Jump to content

అమరావతిని కదిలిస్తే... ఆమరణ దీక్షకైనా సిద్ధం.


Yaman02

Recommended Posts

చంద్రబాబుపై కక్షతోనే కుట్రలు
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
 
చిలకలూరిపేట (గుంటూరు జిల్లా): అమరావతి రాజధానిని నిలిపివేస్తే రైతులు, ప్రజలతో కలసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహా ఉద్యమం చేస్తామని, ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమవుతామని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేటలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరావతి రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అమరావతిని... వైసీపీ ప్రభుత్వం భ్రమరావతి చేస్తుందనే సందేహం తలెత్తుతోందన్నారు. గతంలో అనేకసార్లు బొత్స సత్యనారాయణ అమరావతిపై అనుమానాలు లేవని చెప్పారని, ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ముంపు నివారణ కుంటిసాకుతో అమరావతిని నిలిపివేసే కుట్ర జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు తెలియకుండా బొత్స మాట్లాడరన్నారు. చంద్రబాబుపై కోపంతో, కక్షతో అమరావతిని నిలిపివేయాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోబోమని ప్రత్తిపాటి హెచ్చరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం ప్రభుత్వానికి, జగన్‌కు ప్రజలు ఇవ్వలేదన్నారు.
 
 
ప్రజాధనం దుర్వినియోగం
ఇప్పటికే ప్రజావేదికను కూల్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రత్తిపాటి విమర్శించారు. అమరావతిని కూడా దొనకొండ, ఇడుపులపాయకు మార్చాలని కుట్రచేస్తే ప్రభుత్వాన్ని నిలువరిస్తామని హెచ్చరించారు. అమరావతి రాజధాని ప్రధాని మోదీ చేతులమీదుగా శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అమరావతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాలు అమరావతి రాజధానివైపు చూస్తున్నాయన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. భూములు ఇచ్చిన రైతులలో వైసీపీవారు కూడా ఉన్నారన్నారు. తుళ్లూరు మండలంలో కులమతాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాలకు చెందినవారు రాజకీయాలకు అతీతంగా 98 శాతం మంది రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడం జరిగిందన్నారు. రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల ప్రజలు వైసీపీ కుట్రను తిప్పికొట్టాలన్నారు. ముఖ్యమంత్రి రాజధానిపై స్పష్టమైన వైఖరి తెలియచేయాని డిమాండ్‌ చేశారు.
 
 
ఇప్పటికే రూ.30 వేల కోట్లకు పైబడి టెండర్లు పిలవడం జరిగిందని, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. అమరావతి ముంపు ప్రాంతమని కుంటిసాకులు చెబుతున్నారని, ఒక వేళ ముంపు ప్రాంతమే అయితే నివారణ చేయడానికి ఇప్పటివరకు పెట్టిన ఖర్చు కంటే చాలా తక్కువ అవుతుందన్నారు. ఇప్పటికే చంద్రబాబునాయుడు ముంపు నివారణ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబుపై కక్షతో ఆయన ఇంటిని ముంచి ఖాళీచేయించాలని ప్రభుత్వం, జగన్‌ కుట్ర పన్నారన్నారు. వైసీపీ కావాలని పేదల జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపించారు. 12 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినప్పుడు కూడా ఎవరికీ నష్టం జరగకుండా చంద్రబాబు చూశారన్నారు. 8 లక్షల క్యూసెక్కుల కృత్రిమ వరద వస్తే సమర్థంగా ఎదుర్కొనడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. ప్రజావేదిక కూల్చిన తప్పును సరిదిద్దుకునేందుకు నీటిని కిందకు వదలకుండా చంద్రబాబు ఇంటిని ముంచాలని చూశారని విమర్శించారు.
 
అక్రమాలను నిలువరించాలి...
ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ అరాచకం, అక్రమాలు నిలువరించవలసిన పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రమాణస్వీకారం సందర్భంగా అవినీతిని నిలువరిస్తామని చెబితే సంతోషించామని, మూడు నెలల కాలంలోనే అరాచకాలు, అక్రమాలు, అవినీతి పెరిగిపోయిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. పోలవరం, బందరు పోర్టులను ఇప్పటికే ఆపేశారని, అమరావతిని కూడా ఆపేయబోతున్నారన్నారు. సమావేశంలో మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఎస్‌ఎస్‌ సుభాని, చిలకలూరిపేట మండల టీడీపీ అధ్యక్షుడు జవ్వాజి మదన్‌, నాదెండ్ల మండల టీడీపీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ, టీడీపీ నాయకులు కిలారు రవి, గుర్రం నాగపూర్ణచంద్రరావు, జవ్వాజి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Amaravati kosam deeksha

But state mothaniki use ayye special status kosam matram no deeksha 

Medalu vanchutham ana vala guruncha nuvu antundhi 

Link to comment
Share on other sites

17 minutes ago, cosmopolitan said:

Medalu vanchutham ana vala guruncha nuvu antundhi 

Ledhu...Fact Finding committee esi .., special package kullipoyina laddoo... special status ye muddu, SS kosam telangana tharaha udyamam chestha ani lolli chesi... chivariki elachans lo cheppu debbalu thini ippudu pushpam batch sanka nakuthunna vadi gurinchi anta...

Link to comment
Share on other sites

12 minutes ago, reality said:

Ledhu...Fact Finding committee esi .., special package kullipoyina laddoo... special status ye muddu, SS kosam telangana tharaha udyamam chestha ani lolli chesi... chivariki elachans lo cheppu debbalu thini ippudu pushpam batch sanka nakuthunna vadi gurinchi anta...

Ante 2014 lo A1 kuda chepu debalu thinada? ..Bjp sanka Evaru nakuthinaru ayaru?.. BJP tho close ga undi kuda.. paachipoyina laddu ani valaki dooram ayindhi evaru?.. medalu vanchi thestham and madama thipanu ani anadhi evaru? .. so basic u r saying A1  2014 lo odipiyi slippershots thinadu ana?

Link to comment
Share on other sites

Just now, cosmopolitan said:

Ante 2014 lo A1 kuda chepu debalu thinada? ..Bjp sanka Evaru nakuthinaru ayaru?.. BJP tho close ga undi kuda.. paachipoyina laddu ani valaki dooram ayindhi evaru?.. medalu vanchi thestham and madama thipanu ani anadhi evaru? .. so basic u r saying A1 kuda 2014 lo odipiyi slippershots thinadu ana?

Ledhu Pawala gadi gurinchi... anni clear ga  chepthe kani artham kaavu...

Link to comment
Share on other sites

1 minute ago, reality said:

Ledhu Pawala gadi gurinchi... anni clear ga  chepthe kani artham kaavu...

Nenu antha clear ga A1 ani chepina niku artham katle ....inthaki 2014 lo A1 odipoyadu kadha.. janalu cheppu debalu vesara chepaledhu 

Link to comment
Share on other sites

4 minutes ago, cosmopolitan said:

Nenu antha clear ga A1 ani chepina niku artham katle ....inthaki 2014 lo A1 odipiyi.. janalu cheppu debalu vesara chepaledhu 

Cheppu debbalu ante... own constituency lo odipovatam being a party president, that too both places...

enti artham avuthundhaa...??? CITI_c$y

 

Link to comment
Share on other sites

2 minutes ago, reality said:

Cheppu debbalu ante... own consistency lo odipovatam being a party president, that too both places...

enti artham avuthundhaa...??? CITI_c$y

 

Ok ila twist chesava statement .. madama baga thipav.. odipovatame slipper shot ayithe jail lo one year gadipinodu emanali.. pedalo munchi ichina slipper shot aa 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...