Jump to content

Mouth cancer on rise


kakatiya

Recommended Posts

యువతను నమిలేస్తున్నాయ్‌!

గుట్కా, పాన్‌ మసాలాలతో పెరిగిన నోటి, గొంతు క్యాన్సర్‌ కేసులు
ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రికి రికార్డు స్థాయిలో రోగులు
30-40 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువ శాతం
పసలేని చట్టంతో విచ్చలవిడిగా విక్రయాలు
ఈనాడు - హైదరాబాద్‌

యువతను నమిలేస్తున్నాయ్‌!

నోరు... గొంతు... అన్నవాహిక క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక జబ్బులకు గుట్కాలు ప్రధాన కారణమని అందరికీ తెలుసు. వైద్యులూ ఘోషిస్తున్నారు. థియేటర్‌కు వెళ్తే సినిమా ప్రారంభానికి ముందు పొగాకు దుష్ఫలితాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. పెద్దగా ఫలితం కనిపించడం లేదు. తాజాగా అనుభవంలోకి వస్తున్న విషయం యువత కూడా ఈ విష వలయంలో చిక్కుకొని విలవిల్లాడుతోందని. చైతన్య కార్యక్రమాలతో మున్ముందు మార్పు సాధించవచ్చేమో కానీ ప్రస్తుతానికి మాత్రం పరిస్థితులు నిరాశాజనకం. ఆరోగ్యాన్ని హరిస్తున్న పొగాకు ఉత్పత్తులను మార్కెట్‌లో లేకుండా చేయడం మరో మార్గం. చట్టం కూడా ఉంది. ఈ సందేహాన్నే పోలీసు వర్గాల ముందుంచితే.. వచ్చిన సమాధానం ‘అందులో ఏమాత్రం పస లేదండి’ అని. ఉత్పత్తి, రవాణా కేంద్రాలుగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, బిహార్‌, మధ్యప్రదేశ్‌లు చట్టాన్ని పూర్తిగా గాలికొదిలేయడంతో మూలాల్లోకి వెళ్లలేకపోతున్నామనే అభిప్రాయాన్నీ వ్యక్తీకరించారు.

2017-18లో హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆసుపత్రికి 4,635 మంది క్యాన్సర్‌  బాధితులు రాగా వారిలో నోరు, గొంతు క్యాన్సర్‌ రోగులు 1,104 మంది, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితులు 652 మంది.

పొగాకు దుష్ఫలితాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రి ఎంఎన్‌జేలో నమోదవుతున్న గణాంకాల్లో ఇది ప్రస్ఫుతమవుతోంది. గతంలో ఎక్కువ శాతం గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్లతో వచ్చేవారు. ఇప్పుడు నోటి క్యాన్సర్లు వాటికంటే ఎక్కువవుతున్నాయి. 60 శాతం మంది వ్యాధి 3, 4 దశల్లో ఉన్నప్పుడు సంప్రదిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. బాధితుల్లో యువత అధికంగా ఉండటం ఆందోళన  కలిగిస్తోంది. ఇందులో అటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం నుంచి తెలంగాణలో ఆదిలాబాద్‌ వరకు అన్ని ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు.

యువతను నమిలేస్తున్నాయ్‌!

నిషేధించిన పొగాకు ఉత్పత్తులు ఎక్కడ కావాలంటే అక్కడే
చాలా పాన్‌ షాపుల్లో నిషేధించిన పొగాకు ఉత్పత్తులు బహిరంగంగా వేలాడదీసి కనిపిస్తున్నాయి. మరికొందరు  పైన కిళ్లీలు.. కింద గుట్కాలు ఉంచి కొంచెం గుట్టుగా వ్యాపారం చేస్తున్నారు. వివిధ విద్యా సంస్థల వద్ద షాపుల్లో కూడా ఇవి విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. చిన్నచిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. వీటి మత్తుకు చిన్న వయస్సులోనే ఎంతోమంది బానిసలుగా మారుతున్నారు. గతంలో డీసీఎంల్లో తరలిస్తున్న గుట్కా బస్తాలను హైదరాబాద్‌లో పోలీసులు స్వాధీనం చేసుకోగా అవి కర్ణాటకలోని గుల్బర్గ తయారీ కేంద్రం నుంచి తరలిస్తున్నట్లు తేలింది. లారీలు, డీసీఎంల్లో తరలించి రాజేంద్రనగర్‌, బండ్లగూడల్లో డంపు చేసి నగరంతో పాటు తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాలకు సరఫరా  చేస్తున్నట్లు గుర్తించారు. 20 గుట్కా ప్యాకెట్లను    రూ.90కి కొనుగోలు చేసి రిటైల్‌గా రూ.300-400 వరకు విక్రయిస్తున్నారు.

యువతను నమిలేస్తున్నాయ్‌!

కొన్నాళ్లు నమిలి మానేసినా వ్యాధి వచ్చే అవకాశం
అల్పాదాయవర్గాలు ఎక్కువగా గుట్కాల వంటి పొగాకు ఉత్పత్తుల బారిన పడుతున్నారు. తొలుత సరదాగా అలవాటు చేసుకొని బానిసలుగా మారుతున్నారు. నోట్లో వేసుకోవడం వల్ల కొద్ది సేపటికి మత్తులోకి జారుకుంటారు. అది మెదడును ఉత్సాహపరిచిన భావన కలిగిస్తుంది. అది కొద్ది సమయమే. మళ్లీ గుట్కా నమలాలనే కోరిక పుడుతుంది. లక్షణాలు ఆరంభమైన ఆరు నెలల నుంచి రెండేళ్లలోపు నోటి, గొంతు క్యాన్సర్లుగా రూపాంతరం చెందుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నాళ్లు నమిలిన తర్వాత మానేసినా వ్యాధి వచ్చే అవకాశం ఉందని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

యువతను నమిలేస్తున్నాయ్‌!

చట్టం అత్యంత బలహీనం..
వందప్యాకెట్ల గుట్కాను పట్టుకున్నా...  వెయ్యి కిలోల గుట్కా తయారీదారుడిని పట్టుకున్నా కోర్టులో హాజరుపరిచాక నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఇది కూడా గరిష్ఠం. దీంతో కొందరు వ్యాపారులు జైలుకు వెళ్లిన 48 గంటల్లోపే బెయిల్‌పై బయటకు వస్తున్నారు. మళ్లీ, మళ్లీ గుట్కాను తయారు చేస్తున్నారు.. విక్రయిస్తున్నారు.

యువతను నమిలేస్తున్నాయ్‌!

Link to comment
Share on other sites

11 minutes ago, sattipandu said:

eee guthka thiney vallaki idi kaavaalsindeyyy

Emo bro neighbour’s son died due to this. He had a wife and a small kid. It devastated the family tbh. 

Link to comment
Share on other sites

24 minutes ago, jobseeker1 said:

Vaalla kosam kaakapoina cleanliness kosam aina van cheyyali ivi.... lavada gaallu ekkada padithe akkada unchi kampu leputhaaru 

Banned eppudo okka rupayi di 2 ruppayalaki konukuntunnaru janam.. Janaalu atta unte vaallaki poyedemundi. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...