Jump to content

కాళేశ్వరానికి పోటెత్తిన వరద


snoww

Recommended Posts

Flood water to the Kaleshwaram Project - Sakshi

కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఐదు మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్న దృశ్యం

కన్నెపల్లిలో ఐదు మోటార్లతో ఎత్తిపోతలు 

అన్నారం బ్యారేజీకి జలప్రవాహం 

కాళేశ్వరం/మంథని: కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో కురిసిన వర్షాలవల్ల ప్రాణహిత నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. కన్నెపల్లి పంపుహౌస్‌లో ఐదు మోటార్లు ఏకధాటిగా నడుస్తుండటంతో గ్రావిటీ కాల్వ ద్వారా వెళుతున్న నీరు అన్నారం బ్యారేజీకి చేరి జలకళ ఉట్టి పడుతోంది. మంగళవారం కన్నెపల్లి పంపుహౌస్‌లో 2వ నంబర్‌ మోటార్‌కు వెట్‌రన్‌ పూర్తి చేసి ఎత్తిపోతలు చేస్తున్నారు. 1, 2, 3, 4, 6వ మోటార్లు నీటిని డెలివరీ సిస్టంలో ఎత్తిపోస్తున్నాయి. ఒక్కో మోటార్‌ రోజుకు 2,210 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఐదు మోటార్లు 24 గంటలు  నడిస్తే ఒక్క టీఎంసీ నీరు తరలించొచ్చు. కాగా, మేడిగడ్డ బ్యారేజీలో ప్రస్తుతం 6.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బ్యారేజీలో మొత్తం 85గేట్లు మూసి ఉంచారు.  

రెండో మోటార్‌ వెట్‌రన్‌ 
మూడు రోజుల క్రితమే అన్నారం పంపుహౌస్‌లో మొదటి మోటార్‌కు అధికారులు వెట్‌రన్‌ నిర్వహించారు. మోటార్‌ను సోమవారం చాలాసేపు నడిపిం చడంతో సుందిళ్ల బ్యారేజీలోకి నీరు చేరుతోంది. మంగళవారం మొదటి మోటార్‌ నడిపిస్తూనే రెండో మోటార్‌కు వెట్‌రన్‌ నిర్వహించారు. దీంతో సుందిళ్ల బ్యారేజీలోకి కాళేశ్వరం జలాలు చేరుతున్నాయి.  

వారంలో ఎల్లంపల్లికి.. 
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మరో వారం రోజుల్లో కాళేశ్వ రం జలాలు చేరే అవకాశం ఉంది. కన్నెపల్లిలో ఐదు మోటార్లు ఇప్పటికే ప్రారంభించగా మరో రెండు మోటార్లు నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నారంలోనూ మరో రెండు మోటార్లు నడిపించేలా సన్నాహాలు చేస్తున్నారు. అనుకున్నట్లుగానే మోటార్లు నడిస్తే రెండు మూడు రోజుల్లో సుందిళ్ల బ్యారేజీ పూర్తిగా నిండి ఎల్లంపల్లి దిశగా ఎదురెక్కే అవకాశం ఉంది. 74 గేట్లతో 8.8 టీఎంసీల సామర్థ్యం ఉన్న సుందిళ్ల బ్యారేజీలో ప్రస్తుతం 0.35 టీఎంసీల నీరు చేరింది. కేవలం ఒక్క మోటారు కొద్ది గంటలు నడిస్తేనే ఇలా ఉంటే.. నిరంతరం నాలుగు మోటార్లు నడిస్తే నాలుగు రోజుల్లో బ్యారేజీ నిండి గోలివాడ పంప్‌హౌస్‌కు నీరు చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

 

ఆల్మట్టిలోకి 15వేల క్యూసెక్కులు 
ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టికి ప్రవాహాలు తగ్గినా, ఒక టీఎంసీకి తగ్గకుండా ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15,300 క్యూసెక్కు ల మేర ప్రవాహం వస్తోంది. దీంతో ఆల్మట్టిలో ప్రస్తు తం 129 టీఎంసీలకు గానూ 119 టీఎంసీల మేర నిల్వలున్నాయి. మరో 10 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండనుంది. దిగువ నారాయణపూర్‌ ప్రాజెక్టులోకి పూర్తిగా ప్రవాహాలు తగ్గాయి. ప్రాజెక్టులో 37 టీఎంసీలకు గానూ 34 టీఎంసీల నిల్వలుండగా, 4,500 క్యూసెక్కుల నీటిని కాల్వలకు వదులుతున్నారు.  

  • Like 1
Link to comment
Share on other sites

KLIS-750x355.jpg Water from the Medigadda barrage being pumped and released into Annaram barrage on Tuesday.

Hyderabad: Stage is being set for wet run of the pumping units at Sundilla barrage pumphouse. The critical feat will be scheduled either for Sunday or Monday, according to officials. The barrage, which holds a special place in Kaleshwaram Lift Irrigation Scheme, has received 0.35 tmc of water from the Annaram barrage so far.

Two pumping units of the Annaram barrage, which were synchronised, have been in operation in the day. The Sundilla barrage serves a conduit between Link -1 and Link -2 of the scheme. Water would be lifted in the third stage from the Sundilla barrage to the Sripada Yellampali project which, in turn, would be routed to the ayacut of the existing projects, including the Sri Ram Sagar Project.

 

Two of the pumping units in Annaram pumphouse are in operation in the day. The Annaram barrage has a storage of 6 tmc of water and the water levels touched 116.55 m. The water level in the gravity canal of Medigadda barrage as well as the Annaram barrage is almost the same at their merging point.

Five of the eleven pumping units of the Kannepally pumphouse were brought into operation in auto mode by Tuesday evening. Pump No. 2 was the last unit to be switched over to auto mode at Kannepally. Efforts are on to put the remaining units also into operation.

All the five units ( 40 MW capacity each) were synchronised and operated for more than a week on manual mode before they resumed operations in auto mode. With the water level in Medigadda touching 96.55 m, the barrage has seven tmc of water as its live storage.

Link to comment
Share on other sites

Fish

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కోటి 24 లక్షల చేప పిల్లలను వదిలేందుకు మత్సశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే మరో 25 లక్షల రొయ్య పిల్లలను వదిలేందుకు అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అవసరమైతే సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ఇక్కడ నుంచే చేప పిల్లలను వదిలే కార్యక్రమం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించకముందే మూడు నెలల క్రితం నుంచే నీటి సామర్థం, ఎంత విస్తీర్ణంలో ఎన్ని కిలోమీటర్ల మే నీరు అందుబాటులో ఉంటుంది. ఎక్కడెక్కడ చేప పిల్లలను వదలాలి.. ఎన్ని చేప పిల్లలు అవసరం అవుతాయి.. ఏయే గ్రామాల్లోని సొసైటీలకు అవకాశం ఉంటుందనే విషయాలపై మత్సశాఖ బేస్‌లైన్ సర్వే నిర్వహించింది. భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో ఈ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయనున్నారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి రిజర్వాయర్ల పరిధిలో ఏ రకమైన చేపల పెంపకాన్ని అవకాశం ఉందో అధికారులు నివేదిక తయారు చేశారు. మంచిర్యాల జిల్లా పరిధిలో గోదావరి నది 46 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో 29.44 లక్షల చేప పిల్లలు వేయాలని నిర్ణయించారు. అలాగే పెద్దపల్లి పరిధిలో 56 కిలో మీటర్ల పరిధిలో నది ఉండగా 44.80 లక్షల చేప పిల్లలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో 72 కిలో మీటర్లు ఉండగా 50 లక్షల చేప పిల్లలను వదలాలని నిర్ణయించారు. ఇందులో కొర్రమీను 10 శాతం వేయనున్నారు. సాధారణంగా చేపట్టిన చేప పిల్లల పంపిణీ పథకంలోనే ఈ మొత్తం చేప పిల్లలకు కూడా టెండర్లు తీసుకున్నట్లు మత్సశాఖ కమిషనర్ సువర్ణ మన తెలంగాణకు తెలిపారు. నది సరాసరి వెడల్పు 1 కిలో మీటరు ఉంది. లోతు వరుసగా 7 మీటర్లు, 5 మీటర్లు, 7 నుంచి 12 మీటర్లు ఉంటుందని నిర్ధారించారు. ఈ మూడు జిల్లాల పరిధిలో దాదాపు వెయ్యి మంది మత్సకారులు లైసెన్సులు తీసుకుంటున్నారు. ఇప్పటికే మత్సకారుల సహకార సంఘాల కిద 2650 మంది ఉన్నట్లు మత్సశాఖ పేర్కొంది.
పెరగనున్న చేపల ఉత్పత్తి
ప్రస్తుతం ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపడుతోంది. తద్వారా ఏడాదికి సగటున 3 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి వస్తోంది. దీనిని నాలుగు లక్షల టన్నులకు పెంచాలనేది మత్సశాఖ లక్షంగా ఉంది. 201617 లో 27 కోట్లు, 201718లో 51 కోట్లు, 201819లో 55 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో వదిలింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ల పరిధిలో కేజ్ కల్చర్, పెన్ కల్చర్‌ను ప్రోత్సాహించాలని భావిస్తోంది. సిఎం కె. చంద్రశేఖర్‌రావు ఆశయాలకు అనుగుణంగా ఏడాదికి కనీసం 10 నుంచి 11 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి సాధించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు మత్సశాఖ అధికారులు చెబుతున్నారు. కాళేశ్వరంలో ఏడాదిలో రెండు సార్లు చేపల పెంపకం పెంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. దీంతో ఉత్పత్తి మరింత పెరిగి మత్సకారులకు లాభాలు వస్తాయని, రాష్ట్రంలో మత్సపరిశ్రమ వృద్ధి చెందుతుందని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

5 minutes ago, pahelwan said:

Idi da vision ante idi ra engineering ante 

em vision vayya.

PPT lu ekkada , multiple inagurations evi , gate opening ceremony lu evi , gallery walk lu evi , public bus tour lu evi , bhajana lu evi 

idi oka project ee naa ani @futureofandhra bro asking. 

  • Haha 1
Link to comment
Share on other sites

45 minutes ago, snoww said:

em vision vayya.

PPT lu ekkada , multiple inagurations evi , gate opening ceremony lu evi , gallery walk lu evi , public bus tour lu evi , bhajana lu evi 

idi oka project ee naa ani @futureofandhra bro asking. 

Aa visayam lo matram we are lagging behind eh maata ki aa maata oppukovali manam

Link to comment
Share on other sites

52 minutes ago, snoww said:

em vision vayya.

PPT lu ekkada , multiple inagurations evi , gate opening ceremony lu evi , gallery walk lu evi , public bus tour lu evi , bhajana lu evi 

idi oka project ee naa ani @futureofandhra bro asking. 

Ofcourse bro...

ie vishayam lo matram chala venakabadi vunnam..

oka PPt ledu, multiple inaugurations levu, bus tours levu, Bhajana ledu, infact serious business thapa edi ledu...

Hopefully KCR would learn such things from South Bihar Ex-CM CBN

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...