Jump to content

10 లక్షల ఉద్యోగాలకు ముప్పు!


kakatiya

Recommended Posts

అలో వాహన...! 

అమ్మకాలు లేక ఉత్పత్తి తగ్గిస్తున్న కంపెనీలు 
ప్రయాణికుల వాహనాల్లో 13% క్షీణత 
ద్విచక్ర వాహనాల ఉత్పత్తిలో 10% కోత 
పరిస్థితి మారకుంటే 10 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

bussiness-news-2a_2.jpg

దేశీయంగా వాహన తయారీ సంస్థలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అమ్మకాలు తగ్గి, నిల్వలు పేరుకుపోతున్నందున ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయి. ప్రయాణికుల వాహన (పీవీ) ఉత్పత్తి ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ ఏప్రిల్‌-జులై నెలల్లో 13.18 శాతం క్షీణించింది. అగ్ర తయారీ సంస్థలైన మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, ఫోర్డ్‌, టయోటా, హోండా తమ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాయి. ఫలితంగా వాహనాల ఉత్పత్తి క్షీణించిందని భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్‌) వెల్లడించింది. ఇదే సమయంలో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌), ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా సంస్థలు మాత్రం ఉత్పత్తిని స్వల్పంగా పెంచాయని పేర్కొంది. సియామ్‌ గణాంకాల ప్రకారం..

ద్విచక్ర వాహన విభాగంలో.. 
* ఏప్రిల్‌-జులై మధ్య మొత్తం ప్రయాణికుల వాహనాల (పీవీ) ఉత్పత్తి 12,13,281కు తగ్గింది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఉత్పత్తి చేసిన 13,97,404 వాహనాలతో పోలిస్తే ఇది 13.18 శాతం తక్కువ. 
* మారుతీ సుజుకీ ఉత్పత్తి 18.06 శాతం క్షీణించి 5,32,979 ప్రయాణికుల వాహనాలకు పరిమితమైంది. 
* మహీంద్రా అండ్‌ మహీంద్రా ఉత్పత్తి 10.65 శాతం తగ్గి 80,679 వాహనాలకు, ఫోర్డ్‌ ఇండియా ఉత్పత్తి 25.11 శాతం క్షీణించి 71,348 వాహనాలకు పరిమితమయ్యాయి. 
* టాటా మోటార్స్‌ ఉత్పత్తి 20.37 శాతం తగ్గి 59,667 వాహనాలకు, హోండా కార్స్‌ ఇండియా ఉత్పత్తి 18.86 శాతం తగ్గి 47,043 వాహనాలకు పరిమితమయ్యాయి. 
* టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎమ్‌) తమ ఉత్పత్తిని 20.98 శాతం తగ్గించి 45,491 వాహనాలకు పరిమితం చేసింది. 
* మరోవైపు, పీవీ విభాగంలో అతి పెద్ద రెండో ఉత్పత్తిదారు అయిన హెచ్‌ఎంఐఎల్‌ మాత్రం ఉత్పత్తిని స్వల్పంగా 1.77 శాతం పెంచింది. 2,39,671 వాహనాలను తయారు చేసింది. 
* ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా ఉత్పత్తి కూడా 1.05 శాతం పెరిగి, 36,929 వాహనాలకు చేరింది. 
* ద్విచక్ర వాహన విభాగంలోనూ ఏప్రిల్‌-జులై మధ్యలో మొత్తం ఉత్పత్తి 9.96 శాతం క్షీణించి 78,45,675 వాహనాలకు పరిమితం అయ్యింది. క్రితం ఏడాది ఇదే సమయంలో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి 87,13,476 కావడం గమనార్హం. 
* హీరో మోటోకార్ప్‌ ఉత్పత్తి 12.03 శాతం తగ్గి 24,66,802 వాహనాలకు పరమితమైంది. 
* హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తమ ఉత్పత్తిని 18.5 శాతం తగ్గించి, 19,44,900 వాహనాలకు పరిమితం చేసింది. 
* టీవీఎస్‌ మోటార్‌ ఉత్పత్తి 8.07 శాతం తగ్గి 11,54,670 వాహనాలకు పరిమితమైంది. 
* రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహన ఉత్పత్తి 22.35 శాతం క్షీణించింది. 2,40,190 ద్విచక్ర వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేసింది. 
* అయితే, బజాజ్‌ ఆటో మాత్రం ఉత్పత్తిని 4.47 శాతం పెంచి 13,89,396 వాహనాలను తయారు చేసింది. సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా కూడా 24.51 శాతం ఉత్పత్తిని పెంచి 2,83,291 వాహనాలను తయారు చేసింది.

ఉద్యోగాల్లో కోత 
వాహన అమ్మకాలు తగ్గడం వల్ల, తయారీలో కోత విధించడంతో, కంపెనీలు గత మూడు నెలల్లో సుమారు 15,000 మంది సాధారణ, తాత్కాలిక కార్మికులను తొలగించాయి. డీలర్ల సమాఖ్య  కూడా గత మూడు నెలల్లో 2 లక్షల మందిని తొలగించినట్లు పేర్కొంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, సుమారు 10 లక్షల ఉద్యోగాలకు రక్షణ లేకుండా పోయే ప్రమాదం ఉందని విడిభాగాల పరిశ్రమ సమాఖ్య (అక్మా) హెచ్చరించింది

Link to comment
Share on other sites

17 minutes ago, jefferson1 said:

India lo economy assam a ?

Banks used to be our life line..after farmer loan waivers and poor economic policies during nda.. Assam

 

Also note that India trade defecit increased to 15.3 billion dollar.

 

Link to comment
Share on other sites

3 minutes ago, kakatiya said:

Banks used to be our life line..after farmer loan waivers and poor economic policies during nda.. Assam

 

Also note that India trade defecit increased to 15.3 billion dollar.

 

Economy policies done under nda ki ippudu economy bad a ?

5+ yrs aindi kada modi vochi 

Link to comment
Share on other sites

15 lakh jobs anta...

this is just exaggeration. 

Motham auto industry indirect dependency chusina kuda kastam mida 15 lakh jobs vuntayi, especially manufacturing. 

Oka 10-20% job loss vuntadi kani this exaggeration is way too much

Link to comment
Share on other sites

9 minutes ago, Android_Halwa said:

15 lakh jobs anta...

this is just exaggeration. 

Motham auto industry indirect dependency chusina kuda kastam mida 15 lakh jobs vuntayi, especially manufacturing. 

Oka 10-20% job loss vuntadi kani this exaggeration is way too much

Maruthi udyog limited around have 40,000 full time employees with multiple cl reached .

 

They have additionally 1800 outlets and service centers.

 

We are just talking about maruthi here..we didn't include Tata motors 88,000 full time staff (excluding service centers and delaers) ..part suppliers.. - example tire manufacturers like appollo, mrf 

 

TVs motors and hero motors staff is way higher

Automobile industry is huge in india

Link to comment
Share on other sites

3 minutes ago, Hydrockers said:

Poye jobs 10 lachalu unte mottam jobs enni unnai ?

A count kastam, paina numbers not sure they are correct too . 

Media etla represent chesthe atla 

Link to comment
Share on other sites

55 minutes ago, Hydrockers said:

Poye jobs 10 lachalu unte mottam jobs enni unnai ?

Ante automotive ancillary companies, service centers, dealerships etc anni kalpithe pedda number ee undachu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...