Jump to content

Telangana Secretariat shifted completely!


boeing747

Recommended Posts

3 minutes ago, boeing747 said:

andhrolla kutra ayuntadi

అబ్బో ఇక్కడ ఉండలేం

 

- బీఆర్‌కే భవన్‌ పట్ల మంత్రుల అనాసక్తి 
- తమ శాఖల కార్యాలయాల్లోకి.. 
- తాత్కాలిక సచివాలయంలో పనులు షురూ
- కొద్ది రోజుల పాటు కుందన్‌బాగ్‌ నుంచే సీఎస్‌ విధుల నిర్వహణ 
- ప్రస్తుతానికి సందర్శకులు, విలేకరులకు ''నో'' ఎంట్రీ 
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌ 
రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బూర్గుల రామకృష్ణారావు భవన్‌ (బీఆర్‌కే భవన్‌) పట్ల మంత్రులు అనాసక్తి చూపుతున్నారు. వారికి కేటాయించిన ఛాంబర్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని ఇరుకు గదుల్లో ఉండి పాలన చేయలేమని బాహాటంగానే చెబుతున్నారు. ఒక్క నెల, రెండు నెలలు అంటే సర్దుకుపోవచ్చు గాని, ఏండ్ల తరబడి ఇందులో ఎలా ఉంటామని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. మంత్రులు, అధికారులను కలవడానికి వచ్చే సందర్శకులతో పేషీలు కిటకిటలాడే పరిస్థితి ఉంటుందని మంత్రులు గుర్తు చేస్తున్నారు. ఎంతో విశాలంగా ఉన్న పాత సచివాలయంలోనే సందర్శకులతో సందడిగా ఉండేదని, అలాంటిది స్థల ప్రభావంతో ఇక్కడ మరింత రద్దీ అవుతుందని కొందరు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్‌కే భవన్‌లో మరమ్మత్తులు చేసుకునేందుకు కూడా అవకాశం లేదంటున్నారు. కనీసం వాస్తుపరంగా మార్చుకునే అవకాశం లేకపోవడంతోనే బీఆర్‌కే భవన్‌ పట్ల వారంతా అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. 
శాఖల కార్యాలయాలపై కన్ను 
బీఆర్‌కే భవన్‌ పట్ల అసంతృప్తితో ఉన్న మంత్రులు తమ శాఖల కార్యాలయాల్లో ఛాంబర్లను ఏర్పాటు చే సుకోవాలన్న ఆలోచనలో మంత్రులు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తమ ఛాంబర్లను ఇంజినీర్‌ -ఇన్‌-ఛీప్‌ కార్యాలయాల్లోకి మార్చారు. మిగతా మంత్రులు కూడా బీఆర్‌కే భవన్‌లో ఉన్న పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు వివరించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. దానికి ఆయన ఒప్పుకుంటే తమ శాఖల ను ఆయా శాఖల కమిషనరేట్లు, డిపార్ట్‌మెంట్లు, హెచ్‌ఓడిల భవనాల్లోకి ఛాంబర్లను తరలించే యోచనలో ఉన్నారు. ఇదివరకే కొందరు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన కార్యాలయాలను పరిశీలించినట్టు సమాచారం. అందులోని ఈఎన్‌సీ ఛాంబర్లను ఖాళీ చేయించి అందులో తమ పేషీలను ఏర్పాటు చేసుకునే పనిలో నిమగమైయ్యారు. తాత్కాలిక సచివాలయం తొమ్మిది అంతస్తులు ఉంది. ఎనిమిదో అంతస్తులో సీఎంఓ ముఖ్య కార్యదర్శులు, తొమ్మిదో అంతస్తును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్‌ కోసం కేటాయించారు. మిగతా ఏడంతస్తులో మంత్రుల పేషీలు, ఆయా శాఖల కార్యాలయాలు, ఉన్నాయి. దాంతో బీఆర్‌కే భవన్‌లో పూర్తిగా స్థల ప్రభావం ఏర్పడింది. దీనివల్ల తమ కోసం వచ్చే సందర్శకులకు ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలో మంత్రులు ఉన్నారు. 
క్వార్టర్స్‌ నుంచే బాధ్యతలు 
తాత్కాలిక సచివాలయం గత శుక్రవారం నుంచి కార్యాకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి బీఆర్‌కే భవన్‌ నుంచే బాధ్యతలు నిర్వహించారు. ఆయా శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు ఆధర్‌ సిన్హా, బుర్రావెంకటేశం, బీఆర్‌ మీనా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి పూర్తి స్థాయి కార్యాకలాపాలు బీఆర్‌కే భవన్‌ నుంచే కొనసాగునున్నాయి. 
అయితే కొద్ది రోజుల పాటు సీఎస్‌ కుందన్‌బాగ్‌లోని క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తారు. ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా తాత్కాలిక సచివాలయానికి వచ్చినా బాధ్యతలు నిర్వహించలేదు. కొద్ది రోజుల పాటు మంత్రుల నివాస భవనాల నుంచే బాధ్యతలు నిర్వహించాలని భావిస్తున్నారు. బీఆర్‌కే భవన్‌కు వెళ్లడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 
అనుమతించం.. సీఎస్‌ ఆర్డర్‌ 
తాత్కాలిక సచివాలయంలోకి సందర్శకులు, విలేకరులను అక్కడి భద్రతా సిబ్బంది అనుమతించడం లేదు. కొద్ది రోజుల పాటు ఎవరినీ అనుమతించొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారని భద్రతా సిబ్బంది అధికారి ఒకరు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల కొద్ది నెలల పాటు ప్రజలకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...