Jump to content

Amazon new campus @ Hyderabad, Opening Today.


reality

Recommended Posts

భాగ్యనగరికి మణిహారం

అమెజాన్‌ హైదరాబాద్‌ దరి చేరింది
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణం
నేడు ప్రారంభోత్సవం
ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్‌

భాగ్యనగరికి మణిహారం

ఈనాడు, హైదరాబాద్‌: భాగ్యనగరి మెడలో మరో మణిహారం చేరనుంది. ఇ-కామర్స్‌ రంగంలో అగ్రగామి సంస్థ అమెజాన్‌ నగరంలోని నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేసిన ప్రాంగణం ప్రపంచంలోనే అతిపెద్దది. పదివేల మందికి ఉపాధి కల్పించేలా పది ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ప్రాంగణం బుధవారం ప్రారంభం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.అమెజాన్‌ ఇండియా సీనియర్‌ ఉపాధ్యక్షుడు, కంట్రీ మేనేజర్‌ అమిత్‌ అగర్వాల్‌, సంస్థ స్థిరాస్తి, వసతుల  విభాగం సంచాలకుడు జాన్‌ స్కోట్లర్‌ కూడా పాల్గొంటారు.

భాగ్యనగరికి మణిహారం

2016 మార్చి 31న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన జరిగింది. సుమారు 15 అంతస్తులలో 30 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీని నిర్మాణం చేపట్టారు. ఇందులో పది లక్షల చదరపు అడుగులను పార్కింగుకు కేటాయించారు. పూర్తిగా అధునాతన నమూనాలో సకల వసతులతో దీనిని నిర్మించారు. అమెజాన్‌కు ప్రస్తుతం ఏడు వేల మంది ఉద్యోగులున్నారు. వచ్చే నెలాఖరు నాటికి ఈ సంఖ్య పదివేలకు చేరనుంది. అమెజాన్‌ దశాబ్దం క్రితం హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటికే శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో అనుకూలతలను పరిగణనలోకి తీసుకొని ఇక్కడ రూ.400 కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాంగణం నిర్మించాలని నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాంగణం నుంచి అమెజాన్‌ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహించనుంది. వ్యాపార నిర్వహణ ప్రణాళికలకు తోడు కొత్త సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన, వాణిజ్య విస్తరణ కార్యాచరణకు ఇది కేంద్రం కానుంది.

హైదరాబాద్‌కు మరో కలికితురాయి
ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ అతిపెద్ద ప్రాంగణానికి హైదరాబాద్‌ వేదిక కావడం ద్వారా రాష్ట్రానికి విశేష ఖ్యాతి దక్కనుంది. మరిన్ని సంస్థలు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకునే వీలుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఐబీఎం, ఒరాకిల్‌ వంటి అనేక బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ కార్యాలయాలను నడుపుతున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, టెక్‌ మహేంద్ర వంటి కంపెనీలెన్నో తెలంగాణలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఐటీ దిగ్గజం గూగుల్‌ సంస్థ హైదరాబాద్‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో తమ ప్రాంగణాన్ని నెలకొల్పింది. గూగుల్‌ సంస్థ అమెరికా బయట అదీ హైదరాబాద్‌లో ఇంత పెద్దఎత్తున తమ కార్యకలాపాల్ని విస్తరించడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాత యాపిల్‌ కంపెనీ హైదరాబాద్‌లో 2016 మే 19న మ్యాప్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించింది. నానక్‌రామ్‌గూడలోని వేవ్‌రాక్‌లో యాపిల్‌ సంస్థ కార్యాలయం మొదలైంది. యాపిల్‌ ఉత్పత్తులైన ఐ ఫోన్‌, ఐ ప్యాడ్‌, యాపిల్‌ వాచ్‌ల వంటి ఉత్పత్తులకు మ్యాప్‌ల అభివృద్ధి పనులను ఈ కేంద్రం నుంచి సాగిస్తున్నారు. 


పెట్టుబడులకు ఊతం

అమెజాన్‌ అతిపెద్ద ప్రాంగణం ద్వారా తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు ఊతం లభిస్తుంది. వ్యాపార నిర్వహణతోపాటు ఉపాధి కల్పనలో అమెజాన్‌ సంస్థ పేరొందింది. దీని ద్వారా తెలంగాణ యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయి. కొత్త ప్రాంగణం పూర్తి స్థాయి విస్తరణతో 25 వేల మంది వరకు ఉపాధి కలుగుతుంది. దీంతో పాటు వ్యాపార వనరుల విస్తరణ ద్వారా తెలంగాణకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది.

- జయేశ్‌రంజన్‌, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి

  • Upvote 1
Link to comment
Share on other sites

Amazon spreading its roots very fast ... Small businesses already suffering big time with Amazon presence.. Indias' major population survives on Small business... God save India..

Link to comment
Share on other sites

10 minutes ago, Hitman said:

Amazon spreading its roots very fast ... Small businesses already suffering big time with Amazon presence.. Indias' major population survives on Small business... God save India..

Amazon kak pote inkodu vastadu, adapt or perish is the new mantra

  • Like 1
Link to comment
Share on other sites

Small businesses are the only real businesses in India. Corporates are mostly chors. But RSS hates small businesses because they are now dominated by lower castes and muslims in urban areas. Demonetization was to destroy them and strenghten corporates.

  • Confused 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...