Jump to content

అయ్యో.. అమరావతి


snoww

Recommended Posts

అయ్యో.. అమరావతి
12-08-2019 02:57:25
 
 
637011754476725540.jpg
ఆంధ్రుల సొంత రాజధాని కలకు దాదాపు 70 ఏళ్లు. ఐదేళ్ల క్రితమే ఆ కల సాకారం కావడం మొదలయింది. అది నిండుగా ఆకారం దాల్చిన ప్రాంతం తుళ్లూరు. అలాంటి తుళ్లూరు ఇప్పుడు ఏ తీరులో ఉంది?.. బంగారం ఇంటికి తెచ్చిన భూములు, నూత్న ఆర్థిక శక్తిని రాష్ట్రానికి అందించిన వ్యాపారాలు, రియల్‌ ఎస్టేట్‌ పరుగులు.. ఇప్పుడు అడుగుల్లోకి మారాయెందుకని? రాజధాని ప్రకటన తో తుళ్లిపడిన ఈ ప్రాంతంలో ఎందుకని ఇప్పుడు బతుకు బళ్లు కూలుతున్నాయి? చీమలబారుల్లా సాగిన శ్రమజీవుల కదలికలతో కళకళలాడిన వీధులు, బజార్లు సడి మరిచాయెందుకు?
తుళ్లూరు గతి... తాజా స్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
  • నిర్మాణాల నిలిపివేతతో బతుకు బళ్ల్లు వలసబాట
  • రాజధాని ప్రకటనతో తుళ్లూరుకు తుళ్లింత
  • రైతు బాగుపడటంతో ప్రతిరంగం వృద్ధిలోకి
  • బ్యాంకులు, హోటళ్లు కిటకిట.. దారులన్నీ రద్దీ
  • ఇప్పుడవన్నీ వెలవెల.. పలు హోటళ్లు మూత
  • సడిలేని బ్యాంకులు.. చిన్న వ్యాపారులు కుదేలు
  • బయటివారి కోసమని కట్టిన ఇళ్లన్నీ ఖాళీగా
  • వ్యాపారాల్లోకి మారిన రైతులు సంకటంలో
  • కౌలుడబ్బూ జమకాక చిన్న రైతుల్లో దిగులు
  • 30 వేల మంది కూలీల్లో మిగిలింది ఏడు వేలే
ఒక ఐడియా జీవితాన్ని మార్చినట్టు.. రాజధానిగా అమరావతి ప్రకటన తుళ్లూరు చరిత్రనే మార్చివేసింది. తుళ్లూరు గ్రామంలో ఐదేళ్ల క్రితం పది బ్యాంకు శాఖలు వెలిశాయి. రాజధాని తెచ్చిన బూమ్‌తో కోటి నుంచి కోటిన్నర వరకు ఎకరం ధర పలికింది. ఈ మొత్తంపై ఆదాయ పన్ను మినహాయించి, వారి ఆర్థిక ఎదుగుదలకు గత ప్రభుత్వం కూడా సహకరించింది. అలా మిగుల్లో పడిన రైతులు.. ఆ డబ్బునంతా బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం మొదలుపెట్టారు. వారి సంఖ్య బాగా ఎక్కువ కావడంతో ఒకదాని వెంట ఒకటిగా బ్యాంకులు తమ శాఖలను తెరిచాయి. చేతినిండా డబ్బులు ఆడుతుండటంతో, కొంతమంది పాత ఇళ్లు కూల్చేసి కొత్త ఇళ్లు నిర్మించుకొన్నారు. ఇలాంటివారు ఇంటి రుణాలను తీసుకోడానికి బ్యాంకు వద్ద బారులు తీరేవారు. వాహన సంస్కృతి బాగా పెరగడంతో కార్లు, బైకులు కొనేందుకు వాహన రుణాల కోసం బ్యాంకులకు రావడం పెరిగింది. ఒక్క తుళ్లూరే కాదు, రాజధాని ప్రభావంలో ఉన్న మరికొన్ని గ్రామాల్లోనూ బ్యాంకులు వెలిశాయి. అవి ఉన్న వీధులు వింత సందడిని నింపుకొనేవి. ఇప్పుడు ఆ సందడంతా ఏమయిపోయిందో తెలియని పరిస్థితి! బ్యాంకులకు ఖాతాదారుల తాకిడి తగ్గింది. కొత్త డిపాజిట్లు రాకపోగా పాత డిపాజిట్లు కూడా తరిగిపోయే పరిస్ధితి నెలకొంది. బ్యాంకులతో పాటు ఎటీఎంలు కూడా అప్పట్లో భారీగా ఏర్పాటయ్యాయి. ఇప్పుడు అవి ఏకంగా మూతపడే స్థితికి వచ్చాయి.
 
రాళ్లెత్తిన కూలీలేరి?
రాజధాని గ్రామాల్లో పలు చోట్ల నిర్మిస్తున్న భవనాల వద్ద కార్మికుల కోలాహలం ఆ ప్రాంతానికి నిండుతనం తెచ్చేది. వారికోసం బడ్డీకొట్లు, తోపుడుబండ్లు, బంకులు తరలిరావడంతో ఈ కోలాహలం.. వందలమంది కడుపులు నింపే స్థితికి చేరింది. ఇంతమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బతుకు వనరుగా మారిన రాజధాని నిర్మాణ పనులు క్రమక్రమంగా తగ్గిపోవడం, బడుగుజీవులకు మిగిలిన ఒక్క భరోసానూ లాగేస్తోంది. నిర్మాణ ప్రక్రియ జరుగుతున్న ఎన్‌జీవో, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌, ఐపీఎస్‌, జడ్జీల బంగ్లాలు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయాయి. వాటి మీదే ఆధారపడిన కూలీలు పనులు వెతుక్కొంటూ వేరే ప్రాంతాలకు వలసపోవడం పెరిగింది. ఆ ప్రభావం ఇక్కడి చిన్న వ్యాపారులపై పడి, వారిని కోలులేనంతగా దెబ్బతీసింది.ప్రస్తుతం 80శాతంకు పైగా పూర్తయిన పనులు మాత్రమే సాగుతున్నాయి. ఆ పనుల కోసమని కొద్ది మంది కూలీలు మాత్రమే ఈప్రాంతాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. ఒకనాడు మహాసౌధాల నిర్మాణానికి చీమలబారుల్లా కదిలిన 30వేలమంది కూలీల్లో ఇప్పుడు కేవలం ఆరేడు వేలమందే మిగిలారు. తక్కినవారంతా మూటాముల్లె సర్దుకొని తరలిపోయారు.
 
ఘుమఘుమలు గాయబ్‌
రాజధాని పనుల కోసం దేశమంతటి నుంచి కూలీలు కదిలొచ్చారు. మలయాళీలు, పంజాబీలు, బిహారీలు, ఛత్తీ్‌సగఢ్‌ కుర్రాళ్లు తుళ్లూరు వీధుల్లో తిరుగుతుండేవారు. రాజధానికి తమ వంతు సేవలు, సాయం అందించడానికి ముందుకొచ్చిన ఎన్‌ఆర్‌ఐలు, విదేశీ కన్సల్టెన్సీ ప్రతినిధులతో మరింత భిన్నత్వం సంతరించుకొంది. వీరందరి ఆహార అవసరాలు తీర్చేలా తుళ్లూరులో ఘుమఘుమలాడే భోజనశాలలు వెలిశాయి. విభిన్న రుచులు పంచుతూ, అనతికాలంలోనే స్టార్‌ హోటల్‌ స్థాయిని అవి అందుకొన్నాయి. రెండు నెలలుగా మాత్రం స్థానికులు తప్ప బయటినుంచి ఈ హాటళ్లకు వచ్చేవారు తగ్గిపోయారు. మంచి లాభాలు చవిచూసిన హోటల్‌ యజమానులు ఇప్పుడు తాము ఖర్చుపెట్టే ప్రతి రూపాయీ తిరిగి వస్తుందా అనే దిగులుతో కనిపిస్తున్నారు.
రెంటికీ చెడ్డ రేవడిగా.. కొందరు రైతులు జనం తాకిడిని ఆసరగా చేసుకొని తుళ్లూరులో చిన్న, పెద్ద వ్యాపారాలను ప్రారంభించారు. మరికొందరు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు, వ్యాపారులుగా మారారు. రైతు కూలీలుగా వ్యవహరించిన వారు అక్కడ కోకొల్లలుగా ఏర్పడిన హోటళ్ళు, బంకులు, షోరూమ్‌లతో పాటు భవన నిర్మాణ కార్మికులుగా మారిపోయారు.
 
ఒక్కసారిగా నేల పైకి పడ్డట్టుగా
నాలుగు నెలల క్రితం దాకా తుళ్లూరులో కోటి నుంచి కోటిన్నర ఎకరం ధర పలికింది. ఎకరం ఉన్న రైతు కూడా రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. జాగ్రత్తపడేవారు కలిసొచ్చిన కలిమిని పెంచే బాటలో అడుగులు వేశారు. జీవితంలో ఏ సుఖం అప్పటిదాకా యెరుగనివారిలో కొందరు మాత్రం కలలో కూడా ఊహించని విధంగా ఖరీదైన కా ర్లు కొనుక్కోవడం, విల్లాలు వంటి భవనాలు నిర్మించుకోవడం, కుటుంబాలతో విమానంలో విహార యాత్రలు చేయడం వంటి కోర్కెలు తీర్చుకోవడం మొదలుపెట్టారు. అంతకు మందు కౌలు కింద రైతులకు రూ.15వేలకు మించి మెట్ట భూములపై వచ్చేది కాదు. భూ సమీకరణ పుణ్యామా అని ముందస్తుగానే ఏడాదికి 30వేలు కౌలు బ్యాంకు ఖాతాలో జమయ్యేది. ఈ ఏడాది ఇంకా కౌలు రైతు ఖాతాలో జమకాలేదు.
 
వాహనాల చప్పుడు మాయం
చురుగ్గా జరుగుతున్న నిర్మాణ పనులను తిలకించేందుకు వాహనాలపై తరలివచ్చే సందర్శకుల తాకిడి కొన్ని నెలల క్రితం దాకా నిత్యం ఉండేది. వారికోసమని భారీ స్థాయిలో పెట్రోల్‌ , డీజిల్‌ బంకులు కూడా వెలిశాయి. రాజధాని నిర్మాణ పనులకు వినియోగించే లారీలు, ట్రాక్టర్లతో డీజిల్‌ బంకులు కిటకిటలాడేవి. ఒకటి, రెండు నెలలుగా కొత్తవారు ఎవరూ ఈ ప్రాంతానికి రావడం లేదు. తుళ్లూరుకు బయటి తాకిడి తగ్గిపోయింది. ఒకనాడు పెట్రోల్‌బంకుల వద్ద బారులు తీరే వాహనాల చప్పుళ్లు ఇప్పుడు వినిపించడం లేదు. పెట్రోల్‌ బంకులు రోజంతా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.
 
 కౌలు పోతే బతికేదెలా?
‘‘నాకు సీలింగ్‌ కింద గతంలో ప్రభుత్వం 28 సెంట్లు కేటాయించింది. దానికిగాను ఎకరం కౌలు సొమ్మును సీఆర్డీఏ వారు జమ చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు వచ్చినా ఇంకా జమ కాలేదు. కుటుంబాన్ని నెట్టుకు రావాలంటే ఇబ్బందిగా ఉంది. మా బోటి సన్నకారు రైతులు కౌలు మీదే ఆధారపడ్డాం. ఇప్పుడు ఆ ఆధారం మిగిలేలా కనిపించడం లేదు.
- ధరావత్‌ సాంబయ్య నాయక్‌, తుళ్లూరు
మా ప్లాట్లకు ధరలు లేవు
‘‘రాజధాని నిర్మాణం కోసం భూమి త్యాగం చేశాం. దానికిగాను ఎకరం కౌలు నేను ఇచ్చిన 48 సెంటుకు వచ్చేది. రాజధాని నిర్మాణ పనులు కొనసాగక పోవటంతో మాకిచ్చిన ప్లాట్ల ధరలు తగ్గి పోతున్నాయి. ఆ ప్లాట్లే మాకు బతుకు వనరు. భూమిని త్యాగం చేసిన మమ్మల్ని ఈ ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుతున్నాం
- ధనేకుల శివనాగేశ్వరావు, తుళ్లూరు
లోడింగ్‌ పనులు ఆగిపోయాయి
‘‘రాజధాని లో పనులు ఆగిపోతుండటంతో ఇసుక లోడిండ్‌ చేసి బతికే నాలాంటి వారికి ఉపాధి లేకుండాపోయింది. ఇసుకపాలసీ ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. అది ఎప్పటికి వస్తుందో తెలియదు. అప్పటిదాకా పనులు లేకపోతే, మేం ఎలా బతకాలి? - తోకల రాజేశ్‌, తుళ్లూరు.
- ఆంధ్రజ్యోతి, గుంటూరు
Link to comment
Share on other sites

5 minutes ago, snoww said:

ABN Boothu kittu gaadu live telecasting now ground report . ABN website lo website soodandi 

Morning walk sesthunna vuncles telling their opinions to ABN

Companies are running away from AP after Jagan came anta. All companies closing offices anta 

Link to comment
Share on other sites

Some how mottam andhra lo amaravathi manadi ane feeling ravadam ledu , unfortunate there are not many govt lands in the region lot of controversies , hope a realistic capital comes soon

Link to comment
Share on other sites

7 hours ago, kothavani said:

Some how mottam andhra lo amaravathi manadi ane feeling ravadam ledu , unfortunate there are not many govt lands in the region lot of controversies , hope a realistic capital comes soon

Nee uddesam emito naku teliyadu kani.. I think common feeling about all parties is that Amaravathi is the capital.

 

Its just that Jagan is not interested in developing it as he thinks its just associated with CBN. 

 

I am just worried about the lack of growth drivers in the state. Used to have 3 when CBN was CM and 3 are distributed across the state (Amaravathi, Vizag, Tirupathi with the exception of Kia Motors in Ananthapoor). We will have to wait and see what will be the new growth drivers.

 

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...