Jump to content

Read for inspiration


Athadu007

Recommended Posts

ఎప్పుడు సంపద కరిగిన అప్పుడు ....   

  మా అమ్మ నాన్న ఇద్దరు ప్రభుత్వ పాఠశాల టీచర్స్ . నేను సంపద లో పెరగక పోయినా లోటు అనేది ఎప్పుడూ చవి చూడ లేదు . మా అమ్మ నాన్న తాము పని చేస్తున్న పాఠశాలకు సమీప గ్రామంలో నివసించేవారు . దీనితో పెద్దగా ఖర్చు అయ్యేది కాదు . ఎప్పుడూ మా నాన్న    చేతిలో ఎంతో కొంత డబ్బు ఉండేది . మా నాన్న సినిమాలలో గుమ్మడి లాంటివాడు . అవతలి వారిని సులభంగా నమ్మేసేవాడు . ఎప్పడూ ఎవరో వచ్చేవారు . " అయ్యెరా!.. కూతురి పెళ్లి పెట్టుకున్నా!.. బావి తవ్వాలి! .. " ఇలా ఏదో చెప్పి మా నాన్న దగ్గర డబ్బు అప్పుకు తీసుకొనే వారు . అందులో ఎగొట్టిన వాళ్ళు కొంత మంది . చాలా కాలం తరువాత, అసలు మాత్రం ఇచ్చేవారు కొంతమంది . మహా అంటే రూపాయి ధర్మ వడ్డీ ఇచ్చిన వారు, అతి తక్కువ మంది . మా అమ్మ" ఇలా అడిగిన    వారికి  అప్పులు ఇవ్వొద్దు"    అని  చెప్పేది . మా నాన్న అప్పుడు" సరే "  అనేవాడు . కానీ ఎవరైనా వచ్చి తమ బాధలు చెప్పుకొంటే ఆయన గుండె కరిగి పొయ్యేది . వెంటనే డబ్బు ఇచ్చే వాడు . ఇదే విషయమై మా అమ్మ నాన్న కు మధ్య చాలా సార్లు తగువు వచ్చేది . 

నేను కాస్త పెరిగి యుక్త వయస్సు కు వచ్చాక " నాన్న ! ఇలా అడిగిన వారందరికీ అప్పులిచ్చి మనః శాంతి     పోగొట్టుకోవడం అవసరమా ? అంత్య నిష్ఠురం కన్నా ఆది   నిష్టురం మేలు కదా ! నేను అప్పులు ఇవ్వను . నేను వడ్డీ వ్యాపారం  చెయ్యడం లేదు అని ఖరాకండిగా చెప్పేయ్ . డబ్బుతో బెంగళూరు లాంటి చోట ప్లాట్స్ కొనొచ్చుగా . మన బంధువులు ఎంతో మంది బెంగళూరు లో ప్లాట్స్ కొని లాభ పడుతున్నారు " అని చెప్పా . దానికి మా నాన్న " రేయ్ ! నేను సంపాదించింది .. నేను నా ఇష్ట       ప్రకారం చేస్తాను . ఏదైనా చెయ్యాలంటే నువ్వు సంపాదించి చేసుకో " అన్నారు . ఇదే మాట కనీసం పది సార్లు వివిధ సందర్భాల్లో అయన అన్నారు . 

పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని సివిల్స్ కోచింగ్ కోసం 19  ఏళ్ళ వయసులో నేను హైదరాబాద్ కు వచ్చాను .{ మా అమ్మ నాన్న టీచర్స్ కావడం తో నేను స్కూల్ లోనే పెరిగాను . నా వయస్సు తో పోలిస్తే మూడు క్లాస్ లు ముందు  వున్నాను . 12  ఏళ్లకే పదవ తరగతి 19  ఏళ్లకే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను . గమనించగలరు }   అటు పైన యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో ఎం. ఫిల్ లో చేరాను . ఫెలోషిప్ వచ్చింది . ఇక అప్పటి  నుండి మా నాన్న దగ్గర డబ్బు తీసుకోవడం ఆపేసాను . రావు స్ కోచింగ్ ఫీజు కోసం తీసుకొన్నదే బహుశా మా నాన్న దగ్గర నేను తీసుకొన్న చివరి పైసలు . అంటే 19  ఏళ్లకే ఆర్థిక స్వాతంత్య్రం సాధించా . అటు పై రైల్వేస్ లో జాబ్ వచ్చింది . అప్పుడే ఘట్కేసర్ దగ్గర ఒక ప్లాట్ కొన్నాను . నేను సివిల్స్ రాస్తుండడం తో సంవత్సరం లో ఆరు నెలలు లీవ్ లో ఉండేవాడిని . దానితో డబ్బు పెద్దగా మిగిలేది కాదు . 

 అటు పైన సివిల్స్ కోచింగ్ ప్రారంభించా . ఒక సంవత్సరం దాటడం తో అనేక కోచింగ్ సంస్థ ల లో సివిల్స్ కోచింగ్ ఇచ్చే అవకాశం వచ్చింది . ఒక సంవత్సరం లోనే రెండు లక్షల దాకా సంపాదించా. సికింద్రాబాద్ లో రాష్ట్రపతి రోడ్ లోని కెనరా బ్యాంకు లో నా అకౌంట్ ఉండేది . తోలి సారి రెండు లక్షల బాలన్స్ జీవితం లో చూసా . మరుసటి  సంవవత్సరానికి అమీర్పేట్ లో ఫ్లాట్ కొన్నాను . దీని కోసం LIC  హోసింగ్ లోన్ కూడా తీసుకొన్నా. 
నేను సంపాదించిన  డబ్బు తోనే కోచింగ్ సంస్థ లో ముందుగా పార్టనర్ అయ్యా . అటు పైన మిగతా మిత్రులు మరో రంగం కు వెళ్లి పోవడం తో వారి వాటా కొని డైరెక్టర్ అయ్యా . 
 మా నాన్న అనుభవంనుంచి నేను  గ్రహించిన    పాఠం " అప్పులు ఇవ్వకూడదు . PRIVATE  వ్యక్తులనుంచి అప్పు తీసుకోకూడదు " . అప్పటి నుంచి ఇప్పటి దాకా దీన్ని కచ్చితం గా పాటిస్తున్నా. 

2000  సంవత్సరం . గ్రూప్ -2  కోచింగ్ ఉదృతంగా నడుస్తోంది . బ్యాచ్ ప్రారంభించిన రోజే ఫుల్ అయి పోతోంది . ఫిబ్రవరి 2000 . బ్యాంకు లో 24  లక్షలు వున్నాయి . ఇంకా కనీసం ఆరు బ్యాచ్ ల దాక పడే అవకాశం వుంది . లెక్చరర్స్ Payments  ఇంకా పెండింగ్ వున్నాయి . అలాగే నోట్స్ ప్రింటింగ్ లాంటి ఖర్చులు కూడా .  
 " ఈ ఖర్చులను రాబోతున్న బ్యాచ్ ల  ఆదాయం నుండి చెల్లించ వచ్చు" అనే ఆలోచన తో కూకట్పల్లి వివేకానందనగర్ లో ప్లాట్ కొన్నా. అది కొన్న వేళా విశేషమో ఏమో తెలియదు కానీ అప్పుడే ఇచ్చిన నోటిఫికెషన్స్ నుంచి 126  పోస్ట్ లను ప్రభుత్వం వెనక్కు తీసుకొంది. ఎక్కడైనా పోస్ట్ లు కలుపుతారు . కానీ ఇలా తీసుకోవడం   ఎప్పుడూ   జరగలేదు . దీనితో కొత్తగా ADMISSIONS  రావడం దేవుడెరుగు . అడ్మిషన్ తీసికొని ఇంకా ఫీజు కట్టని వారు రావడం ఆపేసారు . 

 దాదాపు 8  లక్షల దాకా PAYMENTS ఇవ్వాల్సి వుంది . చేతిలో చిల్లి గవ్వ లేదు . మా శ్రీమతి నగలు...  అది చాలక వాళ్ళ పిన్ని నగలు { అప్పుడు వారు అమెరికా కు వెళుతూ మా దగ్గర నగలు పెట్టారు } బ్యాంకు లో తాకట్టు పెట్టా. చాల మటుకు అప్పులు తీర్చేసా . ఇంకా కొంచెం వుంది . ఇంకేదైనా బ్యాచ్ లు పడితే తీర్చేస్తా అని మిగతా వారికీ చెప్పా . నా జీవితం లో దారిద్య్రాన్ని చవి చూసిన ఒకే సందర్భం అది . మార్చ్ 2000  నుంచి జనవరి 2001  వరకు అత్యంత దారిద్య్రాన్ని అనుభవించా. ఆదివారం కదా చికెన్ చెయ్యి అని మా ఆవిడ  ను అడిగితె చిల్లర పోగు చేసి లెక్క చూసి డబ్బు లేదని గ్రహించి" ఆబ్బె ఈ రోజు చికెన్ వద్దు . వండే ఓపిక నాకు లేదు" అనేది . మా   నాన్న నో మరొకరినో డబ్బు అడగడం నాకు ఇష్టం లేదు . అప్పటిదాకా" మీ సంస్థ లో మాకు కోచింగ్ అవకాశం ఇస్తే అదే పది వేలు" అని మాట్లాడిన లెక్చర్లు తీరు    మారింది . రెండు లక్షలు ఇవ్వాల్సిన లెక్చరర్ కు  లక్ష ఎనభై వేలు ఇచ్చి మిగతా ఇరవై వేల    కోసం కొన్ని వారాలు ఆగాలి అని చెప్పినా ఆగడం లేదు . రెండు రోజులకు ఒక    సారి  ఫోన్ చెయ్యడం .... నిష్టురంగా మాట్లాడడం . RTC  SUPERVISOR  నోటిఫికేషన్ వచ్చింది . నేనొక్కడే దానికి కోచింగ్ ఇచ్చా. చాల మటుకు అప్పులు తీర్చేసా . ఇక పది వేలు మాత్రం మిగిలింది . సికింద్రాబాద్ లో దేవి బుక్ డిపో అని ఉండేది . అతని దగ్గర స్టేషనరీ తీసుకొన్నాం . దాదాపు మూడు లక్షలు చెల్లించేసాం . డిసెంబర్ 31  2001 . నేనే వాడికి ఫోన్ చేశా . కేవలం పది వేలు మాత్రం మిగిలింది . ఈ సంవత్సరం    అంతా దరిద్రం లో బతికా . కనీసం కొత్త సంవత్సరం అయినా బాగుండాలి అని ఆశిస్తున్నా . మీరు ఫోన్ చెయ్యొద్దు . నేనే ఇచ్చేస్తా అని చెప్పా . వాడు కావాలనే జనవరి మొదటి తేదీ పొద్దునే ఫోన్ చేసి నా డబ్బు నాకు ఇచ్చేసి కొత్త సంవత్సరం జరుపోకో అన్నాడు . చెత్త నా ...  ఛీ .. ఇంత  ఘోరంగా   వుంటారా మనుషులు . చెరువు ఎండి పొతే కప్పలు వెళ్లి పోతాయేమో కానీ ఇక్కడ వెదవలు చెరువులో మూత్రం పోసి పోతున్నారు . నా బతుకెందుకు ??  జనవరి ఒకటవ తారీకే అప్పులాడి ఫోన్ ! నిజానికి వాడు నాకు అప్పు ఇచ్చిన వాడు కాడు. నేను వాడి కస్టమర్ . పేమెంట్ ఆలస్యం అయితే ఓపిక    పట్టలేడా.?ఇక చాలు !!   

       వివేకానంద నగర్ లో ఏ  నిమషం ప్లాట్ కొన్నానో దరిద్రం కావులించుకొంది. దీన్ని వొదిలించుకోవాలి. వెంటనే అమ్మేయాలి . వెంటనే ఎవరి దగ్గర కొన్నానో అయన కే 
 ఫోన్ చేశా .  ఒక పార్టీ  READY గా   ఉందని చెప్పారు . భోగి పండుగ నాడు రిజిస్ట్రేషన్ . బ్యాంకు లోన్ ముఖ్యంగా బుక్ డిపో రాక్షసుడి అప్పు తీర్చేసా . దరిద్రం వదిలింది . 

ఇప్పుడు చేతిలో డబ్బు వుంది . ఏమి చెయ్యాలి . ఎప్పటి నుంచో స్కూల్ ప్రారంభించాలనే ఆలోచన . మార్చ్ 2001 కి స్లేట్ స్కూల్ స్వప్నం సాకారం అయ్యింది . అంత మన మంచికే . ఆ బుక్ డిపో రాక్షసుడు జనవరి ఒకటవ తారీకు ఫోన్ చేసి ఆలా మాట్లాడకుండా ఉంటే బహుశా స్లేట్ కలగానే మిగిలి పోయి ఉండేది .
Credit: principle 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...