Jump to content

Careful when buying


AndhraneedSCS

Recommended Posts

  • 30 ఏళ్లుగా సాగులో ఉన్న పొలం కోసం..
  • సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన
గడివేముల, ఆగస్టు 8: కర్నూలు జిల్లా గడివేముల తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్డీవో ఎదుట గురువారం ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి వివరాల మేరకు.. గడివేములకు చెందిన చిన్న జమాల్‌బాషాకు కొరపోలూరు గ్రామంలో 287/1బి సర్వే నంబర్‌లో 3 ఎకరాల పొలం ఉంది. ఈ పొలాన్ని 30ఏళ్ల క్రితమే బాకీ తీర్చే నిమిత్తం అదే గ్రామానికి చెందిన సుబ్బారెడ్డికి పెద్దమనుషుల సమక్షంలో ఇచ్చేశాడు. సుబ్బారెడ్డి ఆ పొలాన్ని పిలకలగూడురుకు చెందిన పెద్దసుబ్బరాయుడుకు 1990లో విక్రయించాడు. పెద్ద సుబ్బరాయుడు తమ ఆస్తి పంపకాల్లో భాగంగా ఆ పొలాన్ని తన సోదరులైన ఈశ్వరయ్య, వెంకటసుబ్బయ్య, రామలింగానికి పంచి ఇచ్చాడు. అప్పటి నుంచి వీరు 30 ఏళ్లుగా ఈ పొలం సాగు చేసుకుంటున్నారు.
 
ఈ నేపథ్యంలో.. ఈ పొలం తమదేనంటూ చిన్న జమాల్‌బాషా కుమారుడు 2016లో కొరపొలూరు వీఆర్వో ప్రభాకర్‌తో కలిసి ఆన్‌లైన్‌లో ఉన్న ముగ్గురు రైతుల పేర్లను తొలగించారు. సమస్య కోర్టుకెక్కింది. నేటికీ పరిష్కారం కాలేదు. మరోవైపు ఈ సీజన్‌లో సాగు చేసిన మిరప పంటను చిన్న జమాల్‌బాషా కుమారులు బుధవారం తొలగించారని బాధితులు వాపోయారు. ఈశ్వరయ్య కుమారుడు దినేష్‌, వెంకటసుబ్బయ్య కుమారుడు యుగంధర్‌, రామలింగం గురువారం ఉదయం తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన నంద్యాల ఆర్డీవో రామకృష్ణారెడ్డిని కలిసి సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో దినేష్‌ ఆర్డీవో ఎదుటే పురుగుల మందు తాగాడు. అధికారులు అతడిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
 
నోటీసులు ఇచ్చి విచారిస్తాం
287/1బి సర్వే నంబర్‌ భూమి బాధితుల అనుభవంలో ఉన్నది వాస్తవమే అయినా, కోర్టుకు వీరికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. బాధితులకు పొలం విక్రయించిన రైతుకూ ఎలాంటి లింకు డాక్యుమెంట్లు లేవు. బాధితుల అనుభవంలో ఉన్నందున ఆర్‌వోఆర్‌ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తాం.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...