Jump to content

​​​​​​​ప్రభుత్వం మాది.. సీఎం మావాడు!


BodiGaadu

Recommended Posts

 
  •  విశాఖలో పులివెందుల ముఠా హల్‌చల్‌
  •  భూ వివాదాల సెటిల్‌మెంట్లకు ఒత్తిడి
  •  ఓ పారిశ్రామికవేత్త ఇంటికి వెళ్లి మరీ బెదిరింపు
 విశాఖపట్నంలో పులివెందుల ముఠా హల్‌చల్‌ చేస్తోంది. కోట్ల రూపాయల విలువైన భూ వివాదాలను గుర్తించి, సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని పార్టీలను బెదిరిస్తోంది. ప్రభుత్వం తమదని, చెప్పినట్లు వినకపోతే భూములను దక్కకుండా చేస్తామని భయాందోళనకు గురిచేస్తోంది. గాజువాకలో తాజాగా రెండు భూ వివాదాలను ఈ ముఠా సెటిల్‌మెంట్‌ చేసిందని విశ్వసనీయ సమాచారం. విశాఖ- భీమిలి బీచ్‌రోడ్డులో పర్యాటక ప్రాజెక్ట్‌కు సంబంధించి కొంతమొత్తం వసూలు చేసినట్లు తెలిసింది. తాజాగా సింబియోసిస్‌ టెక్నాలజీస్‌ సీఈఓ ఓరుగంటి నరేశ్‌కుమార్‌ ఇంటికెళ్లి... ఓ భూవివాదం సెటిల్‌మెంట్‌కు ముఠా సభ్యులు ఒత్తిడి చేశారు. నరేశ్‌కుమార్‌ బావ కాట్రగడ్డ లలితేశ్‌ చాలాఏళ్ల క్రితం నగరంలోని మర్రిపాలెంలో ఆరెకరాల యూఎల్‌సీ మిగులు భూమి కొన్నారు. ప్రస్తుతం దానివిలువ రూ.100 కోట్లపైనే ఉంటుంది. ఆ భూమిని ఆనుకుని 200గజాల్లో ఓ ఆక్రమణదారు కుటుంబానికి కూడా నష్టపరిహారం చెల్లించారు. ఈ వివాదం న్యాయస్థానంవరకు వెళ్లడంతో అక్కడ నరేశ్‌కుమార్‌ కుటుంబానికి అనుకూలంగా తీర్పువచ్చింది. ఆ మేరకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. పదేళ్లుగా ఆ భూమి నరేశ్‌కుమార్‌ స్వాధీనంలోనే ఉంది. ఈ వివాదం నడుస్తుండగానే 2013లో హైదరాబాద్‌కు చెందిన బాలకృష్ణ మోహన్‌ అనేవ్యక్తి అవతల పార్టీతో జీపీఏ రాయించుకొని మరో రిట్‌ పిటిషన్‌ వేశారు.
గత ఆదివారం పులివెందుల బృందం నరేశ్‌కుమార్‌ ఇంటికి వచ్చింది. ఒక్కరే వస్తారని చెప్పి, ఐదుగురు రావడంతో ఆయన అవాక్కయ్యారు. ఆ భూమిని తమకు అమ్మడానికి 16మంది ముందుకు వచ్చారంటూ డాక్యుమెంట్లు, జీవోలతో ఓ బౌండ్‌ బుక్‌ ఆయనకు చూపించారు. ఆ వివాదం గురించి మాట్లాడాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేయడంతో ‘అలాగైతే ఆ భూమి మీకు దక్కదు. ప్రభుత్వానికి వెళ్లిపోతుంది’ అని బెదిరించినట్టు నరేశ్‌కుమార్‌ చెబుతున్నారు. పులివెందుల నుంచి వచ్చామని, ఒకరు ఎంపీపీ అని, మరొకరు సర్పంచ్‌(మాజీ) అని, సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులమని పరిచయం చేసుకున్నారని తెలిపారు. ‘మీరు సీఎం పేరు చెప్పి బెదిరిస్తే, ఢిల్లీలో అమిత్‌షా దగ్గరకి వెళతాం’ అని చెప్పడంతో వెళ్లిపోయారన్నారు. పులివెందుల ముఠా బెదిరిపుల విషయాన్ని మంత్రి అవంతి దృష్టికి తీసుకెళ్లానని, సోమవారం సీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. నరేశ్‌కుమార్‌ ఇంటికి వచ్చిన వ్యక్తులు పులివెందులకు చెందిన బాలనారాయణరెడ్డి(రిమ్స్‌ నిర్వహణ కాంట్రాక్టర్‌), వేల్పుల రాము/ లింగాల రామలింగారెడ్డి అని సీసీకెమెరా ఫుటేజీ చూసిన పలువురు చెబుతున్నారు. వారు ఎవరనేది పోలీసులే బయట పెడతారని, ఫుటేజీని వారికే ఇస్తామని నరేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.
 
 
ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలి
విశాఖ ప్రశాంతమైన నగరం. ఇక్కడ పులివెందుల ముఠా అరాచకాలు చేస్తున్న మాట వాస్తవమే. వారు పబ్లిక్‌గా మా ప్రభుత్వం, మా నాయకుడు అంటూ చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వపెద్దలకు సంబంధం ఉందా? లేదా? వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. వీటిని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా దృష్టికి తీసుకెళతాం. ఇక్కడ జరుగుతున్నవి చెప్పాలని ఎప్పటినుంచో సీఎం అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నా ఇవ్వడం లేదు. వెంటనే ఆయన దీనిపై స్పందించాలి.
-విష్ణుకుమార్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...