Jump to content

CBN debbaki digochina Jagan


ariel

Recommended Posts

YCP first statement  - Paid Artists ..asalu ala em jaragaledu

CBN - dadulu cheste chustu urukom, punaravasa sibiram erpatlu .. chalo athamakuru

YCP statements now - badhitulu ki rakshana kalpistam

 

పల్నాడు బాధితుల తరలింపునకు పోలీసుల యత్నం

119008717-800X420.jpg

 

గుంటూరులోని వైకాపా బాధిత పునరావాస కేంద్రానికి ఇవాళ మరోసారి పోలీసులు వచ్చారు. బాధితులతో మాట్లాడి సొంత గ్రామాలకు తీసుకెళ్లేందుకు అదనపు ఎస్పీ చక్రవర్తి తమ సిబ్బందితో వచ్చారు

 

గుంటూరులోని వైకాపా బాధిత పునరావాస శిబిరంలో తలదాచుకుంటున్న వారిని స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు తాము సిద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ చక్రవర్తి బృందం ఇవాళ మరోసారి పునరావాస శిబిరానికి వచ్చి తెదేపా నేతలతో చర్చలు జరిపింది. తెదేపా చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చాకే పోలీసులు స్పందించారని, ఇప్పటికీ తమకు పోలీసులపై నమ్మకం కుదరడం లేదని తెదేపా నేతలు తెలిపారు. కాసేపట్లో పార్టీ అధినేత చంద్రబాబు శిబిరానికి వస్తారని, ఆయనతో మాట్లాడి నిర్ణయం వెల్లడిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో పూర్తి రక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. బాధితుల్ని వాహనాల్లో తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, వాళ్లే ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అదనపు ఎస్పీ చక్రవర్తి తెలిపారు.

పోలీసులు మమ్మల్ని వదిలిపెట్టాక దాడులు చేస్తే కాపాడేదెవరని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ఊర్లలో దింపినా స్థానిక పోలీసులు గిట్టనివ్వరని, వారిపై తమకు నమ్మకం లేదని వారు ఆరోపిస్తున్నారు. తమని ఊర్లో నుంచి గెంటేసిందే పోలీసులని, వారే ఇప్పుడు ఊర్లలో వదిలిపెడతామంటే ఎలా నమ్మాలి? అని అంటున్నారు
 

 

 

Link to comment
Share on other sites

వైకాపా కార్యకర్తలపై బెయిల్ బుల్ తెదేపా కార్యకర్తలపై నాన్ బెయిల్ బుల్ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం కింద కేసులు పెడుతున్నారు. వైకాపా కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే కేసులు పెట్టడం లేదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వైకాపా నేతల దౌర్జన్యాలపై సోషల్ మీడియాలో తమ బాధను వెళ్లగక్కేవారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడి చేసిన ఘటనలు 565 జరిగాయి. వీటిలో దాడులు 201, వేధింపులు 136, అక్రమ కేసులు 52, ఉద్యోగాల తొలగింపు 21, భూకబ్జా 15, ఆస్తుల అన్యాక్రాంతం 66, హత్యలు 10, వ్యక్తిగత దాడులు 28, సోషల్  మీడియా అరెస్టులు 28 కేసులు నమోదయ్యాయి. వైకాపా నేతల వేధింపులతో 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీటిలో ఎక్కువగా గుంటూరు (131), అనంతపురం (112) జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతల దాడులతో 545 కుటుంబాలు గ్రామాలు వదిలిపెట్టి వెళ్లాయి. అత్యధికంగా గురజాల నియోజకవర్గంలోని పిన్నెళ్లిలో 164, మాచర్ల నియోజకవర్గం ఆత్మకూరులో 127, జంగమేశ్వరపాడులో 74 కుటుంబాలు గ్రామాలను వదిలి వెళ్లాయి అని చంద్రబాబు వివరించారు.

వైకాపా బాధితులను హోంమంత్రి పెయిడ్  ఆర్టిస్టులంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారు. బాధితులను అవమానించినందున హోంమంత్రి సుచరిత క్షమాపణ చెప్పాలి. ఎవరు పెయిడ్ఆర్టిస్టులు? ఎవరు మొసలి కన్నీరు కారుస్తున్నారు?అధికారం ఉందని ఇష్టానుసారం చేస్తారా? ఈ అంశంపై సీఎం జగన్ డీజీపీ గౌతమ్ సవాంగ్ సమాధానం చెప్పాలి. నేనేమీ ఆరోపణలు చేయడం లేదు. బాధితుల సమాచారంతో సవివరంగా పుస్తకాలు వేశాం. కేసుల వారీగా వివరాలు ఇచ్చాం. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాలి. ఏకపక్ష నిర్ణయాలతో అణగదొక్కే చర్యలు వద్దు. ఎంత అణగదొక్కాలని చూస్తే అంతగా రెచ్చిపోయే ప్రమాదముంటుంది.బుధవారం చేపట్టే ఆందోళన 100 రోజుల వైకాపా పాలనకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇక మీ ఆటలు  తెదేపా కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా ఉంటుంది అని చెప్పారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...