Jump to content

నిమిషాల్లోనే మరో షాక్ ఇచ్చిన కర్నాటక స్పీకర్


snoww

Recommended Posts

నిమిషాల్లోనే మరో షాక్ ఇచ్చిన కర్నాటక స్పీకర్
25-07-2019 20:49:36
 
 
636996845747709988.jpg
బెంగళూరు : కర్నాటక స్పీకర్ రమేశ్ కుమార్ నిమిషాల్లోనే మరో షాక్ ఇచ్చారు. ఇంతకు ముందు కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేపై వేటు వేయగా, తాజాగ మరో ఇద్దరు రెబెల్స్‌పై అనర్హత వేటు వేశారు. దీంతో మొత్తం ముగ్గుర్నీ అనర్హులుగా ప్రకటిచింనట్లైంది. ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, రమేశ్ జార్జిహోళి, మహేశ్‌లపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. కుమార స్వామి ప్రభుత్వం పడిపోయిన 48 గంటల్లోనే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Link to comment
Share on other sites

రాజకీయ అనిశ్చితికి ఉద్యోగులు బలి

కన్నడ నాట ప్రభుత్వం ఏర్పడకపోతే జీతాలుండవ్‌

karnataka_9.jpg

 బెంగళూరు: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు కుమారస్వామి ప్రభుత్వ పతనం..కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల పై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం అక్కడ బలపరీక్ష ఘట్టం మాత్రమే పూర్తయింది. ఇంకా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో స్పష్టత రాలేదు. ఈ ప్రక్రియ ఆలస్యమయితే అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు భారీగా నష్టపోనున్నారు. ఈ సంక్షోభం త్వరగా తేలకపోతే వారికి జీతాలు రావు. ఈ నెలాఖరులోపు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే సరి..లేకపోతే వారికి ఈ నెలకు జీతాలు అందే పరిస్థితి లేదు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం లేదు. కాబట్టి ప్రభుత్వ ఖాజనా నుంచి నిధులు విడుదల కావు. 

ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం నడవక పోతే ఉద్యోగులు భారీగా నష్టపోనున్నారు. ఏదీ తేలని పక్షంలో గవర్నర్‌ కూడా నిధులను విడుదల చేయలేరు. ఎందుకంటే కర్ణాటకలో ప్రభుత్వం మాత్రమే పడిపోయింది. అసెంబ్లీ రద్దుకాలేదు. ఈ క్రమంలో కన్నడనాట ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి ఉద్యోగులు బలికానున్నారు. మరోవైపు బలపరీక్ష పూర్తయి రెండు రోజులు పూర్తి అవుతున్నా కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఇంతవరకు స్పష్టత రాలేదు. భాజపా నేతలు ఈ మేరకు నేడు కేంద్ర మంత్రి, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఆయన సూచనల మేరకు ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...