Jump to content

బిరబిరా కృష్ణమ్మ.. గలగలా గోదావరి


Hydrockers

Recommended Posts

నాగార్జునసాగర్‌కు జలకళ
nagarjuna_1.jpg

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్‌కు ఇన్‌ఫ్లో 5,34,079 క్యూసెక్కులు ఉండగా..ఔట్‌ఫ్లో 25,013 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 532.80అడుగులుగా నమోదైంది. జలాశయపూర్తి స్థాయి నీటిసామర్థ్యం 312టీఎంసీలకుగానూ.. ప్రస్తుతం 178.66టీఎంసీలుగా ఉంది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. జలాశయానికి 7.55 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా..దిగువకు 7.61లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తం 62 గేట్లకుగానూ..60గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Rivers of Krishna and Godavari and Vamsadhara are Overflowing after 10 years - Sakshi

శ్రీశైలం డ్యాం నుంచి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

పదేళ్ల తర్వాత ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి, వంశధార నదులు 

పూర్తిస్థాయిలో నిండిపోతున్న జలాశయాలు 

గోదావరి, కృష్ణా డెల్టాలు, వంశధార, తోటపల్లి ప్రాజెక్టుల కింద ఆయకట్టులో మొదలైన పంటల సాగు 

సాగర్‌ ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన ప్రభుత్వం  

ఆగస్టు రెండో వారంలోగా నీటిని విడుదల చేయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి 

ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, హెచ్చెల్సీ, ఎల్లెల్సీలకు సాగునీరు విడుదలతో రైతుల్లో ఆనందం 

గాలేరు–నగరి, హంద్రీ–నీవా తొలి దశ ఆయకట్టుకు నీళ్లందించడానికి సర్కారు సన్నాహాలు 

ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందంటున్న అధికార వర్గాలు 

Link to comment
Share on other sites

Srisailam all set to touch 10-year high

Inflows expected to reach 9 lakh cusecs; 4 NSP gates to be lifted today

Srisailam Srisailam project was maintaining an outflow of 7,78,848 cusecs on Sunday.

Hyderabad: With Krishna river swollen due to heavy rains in the upper reaches, the inflows received at Srisailam project, one of the common projects of Telangana and Andhra Pradesh was 6,53,344 cusecs on Sunday. The inflows are expected to swell touching nine lakh cusecs tonight, which would be the highest after 2009, when over 9.5 lakh cusecs of flood was received only from Jurala project while almost a matching contribution was made to the flooding by Tungabhadra inundating Kurnool city.

Link to comment
Share on other sites

నేడు సాగర్ గేట్ల ఎత్తివేత...

నాగార్జునసాగర్‌లో ఆదివారం రాత్రి 9 గంటలకు 8.18 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. సాగర్ ఎఫ్‌ఆర్‌ఎల్ 590 అడుగులుకాగా, 543.80 అడుగులకు నీరు చేరుకొన్నది. ప్రస్తుతం సాగర్‌లో 196.33 టీఎంసీల నిల్వకు చేరుకుంది. సాగర్ జలాశయానికి గంటకు కనీసంగా రెండు, రెండున్నర టీఎంసీల వరద వచ్చి చేరుతున్నది. జలాశయంలో ఇంకా 116 టీఎంసీల నిల్వకు అవకాశమున్నది. వరద పరిమాణం దృష్ట్యా మంగళవారం సాయంత్రం వరకు సాగర్ పూర్తిస్థాయి నిల్వకు చేరుకునే అవకాశాలున్నాయి. వరద పరిమాణం భారీగా ఉన్నందున అధికారులు సోమవారం ఉదయమే గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా దిగువకు సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదలచేయాలని నిర్ణయించినట్లు నాగార్జునసాగర్ సీఈ నర్సింహ తెలిపారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు సాగర్ గేట్లను ఎత్తేందుకు నిర్ణయించినట్లు ఎన్‌ఎస్‌పీ అధికారులు నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు సమాచారమిచ్చారు. సాగర్‌కు ప్రస్తుతం కొనసాగుతున్న ఇన్‌ఫ్లోల కారణంగా సుదీర్ఘకాలం తర్వాత పులిచింతలకు కూడా జలకళ రానున్నది. 45.77 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఉన్న పులిచింతలలో ప్రసుతం 1.05 టీఎంసీల నిల్వ మాత్రమే ఉన్నది. బేసిన్‌లో పులిచింతల నిండితే కర్ణాటక మొదలు తెలుగు రాష్ర్టాల్లోని అన్ని ప్రాజెక్టులు నిండినట్లవుతుంది. 

Link to comment
Share on other sites

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 21 గేట్లు ఎత్తివేత
12-08-2019 11:25:19
 
 
637012059221661760.jpg
నల్గొండ: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 21 గేట్లను అధికారులు ఎత్తివేశారు. భారీగా ఇన్‌ఫ్లో ఉండడంతో అన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. సాగర్‌ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇవాళ రాత్రికి పులిచింతల ప్రాజెక్ట్ నిండనుంది. నాగార్జునసాగర్‌కు రికార్డ్ స్థాయిలో వరద నీరు చేరింది. సాగర్‌కు భారీగా వరద రావడం 2009 తర్వాత ఇదే తొలిసారి. ఇన్‌ఫ్లో 8 లక్షల 25 వేల క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 556 అడుగులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు, ప్రస్తుతం 223 టీఎంసీలు.
Link to comment
Share on other sites

పదేళ్ల తర్వాత శ్రీశైలం రిజర్వాయిర్ లోకి పూర్తి స్థాయిలో నీరు రావడం, నాగార్జున సాగర్ కూడా నిండుతుండడం తో అంతా హర్షం వ్యక్తం అవుతోంది. 2009 తర్వాత రికార్డు స్థాయి వరద నమోదవుతోంది. ఆదివారం సాయంత్రం 5గంటలకు జూరాల నుంచి శ్రీశైలానికి 8,54,699 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885అడుగులు. 879.6 అడుగుల వద్ద నీటిని నిల్వచేసి, మిగిలిన వరదను దిగువకు వదులుతున్నారు. మొత్తం 12 క్రస్ట్‌గేట్లకు గాను పదిగేట్లు 33అడుగులమేర ఎత్తి 7,79,730 క్యూసెక్కులు సాగర్‌కు వదులుతున్నారు. .శ్రీశైలంలోకి సోమవారం ఒకేరోజు సుమారు 11 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిప్రవాహం వచ్చే అవకాశం ఉంది. ఈ నీరంతా దిగువకు అంటే, సాగర్‌లోకి విడుదల రానున్నందున ఈ రిజర్వాయర్‌ పూర్తిగా నిండనుంది. కృష్ణానదిలో ఆదివారం సుమారు 100టీఎంసీల వరద ఉంది. ఆదివారం రాత్రి వరకు సాగర్‌లో నీటినిల్వ 200 టీఎంసీలు దాటనుంది. సోమవారం ఉదయం 8గంటలకు సాగర్‌లోని నాలుగు క్రస్ట్‌గేట్లను ఎత్తనున్నారు. తుంగభద్ర జలాశయానికి వరద ఉప్పొంగుతోంది.

Link to comment
Share on other sites

3 hours ago, Hydrockers said:

Sagar ki tagginchi rayaseema project lu fill cheyandra babu

I may not have complete details. 

 

Rayalaseema (Pothireddypadu) can draw a maximum of 32,000 cusecs or so and there is one other that can draw another 2500 cusecs from Srisailam. No other way to draw water to Rayalaseema  at this time. 

Link to comment
Share on other sites

4 minutes ago, AndhraneedSCS said:

I may not have complete details. 

 

Rayalaseema (Pothireddypadu) can draw a maximum of 32,000 cusecs or so and there is one other that can draw another 2500 cusecs from Srisailam. No other way to draw water to Rayalaseema  at this time. 

Check once 

I read some where it is 75,000 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...