Jump to content

Congress senior leader Mukesh goud passes away


kakatiya

Recommended Posts

ముఖేశ్‌గౌడ్‌ కన్నుమూత

ఈనాడు, హైదరాబాద్‌ - ఫిలింనగర్‌, గోషామహల్‌, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ముఖేశ్‌గౌడ్‌ (60) అనారోగ్యంతో కన్నుమూశారు. గŸత రెండేళ్లుగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఆదివారం రాత్రి విషమించింది. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఫిలింనగర్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1959 జులై 1న ముఖేశ్‌గౌడ్‌ జన్మించారు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారులు విక్రమ్‌గౌడ్‌, విశాల్‌గౌడ్‌, కుమార్తె శిల్ప ఉన్నారు. ముఖేశ్‌ మరణవార్త తెలియగానే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు మల్లికార్జున ఖర్గే, రేవంత్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ తదితరులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన మృతి కాంగ్రెస్‌కి తీరని లోటని.. ముఖేశ్‌ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. 
కార్పొరేటర్‌ నుంచి మంత్రి దాకా... 
బడుగు బలహీనవర్గాల నేతగా పేరొందిన ముఖేశ్‌గౌడ్‌ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అనారోగ్య కారణాలతో గత ఏడాదిగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నా.. మూడు దశాబ్దాల పాటు రాజకీయాలతో విడదీయలేని అనుబంధాన్ని కొనసాగించారు. సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్‌లో చేరిన ఆయన శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రస్థానాన్ని కొనసాగించారు. తొలినాళ్లలో కాంగ్రెస్‌ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐలో చేరి.. తర్వాత యువజన కాంగ్రెస్‌ నేతగా పనిచేశారు. 1986లో కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆ పదవిలో కొనసాగుతూనే 1989లో మహారాజ్‌గంజ్‌ (ప్రస్తుతం గోషామహల్‌) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి భాజపా సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయపై విజయం సాధించడంతో ఆయన రాజకీయ దశ తిరిగినట్లయింది. 1992లో హడ్కో ఛైర్మన్‌ పదవి చేపట్టి రెండేళ్లు కొనసాగారు. 1989 నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన మూడుసార్లు విజయం సాధించారు. వైఎస్‌ఆర్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లలో ఏడేళ్లపాటు మంత్రిగా పనిచేశారు. 

ముఖేశ్‌గౌడ్‌ కన్నుమూత

అధికారికంగా అంత్యక్రియలు: సీఎం ఆదేశం 
ప్రజల సందర్శనార్థం మంగళవారం ఉదయం ముఖేశ్‌గౌడ్‌ భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌ నివాసం నుంచి గాంధీభవన్‌కు అక్కడి నుంచి ఎంజే మార్కెట్‌లోని ఆయన పాత నివాసానికి తరలిస్తారు. అక్కడి నుంచి అంతిమయాత్రగా బయల్దేరి మధ్యాహ్నం ఒకటిన్నరకు దర్గాలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ వద్ద గల మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ముఖేశ్‌గౌడ్‌ మృతిపై సీఎం కేసీఆర్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్‌ రాజేశంగౌడ్‌ తదితరులు సంతాపం తెలిపారు. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఎస్కే జోషిని సీఎం ఆదేశించారు.

Link to comment
Share on other sites

23 minutes ago, pahelwan said:

Hyd la minister ga unappudu g valga bhumulu kabza chesindu maakada gadu itlanti badcow gallu saste happy ga feel kavali myan

prathi rajakeeya nayakudu edho oka kabza or kumbhakonam lo unna vaade!

 

ledhu antey inka vaadi peru raledhu ani mathramey anukovali!

How so ever, aa rangam asuvantidhi..nuvu digakapothey ninnu dimputharu nayana bayana! 

but manam manishi aney vignyatha eppudu antey ee edupu vaaru poyina prakatana appudu mathramey vellagakkutham chudu bro..akkadey manam  neechula nundi inka adhahniki digajaripoyam anthey

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...