Jump to content

ఆపరేషన్ రాయల్ వశిష్ట సక్సెస్.. బోటులో మృతదేహాలు..!


Kool_SRG

Recommended Posts

image_default_530085dad89fa27f68.jpg

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దగ్గర గోదావరి నదిలో మునిగిపోయిన బోటు వెలికితీత ఆపరేషన్ మరోసారి విఫలమైంది.. ఆపరేషన్ రాయల్ వశిష్టలో భాగంగా లంగర్లు వేసి బోటును బయటకు తీసే ప్రయత్నం చేయగా.. రోప్‌తో పాటు బోటు పై కప్పు మాత్రమే బయటకు వచ్చింది. అంతకు ముందు నీటిలోకి మునిగి బోటుకు లంగరు వేశారు డీప్ వాటర్ డైవర్స్.. బోటు బరువు ఎక్కువగా ఉండడంతో.. బరువు తట్టుకోలేక రోప్‌తో పాటు బోటు పై కప్పు ఊడివచ్చింది. ఆపరేషన్‌లో కొంత పురోగతి సాధించినా.. రోజుకో భాగం చొప్పున బయటకు వస్తుండడంతో.. బోటు మొత్తం బయటకు తీసేది ఎప్పుడు అనే చర్చ సాగుతోంది.

అయితే, ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం స్థాయి మాత్రం బోటు వెలికితీతకు అనుకూలంగా ఉందంటున్నారు.. వరుసగా ఐదోరోజు నీటిమట్టం తగ్గడం అనుకూలించే విషయంగానే చెబుతున్నారు. అయితే, బోటు గోదావరిలో ఏటవాలుగా మునిగిందని అధికారులు చెబుతున్నారు.. మునిగిపోయిన బోటు ముందు భాగంగా గోదావరిలో 40 అడుగుల లోతులో వెంట.. వెనక భాగం 70 అడుగుల లోతులో ఉందనే అంచనాకు వచ్చారు. 

Link to comment
Share on other sites

7 minutes ago, Kool_SRG said:

Mostly one or two days lo boat ni bayataku teesesthaaru anukunta... Water flow taggindi scuba divers are in action..

2 hours lo teesthanu annodu etu poyado

Link to comment
Share on other sites

oka roju grill, oka roju top, a next day oka steering wheel, a next 2 days lo rendu passenger hand bags, extended days of work ki extra payment, kaani   

Link to comment
Share on other sites

20 hours ago, Assam_Bhayya said:

oka roju grill, oka roju top, a next day oka steering wheel, a next 2 days lo rendu passenger hand bags, extended days of work ki extra payment, kaani   

They seem to have pulled out the boat...

Link to comment
Share on other sites

image_default_530595daed752af6a3.jpg

 

గోదావరి నదిలో తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటకు తీశారు. 38 రోజుల పాటు గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట ఇవాళ బయటకు వచ్చింది. దీంతో ఆపరేషన్ రాయల్ వశిష్ట సక్సెస్ అయ్యింది. బోటు వెలికితీతలో ధర్మాడి సత్యం బృందం కీలకపాత్ర పోషించింది.. డీప్ డైవర్లు నీటి అడుగు భాగం నుంచి మునిగిపోయిన బాటోకు లంగర్లు వేసి.. రోప్‌ సాయంతో బోటును పైకి తెచ్చారు. ఈ ఆపరేషన్ మొత్తం కాకినాడ పోర్టు అధికారికి పర్యవేక్షణలో జరిగింది. 

మరోవైపు బోటులో మృతదేహాలు బయటపడుతున్నాయి.. బోటు పూర్తిగా ధ్వంసమైపోగా.. బోటులో దాదాపు ఐదు మృతదేహాల వరకు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అయితే, బోటు పూర్తిగా ఒడ్డుకు చేరితేగానీ.. మృతదేహాలు ఎన్ని ఉన్నాయి అనేది తేలదంటున్నారు. ఇక, మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో.. మృతులు ఎవరనేది గుర్తించడం కష్టంగా మారింది. కాగా, గత నెల 15వ తేదీన కచ్చలూరు దగ్గర గోదావరిలో ఈ బోటు మునిగిపోయింది.. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. 39 మంది మృతిచెందారు. మరికొన్ని మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. 

Link to comment
Share on other sites

20 minutes ago, Kool_SRG said:

They seem to have pulled out the boat...

ha bro, very sad for their families, may their souls rest in peace, unlucky guys #$1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...