Jump to content

Ismart Shankar plgarised - hero akash


kakatiya

Recommended Posts

ఇస్మార్ట్ శంకర్’ కాన్సెప్ట్ నాది:హీరో ఆకాష్‌

‘చట్టపరమైన చర్యలకి సిద్ధం’

వివాదంలో పూరీ-రామ్‌ సినిమా

‘ఇస్మార్ట్ శంకర్’ కాన్సెప్ట్ నాది:హీరో ఆకాష్‌

హైదరాబాద్‌: బాక్సాఫీసు వద్ద కోట్లు రాబడుతున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కాన్సెప్ట్‌ తనదేనని హీరో, రచయిత ఆకాష్‌ పేర్కొన్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా నటించిన సినిమా ఇది. ఓ వ్యక్తి మెదడును హీరోకి మార్పిడి చేయడమనే మూల కథతో ‘ఇస్మార్ట్ శంకర్’ రూపొందింది. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా విజయం అందుకుంది. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.48 కోట్లకుపైగా రాబట్టిందని నిర్మాతలు వెల్లడించారు. కాగా ఈ సినిమా ఇప్పుడు వివాదంలో పడింది. ఈ కాన్సెప్ట్‌ తనదని ‘ఆనందం’ ఫేం ఆకాష్‌ మీడియా ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా ఆకాష్‌ మాట్లాడుతూ.. ‘ఇదే ఇతివృత్తంతో తెలుగు-తమిళ భాషల్లో నేను రాసిన కథ, కథనాలతో నన్నే హీరోగా పెట్టి దర్శకురాలు రాధా ఓ సినిమా తీశారు. ఆ చిత్రం తమిళంలో ఇప్పటికే ‘నాన్ యార్’ పేరుతో విడుదలైంది. తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్‌తో త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో షాక్ తగిలింది. ఈ విషయమై పూరీ జగన్నాథ్‌ను సంప్రదించాలని ప్రయత్నించాం. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో తమిళ నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేసి, సత్వర పరిష్కారం కోసం ఇక్కడ మీడియాను ఆశ్రయించాం’ అని చెప్పారు. అంతేకాదు ఆయన తన వాదనను వినిపించి, ఆధారాలను కూడా మీడియా ముందు ఉంచారు. సమస్య సామరస్యంగా పరిష్కారం కానీ పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

Link to comment
Share on other sites

4 minutes ago, MiryalgudaMaruthiRao said:

Veedu inka cinemalu teesthunnada 

veedu edho tamil lo oka 4 yrs back adedho chillar cinema theesinaadu anta

 

Link to comment
Share on other sites

ఒకరి ఆలోచనల్ని ఇంకొకరి మెదడులోకి పంపిస్తే తదనంతర పర్యవసానాలేమిటి? అన్న కాన్సెప్టుతో తాను ఒక సినిమా తెరకెక్కించానని ఆ సినిమా తమిళంలో ఇప్పటికే రిలీజై విజయం సాధించిందని ఆకాశ్ తెలిపారు. పూరి తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` ఇంచుమించు అదే కథతో రావడం తనను షాక్ కి గురి చేసిందని అన్నారు. నా సినిమా కథలో లండన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. హీరో ఇద్దరిలానే ప్రవర్తిస్తాడు. కానీ ఇస్మార్ట్ శంకర్ లో ఆంధ్రా - తెలంగాణ నేపథ్యం చూపించారు. హీరో పాత్ర చిత్రణ ఒకేలా ఉన్నా బ్యాక్ డ్రాప్ మారిందని తెలిపారు. ఆకాష్ మాట్లాడుతూ-``ఇస్మార్ట్ శంకర్ హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తీసినదని అన్నారు. ఐ బోయ్ .. క్రిమినల్ చిత్రాల స్ఫూర్తి ఉంది. అయితే `ఐ బోయ్` 2017లో రిలీజైంది. అలాగే క్రిమినల్ 2016లో రిలీజైంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కాక ముందే నేను తెరకెక్కించిన `నాన్ యార్` తమిళంలో రిలీజైంది. అక్కడ చక్కని విజయం అందుకుంది. ఈ సినిమాని తెలుగులో `కొత్తగా ఉన్నాడు` పేరుతో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాను. ఈలోగానే ఇస్మార్ట్ శంకర్ రిలీజైంది. ఇక నేను నా చిత్రాన్ని రిలీజ్ చేయలేని పరిస్థితి నెలకొంది`` అని ఆరోపించారు. `నాన్ యార్` సినిమాని ఇంగ్లీష్ లోనూ తెరకెక్కించేందుకు బ్రిటన్ లో స్క్రిప్టును రిజిస్టర్ చేయించాననని ఆకాశ్ వెల్లడించారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...