Jump to content

jagame maaya.............


Charger

Recommended Posts

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె థుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు 

నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు |నల్ల|| 
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు 

ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్లు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు 
వెల్లు వచ్చి సాగనీ తొలకరి అల్లర్లూ ఎల్లలన్నవే ఎరగని వేగం తో వెళ్లు 

1|| లయకే నిలయమై నీ పాదం సాగాలి 
మలయా నీలగతిలో సుమ బాలగా తూగాలి 
వలలో వొదుగునా విహరించే చిరుగాలి 
సెలయెటికి నటనం నేర్పించే గురువెడి 

తిరిగే కాలానికి తీరోకటుందీ అది నీ స్వార్ధానికి దొరకను అంది 
నటరాజస్వామి జటా జుటీ లోకి చేరకుంటే విరుచుకు ప డు సురగన్గకు వి లువేముందీ 
వి లువేముందీ 

2| దూకే అలలకు ఏ తాళం వేస్తారు 
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు 

అలలకు అందునా ఆశించిన ఆకాశం 
కలలా కరగడమా జీవితాన పరమార్ధం 

వద్దని ఆపలేరూ వురికె వూహని 
హద్దులు దాటరాదు ఆశల వాహినీ 
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే 
వీరివనమున పరిమళముల వి లువేముందీ .... వి లువేముందీ

Link to comment
Share on other sites

21 hours ago, JAPAN said:

$%^ vuuuu

జీవితం సప్త సాగర గీతం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించే చోట
కల ఇల కౌగిలించే చోట

ఏది భువనం ఏది గగనం తారా తోరణం
ఈ చికాగొ సియర్సు టవరు స్వర్గ సోపాణము
ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో
ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము..
హే...
బ్రహ్మ మానస గీతం
మనిషి గీసిన చిత్రం
చేతనాత్మక శిల్పం
మతి కృతి పల్లవించె చోట -2
మతి కృతి పల్లవించె చోట -


ఆ లిబర్టి శిల్ప శిలలలొ
స్వేచ్చా జ్యోతులు
ఐక్య రాజ్య సమితిలొన కలిసే జాతులు
ఆకశాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మయామి బీచ్ కన్న ప్రేమ సామ్రాజ్యము

సృష్టి కే ఇది అందం
దృష్టి కందని దృశ్యం
కవులు రాయని కావ్యం
కృషి ఖుషి సంగమించే చోట - 2
F జీవితం సప్త సాగర గీతం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించే చోట
కల ఇల కౌగిలించే చోట

Link to comment
Share on other sites

 

కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్
ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు 
ఇన్‌ఫ్యాట్యుయేషన్
॥కళ్లు॥

అనుపల్లవి :
ఎడమభుజము కుడిభుజము కలిసి 
ఇక కుదిరే కొత్త త్రిభుజం
పడుచు చదువులకు గణిత సూత్రమిది 
ఎంతో సహజం
సరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం
॥కళ్లు॥
ఇన్‌ఫ్యాట్యుయేషన్... ఇన్‌ఫ్యాట్యుయేషన్...

చరణం : 1
దూరాలకి మీటర్‌లంట భారాలకి కేజీలంట
కోరికలకి కొలమానం ఈ జంట
సెంటీగ్రేడ్ సరిపోదంట 
ఫారెన్ హీట్ పనిచేయదంట
వయసు వేడి కొలవాలంటే తంటా
లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ
అర్థం కాదు ఏ సైన్స్‌కైనా... ఓ...
పైకి విసిరినది కింద పడును 
అని తెలిపే గ్రావిటేషన్
పైన కింద తలకిందులౌతది 
ఇన్‌ఫ్యాట్యుయేషన్
॥కళ్లు॥

చరణం : 2
సౌత్ పోల్ అబ్బాయంట 
నార్త్ పోల్ అమ్మాయంట
రెండు జంట కట్టే తీరాలంట
ధనావేశం అబ్బాయంట 
ఋణావేశ ం అమ్మాయంట 
కలిస్తే కరెంటే పుట్టేనంట
ప్రతిస్పర్శ ప్రశ్నేనంటా మరో ప్రశ్న జవాబట 
ప్రాయానికే పరీక్షలంట... ఓ...
పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చెనంట
అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంట
॥కళ్లు॥

Link to comment
Share on other sites

వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్యవి యోగమ్ 
నాలో రేగే ఎన్నో హంస నంది రాగాలై 
వేదం ||

సాగర సన్గమమే ఒక యోగమ్ 
క్షార జలధులే క్షీరము లాయే ఆమథనమ్ ఒక అమృత గీతం జీవితమే చిర నర్తనమాయే 
పదములు తామే పెదవులు కాగా గున్డియలే అన్ధియలైమ్రొగా || 
ఆఆఆ|| 

మాతృ దేవో భవ పితృ దేవో భవ 
ఆచార్య దేవో భవ |ఆ
అతిధి దేవో భవ..అతిధి దేవో భవ
ఎదురాయె గురువైన దైవం
ఎదలాయె మంజీర నాదం
గురుతాయే కుదురైన నాట్యం
గురు దక్షిణైపోయే జీవం
నటరాజ పాదాన తలవాల్చాన
నయనాభిశెకాన తరీయించనా
సుగమము రసమయ నిగమము భరతము గాన

Link to comment
Share on other sites

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ ఙానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలనే సూక్తి మరవకుండ
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...