Jump to content

నిన్న ఉత్తమ పోలీసు.. నేడు ఏసీబీ కేసు


tom bhayya

Recommended Posts

మహబూబ్‌నగర్‌ (నేరవిభాగం), న్యూస్‌టుడే:  ఉత్తమ అవార్డుల ఎంపికలో చిత్తశుద్ధినే శంకించే మరో ఉదంతమిది.. ఆమధ్య.. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన లావణ్య అనే తహసీల్దారు ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్న కొన్నాళ్లకే రూ.93 లక్షల నగదుతో ఏసీబీకి పట్టుబడడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. తాజాగా అలాంటిదే మరో సంఘటన జరిగింది. గురువారం పంద్రాగస్టు వేడుకల్లో ఉత్తమ కానిస్టేబుల్‌గా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వ్యక్తి మర్నాడే మామూళ్లు వసూలు చేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. మహబూబ్‌నగర్‌ ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్‌ కథనం మేరకు.. మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ పోలీసుస్టేషనులో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ తిరుపతిరెడ్డి ఇసుక వ్యాపారుల వద్ద తరచూ డబ్బులు వసూలు చేసేవాడు. వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన ముడావత్‌ రమేశ్‌ నిబంధనలకు అనుగుణంగానే ఇసుక తరలిస్తున్నప్పటికీ శుక్రవారం తిరుపతిరెడ్డి అతడిని అడ్డుకున్నాడు. రూ. 17,000 ఇస్తేనే ట్రాక్టరును విడిచిపెడతానని చెప్పాడు. కాదు.. కూడదంటే తప్పుడు కేసులను బనాయిస్తానని బెదిరించాడు. తిరుపతిరెడ్డి వైఖరితో విసిగిపోయిన రమేశ్‌ ఏసీబీ అధికారులను సంప్రదించడంతో వారు వలపన్నారు.

శుక్రవారం సాయంత్రం సాక్షాత్తు పోలీసుస్టేషను ఆవరణలోనే రమేష్‌ వద్ద తిరుపతిరెడ్డి డబ్బు వసూలు చేశాడు. ఆ సొమ్ము తీసుకుని స్టేషనులోకి కానిస్టేబుల్‌ అడుగుపెట్టగానే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుని వద్ద నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మిగతా అధికారులకు ఏమైనా సంబంధం ఉందా? అని అడిగితే.. ఎవరికీ సంబంధం లేదని, తానే తీసుకున్నానని అంగీకరించాడు. ఇసుక వ్యాపారుల నుంచి తిరుపతిరెడ్డి చాన్నాళ్లుగా మామూళ్ల దందా సాగిస్తున్నాడని ఏసీబీకి ఫిర్యాదు చేసిన ఇసుక వ్యాపారి రమేశ్‌ తెలిపారు. రెండేళ్లుగా విధిలేక తానే ఎన్నోసార్లు అతడికి డబ్బులు ఇచ్చానని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే ఇసుక సరఫరా చేస్తున్నప్పటికీ లంచాల పేరుతో వేధించడంతో విసిగి ఏసీబీ అధికారులను ఆశ్రయించానని తెలిపారు. మరి ఇలాంటి కానిస్టేబుల్‌ని ‘ఉత్తమ’ అవార్డుకు ఎలా ఎంపిక చేశారా? అని జనం అవాక్కవుతున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...