Jump to content

Idi entha nijam ? Small pittala dora to be new CM of TG


TheBrahmabull

Recommended Posts

హైదరాబాద్: అనూహ్య పరిణామాలకు అతి త్వరలో తెలంగాణా రాష్ట్రం అడ్డా కాబోతోందా..? తండ్రి నుంచి తనయుడికి అధికార మార్పిడి జరగబోతోందా..? ‘ప్రగతి భవన్’ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం యస్.. అనే వినిపిస్తోంది.

సరిగ్గా మరో పదిరోజుల్లో ‘కల్వకుంట్ల తారక రామారావు అనే నేను..’ అంటూ ప్రజల సమక్షంలో కేసీఆర్ కుమారుడు ప్రమాణస్వీకారం చేయబోతున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. యువరాజు పట్టాభిషేకానికి సంబంధించిన కీలక సమాచారం రేపోమాపో యావత్ తెలంగాణా రాష్ట్ర ప్రజానీకానికి అధికారికంగా తెలిసే అవకాశం వుంది.

తన వారసుడిగా కేటీఆర్‌ను అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకు కేసీఆర్ ఇప్పటికే ఒక తుది నిర్ణయానికి వచ్చినట్టు ‘తొలివెలుగు’కు రూఢీగా అందిన సమాచారం. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అనేక రోజులుగా తన కుటుంబ సభ్యుల నుంచి కేసీఆర్‌కు తీవ్రమైన వత్తిళ్లు వస్తున్నాయ్. అలా చేస్తే అది రాజకీయంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, పార్టీ నిట్టనిలువునా చీలిపోయే అవకాశం వుందని తెలిసినా.. ఇంటి పోరు దృష్ట్యా విధిలేని పరిస్థితులలో కేసీఆర్ దానికి ఒప్పుకున్నట్టుగా సమాచారం.

అంతిమ నిర్ణయం తీసుకున్నాక.. ఇక క్షణం కూడా వృధా చేయకుండా కేసీఆర్.. తన కుటుంబ సభ్యులు, ముఖ్య సమీప బంధువులు, ఆత్మీయులు.. ఇలా అందరినీ సమావేశపరచి తన మనసులో మాట వెల్లడించారని ప్రగతిభవన్ సమాచారం. కేటీఆర్‌ను కొద్దిరోజుల్లో మంచి ముహూర్తం చూసి తన వారసుడిగా తన స్థానంలో కూర్చోపెడుతున్నట్టు కేసీఆర్ వారందరి సమక్షంలో క్లియర్‌కట్ అనౌన్స్‌మెంట్ చేశారని వినవస్తోంది.

ఇలావుంటే, ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవాలని రెండ్రోజుల క్రితమే కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అన్నీ కుదిరితే.. మరో పది రోజుల వ్యవధిలోనే కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణా రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారు.

పార్టీ శ్రేణులతో సింపుల్‌గా కేటీఆర్ అని పిలిపించుకునే కల్వకుంట్ల తారక రామారావు.. ఇటు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా టీఆర్ఎస్ రాజకీయాల్ని నడుపుతూ, అటు పాలనా వ్యవహారాల్లో చక్రం తిప్పుతూ తెలంగాణాలో సెంటర్ ఆఫ్ పవర్ పాలిటిక్స్‌గా నిలిచిన వ్యక్తి. వయస్సు 44 ఏళ్లు. బయో టెక్నాలజీలో ఎమ్మెస్సీ చేసి, అమెరికా వెళ్లి యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి ఎంబీఏ పట్టా అందుకుని అక్కడే స్థిరపడేందుకు ప్రణాళిక వేసుకున్నారు. తండ్రి ఇటు తెలంగాణా ఉద్యమ సారధిగా వుంటూ రాజకీయాల్లో కాక పుట్టిస్తుంటే.. ఆగలేక హైదరాబాద్ వచ్చేసి పాలిటిక్స్‌లోకి దూకారు. 2006 నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భాన్నీ తన రాజకీయ ఎదుగుదలకు నిచ్చెనగా మలుచుకుంటూ ఇటు తండ్రికి తోడుగా నిలిచాడు. నాలుగు పర్యాయాలు సిరిసిల్లా నుంచి శాసనసభకు పోటీ చేసి గెలిచిన కేటీఆర్ తెలంగాణా సిద్దించాక ఏర్పడిన ప్రభుత్వంలో కేబినెట్ పదవి తీసుకున్నాడు. పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. కొడుకు శక్తి సామర్ధ్యాలపై తండ్రికి ఎనలేని గురి. ఆ నమ్మకంతోనే పార్టీలో తన తర్వాత తనంతగా ఎదిగిన మేనల్లుడు హరీశ్‌రావును దూరం పెట్టి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన కుమారుడికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు సంసిద్ధమయ్యారు.

హరీశ్‌రావ్ అడుగులు ఎటు?

టీఆర్ఎస్‌లో కేటీఆర్ యాక్టీవ్ కానంత వరకు నెంబర్ టూ స్థానంలో ఉన్న హరీశ్‌రావ్ రాజకీయ భవిష్యత్ ఏంటన్నదే ఇప్పుడు తెలంగాణాలో గల్లీగల్లీలో వినవస్తున్న చర్చ. కేటీఆర్‌ను తన వారసుడిగా కేసీఆర్ ప్రకటించడంతో అసంతృప్తికి గురయిన హరీశ్‌రావ్.. త్వరలో అతన్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టనున్నారని కూడా తెలియడంతో మరింత ఖిన్నుడయ్యారు. అందుకే, ఇటీవల ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిపించి వారి సమక్షంలో తన మేనమామ కేసీఆర్ అట్టహాసంగా నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. వాస్తవానికి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సాకారం అయ్యిందంటే అందులో ప్రధాన కృషి హరీశ్‌రావుదే. తెలంగాణా రాష్ట్ర తొలి భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావ్ ఈ ప్రాజెక్టు పరిపూర్తికి చేసిన కృషి అంతా ఇంతా కాదు. అలాంటి హరీశ్‌రావు ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరు కాలేదంటే అది అంతకు ముందు ప్రగతి భవన్‌లో తన కుటుంబ సభ్యులతో కేసీఆర్ నిర్వహించిన సమావేశ ప్రభావమే.

కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే.. మరి హరీశ్‌రావ్ ఏం చేస్తారు? కేటీఆర్ కొలువులో ఒక మంత్రిగా కొనసాగేందుకు అంగీకరిస్తారా? లేక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేసీఆర్ తనకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారా? అప్పగిస్తే ఆ బాధ్యత స్వీకరించడానికి హరీశ్‌రావు సిద్ధపడతారా.. ? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానాలు దొరకని సందేహాలే. పరిశీలకులు అంచనా వేస్తున్నట్టు హరీశ్‌రావు అడుగులు ఒకవేళ కాషాయ శిబిరం దిశగా పడితే అది తెలంగాణాలో కొత్త రాజకీయ సమీకరణలకు పునాది అవుతుంది. మరో అస్థిత్వ పోరాటానికి మలుపుగా మారుతుంది.

Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TensionNahiLeneka

    10

  • TheBrahmabull

    9

  • Idassamed

    6

  • RaaoSaab

    4

Popular Days

Top Posters In This Topic

1 minute ago, Idassamed said:

Ganni ganam rojulu Govt untada bro.

Just TG drohi - ane tag line vadutham .. maa trump card vundi kada... vuntadi vuntadi... Emotional gorrelu vunnani rojulu vuntadi

Link to comment
Share on other sites

Just now, TheBrahmabull said:

Just TG drohi - ane tag line vadutham .. maa trump card vundi kada... vuntadi vuntadi... Emotional gorrelu vunnani rojulu vuntadi

Impossible kaka. Kavitha akka sangathi telisindhe kada, Same scene repeat ayye chance lekapoledhu

Link to comment
Share on other sites

Harish gadini kavali ane sidelining...enthala ante janalaki sympathy vachela...so vadu poi inko party pettukuntadu...next elections time ki TRS and Harish part alliance lo govt form chestar..inkokaniki chance iyyakunda...idi antha oka plan prakaram potundi...

Link to comment
Share on other sites

Just now, Idassamed said:

Impossible kaka. Kavitha akka sangathi telisindhe kada, Same scene repeat ayye chance lekapoledhu

ante memu nammam dora... tg pitha family enni yendlu vunna maku vakey... already media in control no - movie industry already in fockets. old city MIM in fockets..

inka em kavale..

Kafitakka maree OA 10ngindi ... adoka indira gandhi types la...

Link to comment
Share on other sites

Just now, RaaoSaab said:

Harish gadini kavali ane sidelining...enthala ante janalaki sympathy vachela...so vadu poi inko party pettukuntadu...next elections time ki TRS and Harish part alliance lo govt form chestar..inkokaniki chance iyyakunda...idi antha oka plan prakaram potundi...

Harish velli BJP lo join aithe better dora ki rod lagathe appudu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...