కారీ మద్యం దుకాణాలు


snoww

Recommended Posts

త్వరలో సర్కారీ మద్యం దుకాణాలు 

ప్రభుత్వం తరఫున  ఏపీఎస్‌బీసీఎల్‌ నిర్వహణ 
అందుకు వీలు కల్పించే సవరణ  బిల్లుకు మంత్రివర్గం ఆమోదం 
అక్టోబరు 1 నుంచి నూతన విధానం 
ఆనాటి నుంచి ప్రైవేటు  మద్యం దుకాణాలకు చెల్లుచీటీ 
ఈనాడు - అమరావతి

18ap-main18a_3.jpg

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఇకపై మద్యం చిల్లర వర్తకంలోకి ప్రవేశించనుంది. డిస్టలరీలు, బ్రూవరీస్‌ల్లో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి...దాన్ని మద్యం దుకాణాల లైసెన్సుదారులకు విక్రయించటానికే ఇప్పటివరకూ పరిమితమైన ఈ సంస్థ ఇకపై స్వయంగా మద్యం దుకాణాలను నడపనుంది. రాష్ట్రంలో దశలవారీ మద్యనిషేధం అమల్లో భాగంగా...ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలను ఏపీఎస్‌బీసీఎల్‌కు అప్పగించనుంది. అందుకు వీలు కల్పించేలా చట్టాన్ని సవరించనుంది. ఆ దిశగా రూపొందించిన ముసాయిదా సవరణ బిల్లును రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. ఒకటి, రెండు రోజుల్లో ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ చట్ట సవరణ జరిగిన తర్వాత ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని రూపొందించి అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమలు చేయనుంది. అప్పటి నుంచి రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండవు.

మద్యం ధరలు పెంపు ద్వారా 
గతేడాదితో పోలిస్తే మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌ సుంకం ద్వారా దాదాపు రూ.2,500 కోట్ల మేర అధిక ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. వ్యాట్‌ రూపంలో వచ్చే ఆదాయం దీనికి అదనం. ప్రస్తుతమున్న మద్యం ధరలను పెంచటం ద్వారా ఈ ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మద్యం ధర అధికంగా ఉంటే తాగేవారి సంఖ్య బాగా తగ్గుతుందని ఎక్సైజ్‌ వర్గాలు వివరిస్తున్నాయి. ఆదాయం తగ్గినా ఫరవాలేదు కానీ వినియోగం తగ్గించేదిశగానే చర్యలు ఉండాలని ఇప్పటికే ఎక్సైజ్‌ అధికారులకు ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది.

లైసెన్సు రుసుములు కోల్పోయినప్పటికీ? 
ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించటం ద్వారా లైసెన్సుల రూపంలో వచ్చే ఆదాయాన్ని (2017-19 సంవత్సరానికి రూ.500 కోట్లు వచ్చింది) ప్రభుత్వం కోల్పోతుంది. అదే సమయంలో లైసెన్సుదారులకు కమీషన్‌ రూపంలో చెల్లించే మొత్తం ప్రభుత్వానికి మిగులుతుంది. దుకాణాల లైసెన్సుదారులకు వారు చేసే వ్యాపారంపై 10 శాతం కమీషన్‌ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఏడాదికి సగటున దాదాపు రూ.20 వేల కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతాయి. కమీషన్‌ రూపంలో వ్యాపారులకు రూ.2 వేలు కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆ సొమ్ము ప్రభుత్వానికి మిగులుతుంది. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహిస్తే ఒక్కో దుకాణానికి నెలకు రూ.1.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఈ ఖర్చులన్నీ పోనూ ప్రభుత్వానికి ఆదాయం బాగానే ఉంటుందని ఎక్సైజ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అందుబాటు, లభ్యత తగ్గించేందుకు!

ప్రస్తుతం రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలున్నాయి. వీటిలో కనీసం 800 నుంచి 1300(20-30%) దుకాణాలు నూతన విధానంలో తగ్గనున్నాయి. మద్యం అందుబాటు, లభ్యతను బాగా తగ్గించేందుకు ఈ దుకాణాల కుదింపు దోహదపడుతుందని ఎక్సైజ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రైవేటు మద్యం వ్యాపారులైతే అధికాదాయం కోసం ఎక్కువ సరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే గ్రామగ్రామాన మద్యం గొలుసు దుకాణాలూ వెలిసేవి. దీంతో ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభించి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించటం వల్ల గొలుసు దుకాణాలకు అవకాశమే ఉండదు. ఎమ్మార్పీ, సమయపాలన ఉల్లంఘనలు వంటివి తగ్గుతాయి. మద్యం అందుబాటు, లభ్యత తగ్గటం వల్ల కొంతమందైనా ఈ వ్యసనం నుంచి దూరమయ్యేందుకు, కొత్తవారు దీని బారిన పడకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయని ఎక్సైజ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Link to comment
Share on other sites

ఒక విధంగా మంచిదే ..... కానీ Black లో మందు ఎక్కువ అవ్వకుండా చూడాలి ... gallery_8818_2_281352.gif?1403646236

Link to comment
Share on other sites

9 minutes ago, Anta Assamey said:

ఒక విధంగా మంచిదే ..... కానీ Black లో మందు ఎక్కువ అవ్వకుండా చూడాలి ... gallery_8818_2_281352.gif?1403646236

kashtam.

government employees who has the responsibility to run those shops will start black business with help of MLA's and Ministers. 

Good idea if executed well. But less chances of it getting executed without corruption. 

Link to comment
Share on other sites

6 minutes ago, Anta Assamey said:

Eloborate ప్లీజ్ .... gallery_8818_2_281352.gif?1403646236

You don’t get Kingfisher, Hayward’s or Budweiser there. All local brands controlled by MLAs. So you might as well be drinking brewed urine- Reason why Tamils smell bad ani @pottipotato antunde.

Link to comment
Share on other sites

Quote

ప్రస్తుతమున్న మద్యం ధరలను పెంచటం ద్వారా ఈ ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మద్యం ధర అధికంగా ఉంటే తాగేవారి సంఖ్య బాగా తగ్గుతుందని ఎక్సైజ్‌ వర్గాలు వివరిస్తున్నాయి. 

TG , KA , TN border towns lo liquor shops ki full demand inka . people will hoard the liquor at home. 

Link to comment
Share on other sites

Quote

ప్రస్తుతం రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలున్నాయి. వీటిలో కనీసం 800 నుంచి 1300(20-30%) దుకాణాలు నూతన విధానంలో తగ్గనున్నాయి.

Mostly Pilla congress leaders owned one's gone. 

Link to comment
Share on other sites

25 minutes ago, Staysafebro said:

You don’t get Kingfisher, Hayward’s or Budweiser there. All local brands controlled by MLAs. So you might as well be drinking brewed urine- Reason why Tamils smell bad ani @pottipotato antunde.

CITI_c$y

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...