Jump to content

walter18

Recommended Posts

‘సైరా’ సైన్యం గురించి మీకు తెలుసా?

గ్ర కథానాయకుడు చిరంజీవి టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, నయనతార, అనుష్క, తమన్నా రవికిషన్‌, నిహారిక తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని ఈనెల 20న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ‘సైరా’లో కీలక పాత్రలు పోషిస్తున్న వారి గురించి చిత్ర బృంద సరికొత్త పోస్టర్‌లను అభిమానులతో పంచుకుంది. మరి ‘సైరా: నరసింహారెడ్డి’తో కలిసి ఆంగ్లేయులపై ఎవరెవరు పోరాడుతున్నారో ఓ లుక్కేయండి.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి

SyeRaa001_2.jpg

1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి పదేళ్ల ముందే బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన  తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ పాత్రను చిరంజీవి పోషిస్తున్నారు. ఇందుకోసం చిరు ఎంతో శ్రమించారు. డూప్‌లేకుండా యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొని శరీరానికి మాత్రమే వయసు తప్ప మనసుకు కాదని నిరూపించారు. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆయన పాత్రను చూస్తుంటే ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

గోసాయి వెంకన్నగా బిగ్‌బి

SyeRaa007_2.jpg

బ్రిటిష్‌ వారిపై పోరాడేందుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి గురువుగా, మార్గదర్శకుడిగా నిలిచిన వ్యక్తి గోసాయి వెంకన్న. ఈ పాత్రను బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ పోషిస్తున్నారు. ఈ పాత్ర గురించి చిరు అమితాబ్‌ ఫోన్‌ చేసి చెప్పగానే వెంటనే ఒప్పుకొన్నారట. ‘అమృత వర్షం’, ‘మనం’ చిత్రాల తర్వాత అమితాబ్‌ నటించే తెలుగు చిత్రం ఇదే కావడం గమనార్హం. 

అవుకు రాజుగా సుదీప్‌

SyeRaa002_2.jpg

న్నడస్టార్‌ సుదీప్‌ ‘సైరా’లో అవుకు రాజు పాత్ర పోషిస్తున్నారు. అత్యాశ కలిగిన వ్యక్తిగా, కాస్త పొగరుబోతుగా కనిపించే అవుకురాజు..  ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని విమర్శిస్తూ, అతనికి వ్యతిరేకంగా ఉంటాడు. అయితే, అదే సమయంలో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగానూ పోరాటం చేస్తాడు. 

విజయ్‌సేతుపతి.. రాజా పండి

SyeRaa003.jpg

విలక్షణ తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ఇందులో రాజా పండి అనే పాత్రను పోషిస్తున్నారు. అత్యంత ధైర్య సాహసాలు కలిగిన యోధుడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి ఆత్మలాంటివాడు. 

లక్ష్మీగా తమన్నా 

SyeRaa004.jpg

‘సైరా’లో మిల్కీ బ్యూటీ తమన్నా లక్ష్మీ అనే పాత్రను పోషిస్తున్నారు. గుండెల నిండా దేశభక్తిని నింపుకొన్న యువతి. నరసింహారెడ్డి పోరాటానికి మద్దతుగా తనవంతు కృషి చేసే యువతిగా తమన్నా అలరించనుంది. 

వీరారెడ్డిగా జగపతిబాబు

SyeRaa005.jpg

ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో ప్రత్యేక పాత్ర అంటే అందరికీ గుర్తొచ్చే నటుడు జగపతిబాబు. అటు విలన్‌గా, ఇటు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చక్కగా రాణిస్తున్నారు. ‘సైరా’లోనూ జగపతిబాబుకు మంచి పాత్ర దక్కింది. ఇందులో ఆయన వీరారెడ్డిగా కనిపించనున్నారు. రాజ కుటుంబానికి చెందిన ఆయన దేశానికి, ప్రజలకు విశ్వాసపాత్రుడు. 

నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార

SyeRaa006.jpg

గ్ర కథానాయిక నయనతార ‘సైరా’లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్ర పోషిస్తున్నారు. నిస్వార్థ, స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీక సిద్ధమ్మ పాత్ర. నరసింహారెడ్డే ఆమె ప్రపంచం.

వీరే కాదు, అనుష్క, రవికిషన్‌, నిహారిక తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సైరా’ను అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

సైరా.. చరిత్రలో కనుమరుగైన వీరుడి కథ

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగా తనయుడు రామ్‌ చరణ్‌ స్వయంగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఒక టీజర్‌తో పాటు, మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్‌ దగ్గరపడుతుండటంతో మరో టీజర్‌ను మంగళవారం ముంబైలో రిలీజ్ చేశారు. భారీ యాక్షన్‌ విజువల్స్‌లో రూపొందించిన ఈ టీజర్‌ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తోంది. పవన్‌ వాయిస్‌తో ప్రారంభమైన టీజర్‌, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో వావ్‌ అనిపించేలా డిజైన్‌ చేశారు.

మెగాస్టార్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, సుధీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, రవికిషన్‌, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిరు డ్రీమ్‌ ప్రాజెక్ట్ కూడా కావటంతో రామ్‌ చరణ్‌ దగ్గరుండి సినిమా పనులన్ని చూసుకుంటున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

Link to comment
Share on other sites

 

 

మేకింగ్‌ ఆఫ్‌ ‘సైరా’
రాజ్య వ్యవస్థలను, రాజులను ఆంగ్లేయులు తమ ఆధీనంలోకి తీసుకొని తమ అదుపులో ఉన్న ప్రాంతాలకు ‘పాలెగాళ్ల’ను ఏర్పాటు చేసేవాళ్లు. అలాంటి ఓ పాలెగాడు నరసింహారెడ్డి. ఆంగ్లేయులపై ఎలా ఎదురుతిరిగాడు? ఈ ఉద్యమంలో ఎవరెవరిని తనతో కలుపుకుంటూ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాడు అనేది చిత్రకథ అని సమాచారం. ఈ చిత్రంలో అనుష్క ఝాన్సీ రాణిగా కనిపిస్తారు. సినిమా అనుష్క వాయిస్‌ ఓవర్‌తోనే మొదలవుతుందని తెలిసింది. చిరంజీవి గురువు పాత్రలో అమితాబ్‌ నటించారు. రాజ నర్తకి పాత్రలో తమన్నా, నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార నటించారు. నరసింహారెడ్డికి మద్దతుగా తమిళనాడు నుంచి వచ్చే దళ నాయకుడిగా విజయ్‌ సేతుపతి కనిపిస్తారు.

ఎవరి పాత్రేంటి?
చిరంజీవి – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
నయనతార – సిద్ధమ్మ
అమితాబ్‌ బచ్చన్‌ – గోసాయి వెంకన్న
జగపతి బాబు – వీరారెడ్డి
‘కిచ్చ’ సుదీప్‌ – అవుకు రాజు
విజయ్‌ సేతుపతి – రాజా పాండీ
తమన్నా – లక్షి
అనుష్క – ఝాన్సీ లక్ష్మీభాయ్‌

 

సైరా బృందం
రచన : పరుచూరి బ్రదర్స్‌
దర్శకుడు : సురేందర్‌ రెడ్డి
నిర్మాత : రామ్‌చరణ్‌
ప్రొడక్షన్‌ డిజైనర్‌ : రాజీవన్‌
కెమెరా మేన్‌ : రత్నవేలు
యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ : గ్రెగ్‌ పోవెల్, రామ్‌ లక్ష్మణ్, లీ వైట్కర్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : అంజూ మోడీ,
సుష్మితా కొణిదెల, ఉత్తరా మీనన్‌
వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ : కమల్‌ కణ్ణన్‌
సంగీతం : అమిత్‌ త్రివేది

రాజస్తాన్‌ స్పెషల్‌ కత్తి
యాక్షన్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 150కు పైగా వివిధ రకాలైన కత్తులను తయారు చేయించారట. ప్రధానంగా చిరంజీవి రెండు కత్తులు వాడారని సమాచారం. ఒక కత్తిని ప్రత్యేకంగా రాజస్థాన్‌ నుంచి తెప్పించారట. ఇక్కడ డిజైన్‌ చేసి, రాజస్తాన్‌ పంపించి, ఆ కత్తిని తయారు చేయించారు. మరో కత్తిని హైదరాబాద్‌లోనే తయారు చేయించారు. ఇంకా మిగతా కత్తులను ఇక్కడ డిజైన్‌ చేసి, చెన్నైలో తయారు చేయించారు.

రెండు భారీ యుద్ధాలు!
‘సైరా’ సినిమాలో రెండు భారీ యుద్ధాలు ఉంటాయని తెలిసింది. ఈ యుద్ధ సన్నివేశాల్లో ఒకటి జార్జియా దేశంలో, మరొకటి హైదరాబాద్‌లోని కోకాపేట్‌ సెట్లో షూట్‌ చేశారు. జార్జియాలో నెల రోజుల పాటు ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించగా, కోకాపేట్‌లో దాదాపు 35 రోజులుపైగా నైట్‌ షూట్‌ చేశారట. సినిమాలో వచ్చే ఈ మేజర్‌ వార్‌ సీన్స్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయని తెలిసింది. ఇంకా ఇవి కాకుండా పోరాట దృశ్యాలు మరిన్ని ఉంటాయి. వాటిలో నీటి లోపల తీసిన అండర్‌ వాటర్‌ ఎపిసోడ్‌ ఓ హైలైట్‌ అని తెలిసింది. ఈ ఎపిసోడ్‌ను ముంబైలో వారం రోజులు షూట్‌ చేశారు.

పదిహేను సెట్లు
‘సైరా’ చారిత్రాత్మక చిత్రం. స్క్రీన్‌ మీద ఆ కాలాన్ని ప్రతిబింబించాలంటే సెట్లు కచ్చితంగా నిర్మించాల్సిందే. ‘సైరా’ చిత్రాన్ని ఎక్కువ శాతం సెట్లోనే షూట్‌ చేశారు. దాని కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు సెట్లు, ఆర్‌ఎఫ్‌సీలో రెండు సెట్లు, కోకాపేటలో మూడు సెట్లు (టెంపుల్‌ సెట్, ప్యాలెస్‌ సెట్‌తో పాటు మరోటి), ఇంకా హైదరాబాద్‌లోనే రెండు సెట్లు, పాండిచెరీలో ఒకటి, మైసూర్, తమిళనాడులో హోగెనకల్‌లో ఒకటి, కేరళలో ఒకటి, రెండు సెట్లను రూపొందించారు. ఇలా 15కు పైగా భారీ సెట్లను ఈ సినిమా కోసం రూపొందించారు ఆర్ట్‌ డైరెక్టర్‌ రాజీవన్‌ ఆధ్వర్యంలో అద్భుతమైన సెట్లు తయారు చేశారు.
nayanthara-syeraa.jpg
నయనతార

గెరిల్లా ఫైట్‌
నరసింహారెడ్డి ఆంగ్లేయులతో తలపడిన విధానాల్లో గెరిల్లా ఒక పద్ధతి. శత్రువుల్లో కలిసిపోయి అనూహ్యంగా దాడి చేయడం ఈ యుద్ధ విద్య విశేషం. సినిమాలో ఓ పాటలో ఈ గెరిల్లా పోరాటాన్ని చూపించనున్నారట చిత్రబృందం. పాట బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆ ఫైట్‌లో  చిత్రకథానాయకుడు చిరంజీవితో పాటు దాదాపు 500మంది పాల్గొన్నారు.
syera.jpg

కాస్ట్యూమ్స్‌
ఇందులో చిరంజీవి సుమారు 50 కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారని సమాచారం. చిరంజీవి కాస్ట్యూమ్స్‌ను ఆయన కుమార్తె సుష్మితా కొణిదెల డిజైన్‌ చేశారు. తమన్నా నర్తకి పాత్రలో కనిపించనున్నారు. ఆమె కూడా ఓ 25 కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారట. నయనతారకి 20 డ్రస్‌ చేంజ్‌లు ఉంటాయని తెలిసింది. సినిమాలో ఎక్కువ కాస్ట్యూమ్స్‌ ఈ మూడు పాత్రలకే ఉంటాయి. అంజూ మోడీ, ఉత్తరా మీనన్‌లు కూడా కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశారు.
Tamanna-BDay-still-copy.jpg
తమన్నా

‘‘సైరా’లో నా పాత్ర రెండు నిమిషాలు కూడా ఉండదు. కానీ మేకింగ్‌ వీడియోలో నా విజువల్స్‌ కూడా వేశారు చరణ్‌ (రామ్‌ చరణ్‌) అన్న. అది చాలా స్వీట్‌ అనిపించింది. అన్న స్టైలే అది. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో మా అందర్నీ హ్యాపీగా ఉంచుతాడు. ఇది రక్షాబంధన్‌కి అడ్వాన్స్‌గా ఇచ్చిన గిఫ్ట్‌ అనుకుంటున్నాను’’ అని తన ఆనందాన్ని షేర్‌ చేసుకున్నారు నిహారిక. ఇందులో నిహారిక కాసేపు కనిపిస్తారు.
niharika.jpg
 నిహారిక

 
Link to comment
Share on other sites

Tunes of Oscar winner AR Rahman for ‘SYE RAA”!

Oscar awards winner AR Rahman had composed tunes to ‘SYE RAA’, 151st movie of Megastar Chiranjeevi. He has already composed hit tunes to ‘Khaidi No. 150’.There seem to be a strategic reason in selecting AR Rahman, discarding Devisri Prasad. He has not worked for movies with historic background so far. He has deserted Gautamiputra Satakarni in 11th hour, whereas Rahman has worked for Bollywood hit film Joda Akbar. Moreover, his music would be popular in other languages also!.

Link to comment
Share on other sites

మెగాస్టార్ చిరంజీవి నటించిన సై రా నరసింహ రెడ్డి – మేకింగ్ వీడియో

 

Link to comment
Share on other sites

‘సైరా’ టీజర్ విడుదల

Sye-Raa-film.jpg

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన అత్యంత ప్రతిష్టాత్మక మూవీ ‘సైరా’. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు సైరా టీం మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ నెల 22న మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం సైరా సినిమా టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. చరిత్ర స్మరించుకుంటుంది..ఝాన్సీ లక్ష్మీబాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడుగ అంటూ వవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తి రేపింది. ఇందులో చిరంజీవి చేసే యుద్ద సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో నయనతార, తమన్నా, జగపతిబాబు, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరు 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Link to comment
Share on other sites

Sye Raa Narasimha Reddy is a Telugu-language historical war film directed by Surender Reddy and produced by Ram Charan on Konidela Production Company banner. The film story is based on the life of freedom fighter Uyyalawada Narasimha Reddy from Rayalaseema. The film's budget was Rs 200 crores initially but it is learned that the budget is likely to cross it. Director Surender Reddy has learned to have removed some content which he considered as unnecessary. The film makers have given importance to graphics, it is learned. Within a few days the movie shooting is likely to be completed. The film features Chiranjeevi, Sudeep, Vijay Sethupathi, Jagapati Babu, Amitabh Bachchan, Nayanthara, Tamannaah, and Brahmaji.

Link to comment
Share on other sites

13 minutes ago, chittimallu_14 said:

lol WTF.... uyyalawada inti pera... nenu ippati dhaka syeraa anukunna :lol: 

Sye raa ani usually to hail a person antaaru ani talk and Sye raa ani pettadaniki reasons being kind to avert rights issue. 

  • Upvote 1
Link to comment
Share on other sites

7 minutes ago, walter18 said:

Tunes of Oscar winner AR Rahman for ‘SYE RAA”!

Oscar awards winner AR Rahman had composed tunes to ‘SYE RAA’, 151st movie of Megastar Chiranjeevi. He has already composed hit tunes to ‘Khaidi No. 150’.There seem to be a strategic reason in selecting AR Rahman, discarding Devisri Prasad. He has not worked for movies with historic background so far. He has deserted Gautamiputra Satakarni in 11th hour, whereas Rahman has worked for Bollywood hit film Joda Akbar. Moreover, his music would be popular in other languages also!.

AR Rehman was supposed to score music for this but moved away.. Now its being done by Amit Trivedi.. 

Link to comment
Share on other sites

In real story, aayanani hang chesinaka britishers aa head ni 30 years hang chestu odilesarata, on some fort entrance. revolt cheste ela untadani janalaki cheppadaniki. 

  • Like 1
Link to comment
Share on other sites

2 minutes ago, ChinnaBhasha said:

In real story, aayanani hang chesinaka britishers aa head ni 30 years hang chestu odilesarata, on some fort entrance. revolt cheste ela untadani janalaki cheppadaniki. 

mari adhi movie choopinchedmo???

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...