Jump to content

21 years for Hitech city


Paidithalli

Recommended Posts

ఈ ఫోటో తీసిన టైంలో, ఇక్కడో అద్భుతం పురుడు పోసుకోబోతుంది అని, ఆ ఫోటో ముందు విక్టరీ సింబల్ చూపిస్తున్న ఈ విజనరీకి మాత్రమే తెలుసు.. (ఆయన సహచరులతో సహా అందరూ ఎగతాళి చేసినవారే)

కంప్యూటర్లు కూడు పెడతాయా అని అప్పటి ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర్ ఎగతాళి చేసి, కొండల్లో, గుట్టలో హైటెక్ సిటీ అని బిల్దింగ్స్ కడితే, ఎవడు వెళ్తాడు అని హేళన చేసారు.

కాని ఎక్కడో మారు మూల పల్లెల్లో, సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా, హైదరాబాద్ వెళ్తే, ఐటి ఉద్యోగం చేసుకుని, జీవితంలో సెటిల్ అయిపోవచ్చు అనే భరోసా కల్పించింది, ఈ హైటెక్ సిటీ..

ఎక్కడో ఊరికి ఒకడు ఇంజనీరింగ్ చదుకునే వారు, వారికే ఐటి ఉద్యోగం వస్తుంది అనే స్థాయి నుంచి, సాధారణ డిగ్రీ చదువుకునే వాడు కూడా ఉద్యోగం సంపాదించుకోవచ్చు అనే భరోసా ఈ హైటెక్ సిటీ..

అప్పటికి ఐటి అంటే ఇన్కమ్ టాక్స్ అని మాత్రమే తెలిసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే definition చెప్పింది చంద్రబాబు..

ఆంధ్ర రాష్ట్రంలో, సామాజిక, ఆర్ధిక మార్పులకు కారణం, ఈ హైటెక్ సిటీ.. బెజవాడ లాంటి చోట, ప్రతి ఇంటికి ఒకడు మోటార్ ఫీల్డ్ లో ఉంటే గొప్ప అనుకునే రోజుల్లో, ప్రతి ఇంటికి ఒకడు ఐటి ఉద్యోగం చేస్తే గొప్ప అనే స్థాయికి తీసుకు వచ్చింది ఈ హైటెక్ సిటీ...

కెసిఆర్ లాంటి అసమర్ధులు తెలంగాణాని ఏలుతున్నా, తెలంగాణాకు ఏ లోటు లేదంటే, 50 వేల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్న ఈ ఐటి ఇండస్ట్రీ వల్లే...

హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే... దాన్ని ప్రారంభించింది చంద్రబాబే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటి అభివృద్ధి చేసింది చంద్రబాబే... హైదరాబాద్ ని నెంబర్ 1 చేసింది చంద్రబాబే...

కాని... ఇవేమీ ప్రజలకు గుర్తు ఉండవు.. ప్రజలు ఎమోషన్ లో కొట్టుకుపోతూ ఉంటారు... ఆ ఎమోషనల్ రాజకీయం చంద్రబాబు చెయ్యలేడు కాబట్టే, ఆయన ఇంత ప్రభావితం అయ్యే పనులు చేస్తున్నా, ఒకటికి రెండు సార్లు ఓడిపోయింది...

ఏది ఏమైనా, మా లాంటి మధ్య తరగతి యువతకు, భరోసా ఇచ్చిన హైటెక్ సిటీ కట్టి, ఈ రోజుతో 21 ఏళ్ళు.

Image may contain: one or more people and people standing

  • Upvote 2
Link to comment
Share on other sites

  • Replies 87
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Paidithalli

    16

  • lovemystate

    9

  • Assam_Bhayya

    9

  • kothavani

    5

Popular Days

సరిగ్గా రేపటికి అంటే 23.9.1999
20 సంవత్సరాల క్రితం సైబర్ టవర్స్ ప్రారంభోత్సవం ద్వారా ఐ.టీ ప్రస్థానం ఆరంభం అయింది ఉమ్మ్మడి ఆంధ్రప్రదేశ్ లో.

నాడు దార్శనికుడు వేసిన విత్తనం పెద్ద చెట్టు అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఎందరో యువ ఇంజినీర్ల కు మార్గదర్శకం గా నిలిచింది .

ఆ సందర్భంగా ఆ దార్శనికుని కి......
కృతజ్ఞతతో.......

Image may contain: 1 person, smiling

thankyou cbn 

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

14 minutes ago, AlaElaAlaEla said:

arey sidhu ela unnadu 

 

14 minutes ago, AlaElaAlaEla said:

appude koneyalsindi baaa 

arey napa valley meeku parichayam chesindey nenura.. adi marchipokandi..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...