Jump to content

High tension in khammam - etc employee sucide attempt


kakatiya

Recommended Posts

డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం:ఖమ్మంలో ఉద్రిక్తత

డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం:ఖమ్మంలో ఉద్రిక్తత

ఖమ్మం: ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. ఖమ్మం ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి  ఇవాళ మధ్యాహ్నం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో చిక్కుకున్న తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన అతని కుమారుడికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరెడ్డికి 80శాతంపైగా కాలిన గాయాలయ్యాయని, హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ఆసమయంలో అక్కడే ఆగివున్న మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఈక్రమంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కార్మికులను చెదరగొట్టారు. కార్మికులకు మద్దతుగా సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ నేతలు, మాజీ ఎమ్మెల్యే సాంబశివరావు ఆందోళనలో పాల్గొన్నారు. ఓవైపు కార్మికుల ఆందోళన కొనసాగుతుండగానే .. మరో ఆర్టీసీ కార్మికుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కార్మికులు అప్రమత్తమై అడ్డుకున్నారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ గత ఎనిమిది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు నెల జీతం రాకపోవడం, సమ్మె నేపథ్యంలో ఆందోళనకుగురై  శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు, కార్మికులు తెలిపారు.
బంద్‌కు పిలుపునిచ్చిన ఐకాస
 ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం ఘటన దృష్ట్యా ఆదివారం ఉమ్మడి ఖమ్మం జల్లాలో బంద్‌ పాటించాలని ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది. జిల్లాలోని ఆరుడిపోల పరిధిలో అన్ని రకాల బస్సులు నిలిపివేయాలని ఐకాస నేతలు ప్రకటించారు.

డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం:ఖమ్మంలో ఉద్రిక్తత

డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం:ఖమ్మంలో ఉద్రిక్తత
 

Link to comment
Share on other sites

Doraki nuvvu 14 hours kashtapadi profit choopiyyaka pothe( even when you are not in management) adhe gathi. Profits choopiyyala lekapothe pranaalu theeeseyyala. Idhe LANGAna.

Link to comment
Share on other sites

56 minutes ago, Sreeven said:

Kani dorasani americalo janalaki baga antinchindi..e madhya baga chestunnaru us lo...

Bathukamma is a TG festival AP lo aadaru ala ani no need to cry if people are playing in US. Others can also participate :). My $0.02

Link to comment
Share on other sites

4 hours ago, karthikn said:

Bathukamma is a TG festival AP lo aadaru ala ani no need to cry if people are playing in US. Others can also participate :). My $0.02

Ikkada evadu crying kadu.. a festival janalaloki teesuku velli dorasani e oka bathukamma devatha  la chupinchi final ga roots lone vadilesinaa videsallo a dutunnaru ani ardham..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...