Jump to content

బిరబిరా కృష్ణమ్మ.. గలగలా గోదావరి


Hydrockers

Recommended Posts

నిండుకుండను తలపిస్తున్న శ్రీశైలం

krishana1a.jpg

శ్రీశైలం: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని నదులకు భారీగా పెరిగిన వరద ప్రవాహంతో దిగువకు నీటి విడుదల అధికమైంది. ఆల్మట్టి జలాశాయానికి ప్రవాహం పెరుగుతుండటంతో.. నారాయణ్‌పూర్‌ నుంచి నీటి విడుదల పెరిగింది. ఫలితంగా శ్రీశైలం నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుత నీటి మట్టం.. ఇంచుమించు పూర్తి స్థాయి నీటిమట్టాన్ని తాకుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 874.70 అడుగులుగా ఉంది. 

శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 165.05 టీఎంసీల నిల్వ ఉంది. జలాశయం ఇన్‌ఫ్లో 2,76,648 క్యూసెక్కులుగా ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా4 2,378 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి31,613 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 15,000 క్యూసెక్కులు, ముచ్చిమర్రి నుంచి కేసీ కెనాల్‌కు735 క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 1013 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహాన్ని బట్టి శుక్రవారం తర్వాత ఎప్పుడైనా శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

34 minutes ago, machoman said:

ap tg lo last 10yrs kana best rains aa rofl

in TG 

As against the average rainfall of 422.1 mm between May 1 and August 7, the State has received 437.5 mm rain during this period which is four per cent excess than normal rainfall.

Link to comment
Share on other sites

North Karnataka Nd Maharashtra lo heavy rains...

ie debba ki Godavari and Krishna lo heavy inflows to continue for another 15-20 days...debba ki motham nindipotayi

 

Link to comment
Share on other sites

7 hours ago, Hitman said:

ఆంధ్ర లో వర్షాలు లేవు. Only శ్రీకాకుళం జిల్లా పడుతున్నాయి 

Idhi nakka rajyam kaadhu varshaalu padakapodaaniki ani @DaleSteyn1 uncle cheppamannadu

Link to comment
Share on other sites

3 hours ago, sattipandu said:

It hurts to seee godavari over spilling into ocean

Every drop of godavari has to be used.

Andhukey Polavaram project ni urakalethisthunnadu jagan Anna works aapeysi

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

North Karnataka Nd Maharashtra lo heavy rains...

ie debba ki Godavari and Krishna lo heavy inflows to continue for another 15-20 days...debba ki motham nindipotayi

 

neee notla shakkar poyya

sriramsagar mareee 2 tmc ki vachindayya ee summer lo out of 90tmc capacity choosthey tharukku poyindhi anukooo

Link to comment
Share on other sites

5 hours ago, Android_Halwa said:

North Karnataka Nd Maharashtra lo heavy rains...

ie debba ki Godavari and Krishna lo heavy inflows to continue for another 15-20 days...debba ki motham nindipotayi

 

Inka 15 daya ante anni cheruvulu kuda nimpochu

Link to comment
Share on other sites

4 hours ago, sattipandu said:

neee notla shakkar poyya

sriramsagar mareee 2 tmc ki vachindayya ee summer lo out of 90tmc capacity choosthey tharukku poyindhi anukooo

sriram sagar is at 10.30 tmc as of now

Link to comment
Share on other sites

కృష్ణా, గోదావరి పరవళ్లుశ్రీశైలంలో 173.06

టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

పోటాపోటీగా కృష్ణా, గోదావరి

శ్రీశైలంలోకి 3,71,014 క్యూసెక్కుల ప్రవాహం.. 173.06 టీఎంసీలకు నీటి నిల్వ

రేపు పలు గేట్లు ఎత్తే అవకాశం

వరద ప్రవాహం ఇలాగే ఉంటే వారం రోజుల్లో నిండుకుండలా సాగర్‌

మళ్లీ గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం నుంచి 13.62 లక్షల క్యూసెక్కులు కడలిలోకి

వంశధార, నాగావళి తగ్గుముఖం ∙గొట్టా బ్యారేజీలో 22 గేట్లు ఎత్తివేత

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌ :ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం పోటెత్తుతోంది. నాలుగురోజుల పాటు ఉగ్రరూపం ధరించిన గోదావరి గురువారం శాంతించినట్లు కనిపించి మళ్లీ ఉధృతమైంది. శ్రీశైలంలోనూ అంతకంతకూ వరదపోటు పెరిగిపోతుండడంతో శుక్రవారం జలాశయంలోని పలు గేట్లను ఎత్తేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి నదులు కొంత శాంతించాయి. ఇక్కడ గొట్టా బ్యారేజీకి చెందిన 22 గేట్లను ఎత్తివేశారు.

గోదావరి మళ్లీ ఉగ్రరూపం
కాగా, నదీ పరివాహక ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో గురువారం మధ్యాహ్నానికి గోదావరి ఒక్కసారిగా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 44.20 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. మధ్యాహ్నం 12 గంటలకు పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం 13 లక్షల క్యూసెక్కులకు చేరింది. కాఫర్‌ డ్యామ్‌ వద్ద వరద నీటి మట్టం 28.15 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి గురువారం ఉదయం ఆరు గంటలకు 9,96,503 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. సాయంత్రం 6 గంటలకు ఆ ప్రవాహం 13,62,041 క్యూసెక్కులకు చేరింది. ఇక్కడ నీటి మట్టం 14.25 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.

రాత్రి 7 గంటలకు 14.30 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇక్కడ వచ్చిన వరదను వచ్చినట్టుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాగా, వరద పోటుతో దిగువ లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. కోనసీమలోని వైనతేయ గోదావరి నదీతీరంలోని లంక గ్రామాలను వరద మళ్లీ ముంచెత్తింది. రాజోలు నియోజకవర్గంలో వరద తగ్గుతున్నట్టే తగ్గి మళ్లీ పెరగడంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేవీపట్నంలో వరదనీరు మరోసారి పెరిగింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని కడెమ్మ వంతెనపై నాలుగు అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. గోదావరి గట్టును ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

శాంతించిన వంశధార, నాగావళి
ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులు గురువారం కొంత శాంతించాయి. గొట్టా బ్యారేజీకి చెందిన 22 గేట్లు ఎత్తేశారు. బ్యారేజీలోకి ఉదయం 1,12,210 క్యూసెక్కుల ప్రవాహం రావడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఎగురవేసి అంతేస్థాయిలో ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు. ఆ తర్వాత వరద తగ్గుముఖం పట్టి రాత్రి 8 గంటలకు 70 వేల క్యూసెక్కులకు చేరింది. వరదల కారణంగా గార మండలంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. జిల్లాలో మొత్తం 8.600 హెక్టార్లు నీట మునిగాయని అధికారులు తెలిపారు. 12మండలాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

రేపు శ్రీశైలంలో పలు గేట్లు ఎత్తివేత?
కృష్ణా నదిలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి మరింత పెరిగింది. శ్రీశైలం జలాశయంలోకి గురువారం రాత్రి ఏడు గంటలకు 3,71,014 క్యూసెక్కులు చేరుతోంది. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు.. హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ల ద్వారా 96,401 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 877 అడుగుల్లో 173.06 టీఎంసీలకు చేరుకుంది.
krishna.jpg
వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగితే.. శనివారం శ్రీశైలం జలాశయంలోని నాలుగు గేట్లను ఒక్కొక్కటి 10 అడుగుల మేర తెరిచి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. అలాగే, సాగర్‌లో ప్రస్తుతం 514.2 అడుగుల్లో 138.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇది పూర్తిస్థాయిలో నిండాలంటే.. ఇంకా 174 టీఎంసీలు అసవరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్‌ జలాశయం నిండే అవకాశం ఉంది.  

 

Sakshi
Link to comment
Share on other sites

Sagar ki water vadalatam start chesaru

Sagar + pulichintala nindali ante 200 TMC lu kavali 

Migita projects ki divert chese water inko 200 tmc lu 

Total more than 400 tmc lu

Chudham.telugu raithannala thala ratha ela undo

Link to comment
Share on other sites

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
10-08-2019 08:06:13
 
 
నల్గొండ: నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్.. ఇన్‌ఫ్లో-2.35 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో-6వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ-312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం-150 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం-590 అడుగులు కాగా, ప్రస్తుతం-521 అడుగులకు చేరుకుంది.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...