Jump to content

Fake matalu Fake posts - YCP online and offline


ariel

Recommended Posts

యథా సీఎం... తథా మంత్రి అన్నట్టు నోటికొచ్చిన అబద్ధాలతో ఎవరికివారు టీడీపీపై బురదచల్లేవారే కానీ ఈ ఆరోపణలపై కనీస అవగాహన కూడా ఉండటంలేదు వైసీపీ వాళ్ళకు. రిలయన్స్ కంపెనీ పేరుతో ఒక ఫేక్ కంపెనీని సృష్టించి 1000 ఎకరాలు కొట్టేసేందుకు టీడీపీ కుట్ర చేసిందని మంత్రి గౌతమ్ రెడ్డి ఆరోపించారు.

బాధ్యతారహితంగా ఆరోపణ చేసేముందు కనీసం ఒక రెండు నిముషాలు బుర్ర పెడితే సమాచారం అంతా ఇంటర్నెట్లోనే దొరికేది. రిలయన్స్ ప్రోలిఫిక్ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన సంస్థ. సంస్థ ఫైనాన్సియల్ స్టేట్ మెంట్లు కూడా విడుదల చేసింది చూడండి.

మంత్రిగారు ఈ సంస్థనే ఫేక్ కంపెనీ అంటున్నారు. ఫేక్ కంపెనీ ఎక్కడైనా ఫైనాన్సియల్ స్టేట్ మెంట్ లు రిలీజ్ చేస్తుందా? ఇది కూడా తెలీని వారు అక్రమాలపై లోతుగా విచారణ చేస్తారంట. మంత్రిగారూ! ఫేక్ కంపెనీల గురించి తెలుసుకోవాలంటే మీ అధినేత నేర చరిత్రను ఒకసారి చదువుకోండి.

No photo description available.
No photo description available.
No photo description available.
Image may contain: 1 person
-- Nara Lokesh
Link to comment
Share on other sites

అసెంబ్లీ సాక్షిగా మాట మార్చాం, మడమ తిప్పాం: అమ్మఒడి

అమ్మ ఒడి పథకంపై కూడా YS Jagan Mohan Reddy గారు తన మాట మార్చుడు ..మడమ తిప్పుడును యథేచ్ఛగా సాగించారు. ఎన్నికల సభల్లోనూ, పాదయాత్రలోనూ స్కూల్ కి వెళ్లే ప్రతి బిడ్డకి రూ.15 వేలు సాయం అన్నారు. అధికారంలోకి వచ్చాక అమ్మ ఒడి అనగానే తడబడటం ప్రారంభించారు.

మొదట ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలలో చదివేవారికి లేదని మంత్రి ప్రకటించారు. ఆ తరువాత ఎక్కడ, ఏ స్కూలైనా అమ్మ ఒడి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అసెంబ్లీకి వచ్చేసరికి తెల్లకార్డు ఉన్నవారికే అని, పిల్లల్లో ఒకరికే అని అమ్మ ఒడిని కాస్తా 'ఆంక్షల బడి' చేశారు.

జగన్ గారి హామీల ప్రకారం రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివే సుమారు 80 లక్షల మందికి అమ్మఒడి ఇవ్వాలి. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి బోలెడు షరతులు పెట్టి లబ్దిదారులను 43 లక్షలు.. అంటే సగానికి సగం చేశారు. మాటలు ఘనం, కోతలు సగం.. ఇదీ జగన్ గారి హామీల తీరు.

Link to comment
Share on other sites

ముఖ్యమంత్రి గారూ, ప్రతీనెలా 1వ తేదీనే అందుకునే పింఛను
గత నెల వారం దాటాక ఇచ్చి, ఈ నెల సగమే ఇచ్చి
అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్నారు. పింఛను వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చి 250 పెంచారు. ఈ 250లో మీ వైకాపా నాయకులు పెట్టిన హుండీలో 50 వేయాలి.

మిగిలిన సొమ్ము చిరిగిపోయిన నోట్లిచ్చి ముసలోళ్ల నోరు కొడుతున్నారు. నా పింఛను మొత్తం ఇవ్వలేదని అవ్వ అడుగుతోంది. చినిగిపోయిన నోట్లిచ్చి మోసంచేశారని తాత నిలదీస్తున్నాడు. పింఛనులో సగమే ఇచ్చారయ్యా అంటోంది ఓ వితంతువు. వైకాపా నేత నా దగ్గర రూ.50 తీసుకుంటున్నాడని వాపోతున్నాడు దివ్యాంగుడు.

Image may contain: 1 person, text
Image may contain: one or more people and text
Image may contain: one or more people, crowd and text
No photo description available.
Link to comment
Share on other sites

అసెంబ్లీ సాక్షిగా మాట మార్చాం, మడమ తిప్పాం : రైతు భరోసా

పాదయాత్ర నుండి రైతు దినోత్సవం వరకూ ప్రతి రైతుకూ రూ.12,500ల రైతు భరోసా ఇస్తామని చెప్పిన YS Jagan Mohan Reddy గారు, అసెంబ్లీకి వచ్చేసరికి మాటమార్చేసి మేమిచ్చేది 6,500 రూపాయలే అన్నారు. మిగతా ఆరువేల సంగతి ఏంటంటే కేంద్రం ఇస్తుంది కదా అని మడమ తిప్పేశారు.

జగన్ గారి మోసం వల్ల ఒక్కో రైతు.. ఏడాదికి రూ.6,000లు, అంటే ఐదేళ్ళకు రూ.30,000లు నష్టపోతున్నారు. రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మంది రైతులు ఒక్కొక్కరూ 30 వేల చొప్పున మొత్తంగా రూ.19,200 కోట్లు నష్టపోతున్నారు. చూసారా! ఒక్క అబద్దంతో ఏపీ రైతులను ఎంత భారీగా మోసం చేసారో!

Image may contain: 2 people
Link to comment
Share on other sites

పోలవరం పోయింది, అమరావతి అటకెక్కించారు. 5 రూపాయల భోజనం పోయింది. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు 45 సంవత్సరాల పెన్షన్ పోయింది. అమ్మబడి పథకం. కొందరికే పరిమితం. రైతులకు పంట పెట్టుబడి ఆసరా పదిహేను వేలు పోయి 6500 రూపాయలు వచ్చాయి. ఇ అంటే 8500 పోయాయి ముఖ్యమంత్రి యువ నేస్తం పోయింది. ఇంకా నవరత్నాల లో ఎన్ని రత్నాలు రాలుతా యో

Link to comment
Share on other sites

సున్నావడ్డీ రుణాల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని నేను పోస్ట్ చేస్తే, దాన్ని పక్కదోవ పట్టించి, వాళ్ళ YS Jagan Mohan Reddy గారు రైతులకు చేస్తున్న అన్యాయాన్ని సమర్ధించడానికి నైతిక విలువలు వదిలేసి అబద్ధాలు సృష్టిస్తున్నారు. వాళ్ళ అన్న పడేసే చిల్లర ఉండగా, ఇంక రైతుల కష్టనష్టాలతో వాళ్ళకి పని ఏముంది?

ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలని చూస్తే అసహ్యం కలుగుతోంది. ఇలా చిల్లర వేషాలతో ప్రజాసమస్యలను అపహాస్యం చేస్తుంటే ఇక ఊరుకునేది లేదు.

Image may contain: text
Link to comment
Share on other sites

వరుణుడు ఎప్పుడూ వై యస్ కుటుంబ పక్షపాతే!

రాజకీయాలు, సినిమాలు.. సెంటిమెంట్లు..వీటిని విడదీయలేమంటుంటారు... అలాంటి ఓ సెంటిమెంట్లలో వైఎస్ కుటుంబంపై చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. ప్రత్యేకించి వైఎస్సార్ సీఎం అయిన కాలంలో వర్షాలు బాగా కురిశాయని.. పంటలు బాగా పండాయని.. రాష్ట్రం సుభిక్షంగా ఉందని వైసీపీ నేతలు చెప్పుకుంటుంటూ ఉంటారు. గతంలో చంద్రబాబు పాలనలో సుదీర్ఘమైన కరువును అనుభవించడం రాష్ట్రప్రజలకు తెలిసిన విషయమే.

మళ్లీ ఇప్పుడు జోరుగా వానలు కురుస్తున్నాయని.. ఇదంతా వరుణ దేవుడికి వైఎస్ కుటుంబంపై ఉన్న ప్రేమే అంటున్నారు వైసీపీ నాయకులు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ఏమంటున్నారంటే...రైతులు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు ఐదు సంవత్సరాల పాలనలో కరువు తాండవం చేసింది. మహానేత తనయుడు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత ఆల్మట్టీ నుంచి 2.30 లక్షల క్యూసెక్కుల నీరు ఇవాళ బయటకు వస్తున్నాయి. "

" గత ఐదేళ్లలోఆల్మట్టీ నుంచి ఎంత నీరు బయటకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రకృతి విధ్వంసకులు పాలకులుగా ఉంటే ఏ విధంగా ఉంటుందో.. చంద్రబాబు గత ఐదేళ్ల పాలన తెలిసిపోతుంది. ఒక మీటింగ్‌లో వరుణదేవుడికి మేము అంటే ప్రేమ అని గతంలో వైయస్‌ఆర్‌ చెప్పారు. అన్నట్లుగానే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనలో వర్షాలు కురుస్తున్నాయి. రైతులు సంతోషంగా ఉంటారు.. చరిత్ర పునరావృతం అవుతుంది. 💐💐💐💐💐💐

-- 

-- YSRCP Official account post 

Link to comment
Share on other sites

అసెంబ్లీ సాక్షిగా మాట మార్చాం, మడమ తిప్పాం : రైతులకు సున్నా వడ్డీ రుణాలు

దేశంలోనే ఎక్కడా లేని విధంగా, మొట్టమొదటిసారి వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు అంటూ రైతులను మోసం చెయ్యబోయి సున్నా అయ్యారు YS Jagan Mohan Reddy గారు. ' Nara Chandrababu Naidu గారి హయాంలో మేమిచ్చాం' అని తెదేపా అంటే.. 'ఇవ్వలేదని రుజువుచేస్తే రాజీనామా చేస్తారా?' అని చంద్రబాబుగారితో ఛాలెంజ్ చేశారు. ఆధారాలతో సహా చంద్రబాబుగారు సిద్ధమయ్యేసరికి సభను వాయిదా వేసి పారిపోయారు.

2013-14 నుంచి 2018-19 వరకు పావలా వడ్డీ కింద రూ.25.14 కోట్లు, సున్నా వడ్డీ కింద రూ.979.45కోట్లు తెదేపా ఇచ్చిందని, 2017-18కు సంబంధించి రూ.507కోట్లు పెండింగ్ ఉండగా 2018-19 కు సంబంధించి ఇంకా క్లెయిమ్స్ రాలేదని చంద్రబాబుగారు రుజువు చేసేసరికి.. మరుసటి రోజు ''అబ్బే! తెదేపా రూ.630 కోట్లే ఇచ్చింది. అదేమంత గొప్పా?'' అని మాట మార్చారు జగన్ గారు.

ఇంత రచ్చాచేసి... వడ్డీలేని రుణాల కోసం రూ.3,500 కోట్లు కేటాయిస్తామని తన తండ్రి పుట్టినరోజును రైతు దినోత్సవంగా జరుపుకున్న సందర్భంగా... కడపలో చెప్పిన పెద్దమనిషి, తీరా బడ్జెట్‌లో ఈ పథకానికి కేవలం రూ.100 కోట్లు కేటాయించారు.

జగన్ గారి మాట మార్చడం, మడమ తిప్పడం ఈ రకంగా ఉంటుందన్న మాట.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...