Jump to content

NSFWH : Baby flushed down toilet


Somedude

Recommended Posts

If it's true, what a depressing one

బాత్రూంలో డెలివరీ.. ఫ్లష్‌ చేసిన యువతి.. ఇంటి ఓనర్‌ ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి..

9/24/2019 11:25:52 AM

 
637049211568409592.jpg
 
 
అప్పుడే పుట్టిన బిడ్డకు నిండిన నూరేళ్లు
పసికందు మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు
 
 
హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): హోమియో వైద్యురాలి నిర్వాకమో.. ఓ మహిళ తెలియని తనమో తెలీదు కానీ... అప్పుడే పుట్టిన చిన్నారి క్షణాల్లో కన్నుమూసింది. సికింద్రాబాద్‌, రసూల్‌పురాలో ఈ నెల 21న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ హృదయ విదారక ఘటనకు సాక్ష్యంగా నిలిచిన మహిళ ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 
రసూల్‌పురా నివాసి బండారి సోనీ అనే మహిళ ఇంటికి ఈ నెల 21న ఉదయం 11.45 గంటలకు ఓ హోమియో క్లినిక్‌కు చెందిన వైద్యురాలు రేణు ఛాత్వాని వచ్చి తలుపు తట్టారు. ఆమెతో పాటు ఓ యువతి (22) కూడా ఉంది. తమ క్లినిక్‌లో బాత్‌రూం లేదని.. బాత్‌రూం వాడుకోడానికి ఆ యువతిని అనుమతించాలని కోరారు. ఆమె ఒప్పుకోగా.. యువతి బాత్‌రూంలోకి వెళ్లి గడియ పెట్టుకొంది. కొంత సేపటి తర్వాత ఓ చిన్నారి ఏడుపు విన్న ఆ ఇంటి ఓనరు ఆశ్చర్యానికి గురై.. ఏమైందంటూ ఒక్కసారిగా గట్టిగా అరిచింది. వాష్‌రూంలో ఉన్న యువతి తీవ్ర రక్తస్రావంతో లోపలి నుంచి బయటకు వచ్చింది. వెంటనే ఆ ఇంటి యజమాని బాత్‌రూంలోకి వెళ్లి చూడగా... అప్పుడే పుట్టిన శిశువు టాయిలెట్‌లో కనిపించింది.
 
 
శిశువును బయటకు తీయమని యువతిని కోరగా.. ఆమె నిరాకరించింది. ఆమెతో వివరాలు సేకరించిన ఇంటి యజమాని సోనీ కుమారులు ఆ యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతోపాటు టాయిలెట్‌లో ఉన్న శిశువును బయటకు తీశారు. వెంటనే బేగంపేట పోలీసులకు సమాచారం ఇవ్వగా యువతిని, పుట్టిన శిశువును గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గర్భం దాల్చిన ఆ యువతి హోమియో వైద్యురాలి వద్దకు వెళితే ఆమె మందులు ఇచ్చినట్లు సమాచారం. దాంతో కడుపు నొప్పి తీవ్ర రూపం దాల్చడంతో పక్కింట్లోకి వెళ్లి వారి బాత్‌రూంను వాడుకునే సౌకర్యం కల్పించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...