Jump to content

ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ పోతోంది


snoww

Recommended Posts

‘రెండునెలలు కాలేదు..ప్రజలు రోడ్డెక్కుతున్నారు’

ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ పోతోంది
అసెంబ్లీలో సీఎం శాసిస్తున్నారు.. స్పీకర్‌ పాటిస్తున్నారు
తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు

230719cbn1-brkk.jpg

అమరావతి: రాష్ట్రాన్ని జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటే బంగారు బాతులా ఉంటుందని.. ప్రస్తుతం ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ పోయి ఎవరైనా రావాలంటేనే భయపడే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. మూడేళ్ల పసిబిడ్డ అమరావతిని చంపేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రోజుకు కనీసం నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇవి సీఎం జగన్‌కు ఎందుకు కనిపించటం లేదని ప్రశ్నించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. అన్నదాత-సుఖీభవ కింద ఇవ్వాల్సిన సాయాన్ని తగ్గించి రైతులను మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇసుక విధానంపై ఎన్నో విమర్శలు చేశారని, తమ హయాంలో ఏ ఒక్క రోజూ ఇసుక కోసం ప్రజలు రోడ్డెక్కలేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా కాకముందే అన్ని వర్గాల ప్రజలూ రోడ్డెక్కుతున్నారని విమర్శించారు. వైకాపా నేతల దోపిడీ కోసం అనేక నిబంధనలు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇష్టానుసారంగా వాటాలు వేసుకుంటూ వ్యవస్థను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. తక్కువ సమయంలో అనేక తప్పులు చేస్తూ వాటిని సమర్ధించుకుంటున్నారని ఆరోపించారు. పులివెందుల తరహా పంచాయితీలు ఇక్కడ సాగవని.. త్వరలోనే తిరుగుబాటు తప్పదన్నారు. అసెంబ్లీలో సీఎం శాసిస్తున్నారు.. స్పీకర్ పాటిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో ప్రజా చైతన్యం చాలా అవసరమని.. వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. 

Link to comment
Share on other sites

8 minutes ago, Somedude said:

AP Govt changed, AFDB paper boy changed!

we still need @psycopk to post all these anti development araachakaalu happening in Andhra .

He can do full justice by posting full paper in nice format

Link to comment
Share on other sites

26 minutes ago, snoww said:

we still need @psycopk to post all these anti development araachakaalu happening in Andhra .

He can do full justice by posting full paper in nice format

But you are doing better tenor.gif?itemid=7611644

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

Musalodi chadastham...AP k image anta...adi damage anta...

#Bihar_Of_South

Plz limit ur self to chekka cheebbnn. Ap meedha edavalsina avasaram ledhu.

kcr cm gaa unnapudu bihar of south title ki kooda competition untadi ley 

Link to comment
Share on other sites

5 minutes ago, Android_Halwa said:

Musalodi chadastham...AP k image anta...adi damage anta...

#Bihar_Of_South

lol nee edupu AP meeda enduku...tdp, cbn, pappu meeda concentrate chesko vayya

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...