Jump to content

వివాహేతర సంబంధాన్ని కప్పిపుచ్చుకునేందుకు దారుణానికి తెగబడ్డ మహిళ


Somedude

Recommended Posts

వడోదర: వివాహేతర సంబంధం కారణంగా పుట్టిన బిడ్డ విషయం నలుగురికీ తెలిస్తే పరువు పోతుందని భయపడిన ఓ మహిళ దారుణానికి తెగబడింది. నెల రోజుల వయసున్న ఆ పసికందును నిర్దాక్షిణ్యంగా చంపేసి మురికి కాలువలో పడేసింది. ఈ దారుణం గుజరాత్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే..కైరా జిల్లాకు చెందిన ఆశా రాథోడ్‌కు 2009లో పెళ్లైంది. ఆమెకు ఇద్దరు సంతానం. అయితే కుటుంబ కలహాల కారణంగా కొంత కాలంగా భర్తకు దూరంగా నివశిస్తోంది. వీరి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో ఆశాకు మరో వ్యక్తితో సంబంధం ఏర్పడి, గర్భందాల్చింది. ఏప్రిల్ నెలలో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే బంధువుల్లో తన పరువు పోతుందని భయపడిన ఆశా..ఆ పసికందును మే 23న చంపేసి మురికి కాలువలో పడేశింది. డ్రైనేజీలో బాలుడి శవం కనబడిందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. స్థానికంగా ఉన్న అన్ని ఆసుపత్రులలో ఎంక్వైరీ చేశారు. దీంతో ఆశా ఓ బిడ్డకు జన్మనిచ్చిందని తెలుసుకుని..ఆమె వద్దకు వెళ్లారు. నీ బిడ్డ ఏమైందని ఆశాను ప్రశ్నించడంతో ఆమె చేసిన నేరం వెలుగులోకి వచ్చింది. హత్యా నేరంపై ఆమెను సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

 

Rey rey meeru 10gichunte condoms or pills use cheyyochu kadhara. Pasi bidda ni bhommeedhaki thecchi champadam entira sadist physcho vedhavvalara..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...