Jump to content

కోకాపేట


snoww

Recommended Posts

మళ్లీ విక్రయం దిశగా హెచ్‌ఎండీఏ కార్యాచరణ 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వానికి ‘కోకాపేట’రూపంలో భారీ బొనాంజా దక్కనుంది. ఇప్పటికే ఈ దిశగా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కోకాపేట లే–అవుట్‌ చేయడాన్ని ముమ్మరం చేసింది. అత్యాధునిక వసతులతో కూడిన సువిశాల విస్తీర్ణంలో రోడ్లతో ఇప్పటివరకు నగరంలో ఎక్కడాలేనట్లు సౌకర్యాలను అభివృద్ధి చేసి వేలం వేసే దిశగా అడుగులు వేస్తోంది. 195.47 ఎకరాల్లో ప్లాటింగ్‌ చేసి విక్రయించడం ద్వారా 5,850 కోట్ల (ఎకరం రూ.30 కోట్లు) ఆదాయాన్ని రాబట్టే దిశగా పనిచేస్తోంది.  హెచ్‌ఎండీఏ గతంలో చేసిన లే–అవుట్లకు, ఈ కోకాపేట లే–అవుట్‌కు భారీ మార్పులు ఉండేలా అధికారులు చూసుకుంటున్నారు. భవిష్యత్‌లో భారీ అభివృద్ధి జరిగి వాహనాల రాకపోకలు జరిగినా ట్రాఫిక్‌ ఇబ్బందులు రాకుండా రోడ్లు నిర్మించాలని ప్రణాళిక రచించారు. ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డు, శంకర్‌పల్లి రోడ్డుకు ఈ లే–అవుట్‌ లింక్‌ ఉండేలా ప్రత్యేక ప్లాన్‌ చేయడంతో ఈ ప్లాట్లకు మహా గిరాకీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్ప టికే గజం ధర లక్ష ఉందని లెక్కలు వేసుకుంటున్న అధికారులు హెచ్‌ఎండీఏకు రూ.5,850 కోట్లు వస్తాయంటున్నారు.  

సమసిన వివాదం... 
హెచ్‌ఎండీఏకు కోకాపేటలో ఉన్న 634 ఎకరాల్లో 167 ఎకరాలను గోల్డెన్‌ మైల్‌ ప్రాజెక్టు పేరుతో 100 ఎకరాలు, ఎంపైర్‌–1, 2 పేరుతో 67 ఎకరాలను 2007లో వేలం ద్వారా విక్రయించింది. అయితే ఈ భూముల విషయంలో వివాదం నెలకొని చాలా యేళ్లు కొనసాగింది. 2017లో కోకాపేటలోని సదరు భూములన్నీ హెచ్‌ఎండీఏవే అని, వాటిని విక్రయించుకునే హక్కు దానికే ఉందని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో వివాదం సమసి 634 ఎకరాలు హెచ్‌ఎండీఏ చేతికి వచ్చాయి. ఇందులో ముందుగా వేలం వేసిన సంస్థలకు 167 ఎకరాలు పోనూ ఐటీ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌కు 110 ఎకరాలు, వివిధ సంఘాలకు 50 ఎకరాలు కేటాయించారు. ఇక మిగిలిన 300 ఎకరాల స్థలంలో 195.47 ఎకరాల్లో లే–అవుట్‌ చేయాలని హెచ్‌ఎండీఏ ప్రణాళిక రచించి ఆ మేరకు ముందుకుపోతోంది.
ప్రత్యేకతలు..
5,850 కోట్ల ఆదాయం
195.47 ఎకరాల్లో ప్లాటింగ్‌
120–150 ఫీట్లు..భవిష్యత్‌ రద్దీ మేరకు రోడ్లు 
ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డు,శంకర్‌పల్లి రోడ్డుకు ఈ లే–అవుట్‌ లింక్‌.

Link to comment
Share on other sites

Ee lekkena kotta secretariat tho offices anni consolation ayte government ki panduga, current govt offices use 300 acres of prime land scattered all over hyderabad, they can offload some of them for few thousand crores..not bad.

 

Link to comment
Share on other sites

3 minutes ago, hyperbole said:

Ee lekkena kotta secretariat tho offices anni consolation ayte government ki panduga, 300 acres of prime land scattered all over hyderabad, they can offload some of them for few thousand crores..no bad

Enni crores vachina manaki chippa ey kada

Link to comment
Share on other sites

37 minutes ago, hyperbole said:

Ee lekkena kotta secretariat tho offices anni consolation ayte government ki panduga, current govt offices use 300 acres of prime land scattered all over hyderabad, they can offload some of them for few thousand crores..not bad.

 

Kotta office katadaniki double kharchu 

Link to comment
Share on other sites

29 minutes ago, snoww said:

If these lands are bought for high price in auction. It will raise the land rates more in surrounding areas. 

It happened last time too. 

good for those land owners man aythe

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...