Jump to content

Ex mp sivaprasad garu


Paidithalli

Recommended Posts

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ బతికే ఉన్నారు.. కానీ,... అపోలో ఆస్పత్రి క్లారిటీ

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది.

 

sivaprasad.jpeg

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ దానికి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ శివప్రసాద్‌కు చికిత్స కొనసాగుతోంది. అయితే, శివప్రసాద్ చనిపోయినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.  దీనిపై న్యూస్‌18కి అపోలో ఆస్పత్రి యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. శివప్రసాద్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలిపింది. శివప్రసాద్‌కు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరం చికిత్సకు సహకరించడం లేదని తెలిసింది. శివప్రసాద్ ఆరోగ్యం విషమించిన విషయం తెలిసిన వెంటనే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెన్నైకి బయలుదేరుతున్నారు.

సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చిన నారమల్లి శివప్రసాద్ రెండుసార్లు చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. 2009, 2014లో ఆయన చిత్తూరు ఎంపీగా ఉన్నారు. స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసనలు తెలిపేవారు. దీంతో ఓ దశలో ఆయన జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు.

శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి, 1951 జూలై 11న అప్పటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. స్వతహాగా రంగస్థల నటుడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.

Link to comment
Share on other sites

@Paidithalli

 

+_(

దీనిపై న్యూస్‌18కి అపోలో ఆస్పత్రి యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. శివప్రసాద్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలిపింది. శివప్రసాద్‌కు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరం చికిత్సకు సహకరించడం లేదని తెలిసింది. శివప్రసాద్ ఆరోగ్యం విషమించిన విషయం తెలిసిన వెంటనే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెన్నైకి బయలుదేరుతున్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, Paidithalli said:

Pulka galla pages lone vocchesariki “vishwasaneeya vargala samacharam” ankunna bedharuu

Aah range lo vasthe thappu needhi kaadhu le eesaariki kshaminchesaam enjoy maadi...

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, Paidithalli said:

Pulkas enti maree intha worst unnaru... bathiki unnadane info kuda ilanti photo petti pedthunnaru

EE6FPojX4AE9NtE.jpg

Orey jaffesh Apollo doctors are not confirmed yet...no worries neekaite good news vastadi le

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...