Jump to content

Papam vayya ...ithanu chesindhi tappa right a or god tappu chesada?


DBgirl

Recommended Posts

 
 
mobile_logo.png
sakshi_tv.png

Homeవీడియోలుసినిమాక్రీడలుబిగ్ బాస్ 3బిజినెస్ఫ్యామిలీఫోటోలుట్రెండింగ్

శ్రీనవ్య జ్ఞాపకాలు మరువలేక...

25 Oct, 2019 10:06 IST|Sakshi
fb.png
google+.png
twitter.png
whatsapp.png
pinterest.png
linkedin.png
suicide.jpg?itok=xaKBBObY చందు(ఫైల్‌) శ్రీయోషిత (ఫైల్‌) శ్రీనవ్య (ఫైల్‌)

కుమార్తెను కడతేర్చి భర్త ఆత్మహత్య 

మండపేటలో ఘోరం  

తీవ్ర జ్వరంతో రెండు వారాల కిందట భార్య మృతి 

చిన్ననాటి నుంచి కష్టాలే జీవితంగా గడిపిన ఆ అభాగ్యునికి భార్య రాక కొత్త జీవితం వచ్చినట్లైంది. భర్తకు ఆమె చేదోడువాదోడుగా ఉంటూ వ్యాపారాభివృద్ధికి తోడ్పాటును అందించింది. వారి అన్యోన్య దాంపత్యంలో చిన్నారి శ్రీయోషితకు జన్మనిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు తీరి సాఫిగా సాగిపోతున్న వారి జీవితాన్ని విధి ఒక్కసారిగా వంచించింది. డెంగీ లక్షణాలతో భార్య మృతి చెందగా అప్పటి నుంచి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. తను మరో పెళ్లి చేసుకున్నా తన చిన్నారికి తల్లి ప్రేమ దక్కదని, తాను పడ్డ కష్టాలు తన కుమార్తె పడకూదని భావించాడు. తన భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేక, ఆమె జ్ఞాపకాల నుంచి బయటపడలేక, భార్య ముందు వెళ్లిపోయింది తర్వాత మేమిద్దరమంటూ తమ మూడేళ్ల చిన్నారిని కడతేర్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండపేటలో గురువారం సంచలనం కలిగించిన ఈ ఘోరం అందరినీ కలచివేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  

తను లేని దగ్గర నుంచి నాకు ప్రతి క్షణం నరకంలాగే ఉంది. మా పెళ్లయిన దగ్గర నుంచి తల్లిలా, స్నేహితురాలిలా, భార్యలా అన్ని విషయాల్లో సహకరించేది. ఇప్పుడు ఒకేసారి ఆ ముగ్గురు (తల్లి, స్నేహితుడు, భార్య) దూరం కావడంతో నాకు బతుకు ఎందుకు అనిపిస్తుంది. నాతో ఉన్నది నాలుగేళ్లు కానీ తను రాకముందు నా జీవితంలో ఏం జరిగిందో మర్చిపోయేలా చేసింది. ఇప్పుడు తనతో ఉన్న క్షణాల్లో తప్ప మరేమీ గుర్తుకు రావడం లేదు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటే ఇంకో భార్య వస్తే ఇవన్నీ మర్చిపోయి ఉండవచ్చు అంటారు. కానీ నాకు భార్య వస్తే నా కూతురుకి తల్లి రాదు. నాకు పిల్లలు పుడితే నా కూతురు మరో నవ్యలా తయారవుతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఈ కఠిన నిర్ణయం. తను ముందు వెళ్లిపోయింది తర్వాత మేమిద్దరం. ఎన్నో చెప్పాలని ఉంది, ఎన్నో పంచుకోవాలని ఉంది. కాని నా ప్రాణానికి ప్రాణం నాతో లేకపోయేసరికి ఏమీ తెలీట్లేదు. ఏమీ అర్ధం కావడం లేదు. నా కోసం కష్టపడిన నా స్నేహితులు అందరికీ నా క్షమాపణలు. అందరూ నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను.    – చందు 
మండపేటలో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటనలో కూతురిని కడతేర్చి ఆత్మహత్యకు పాల్పడిన చందు తన సూసైడ్‌ నోట్‌లో రాసిన వేదన. 

సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన బాదం చందనకుమార్‌ (చందు) తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకోగా పదేళ్ల వయస్సులోనే తన చెల్లెలు పుష్పలతను తీసుకుని చందు మండపేటలోని దగ్గర బంధువుల ఇంటికి వచ్చేశాడు. బంధువుల సహకారంతో చదువు ప్రారంభించారు. కొంతకాలానికి దగ్గరి బంధువు మృతి చెందగా ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తూ చెల్లెలకి అన్నీ తానయ్యాడు. పెంచి పెద్దిచేసి కోరుకొండ మండలానికి చెందిన యువకునితో వివాహం జరిపించాడు. తాను స్థానిక నాళం వారి వీధిలో ఫ్లెక్సీ ఫ్రింటింగ్‌ ప్రారంభించి వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు. 2015లో జిల్లాలోని రావులపాలెం శివారు కొమరాజులంకకు చెందిన కంచర్ల శ్రీనవ్యతో వివాహమైంది. పేద కుటుంబానికి చెందిన శ్రీనవ్య తండ్రి చిన్నతనంలో మృతిచెందగా ఆమె దాతల సహకారంతో ఎంటెక్‌ చదువుకుంది.
suicide2.jpg


ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన చందు, పక్కనే చిన్నారి మృతదేహం
వ్యాపార నిర్వహణలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాపారాభివృద్ధికి తోడ్పాటును అందించేది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా మూడేళ్ల కుమార్తె శ్రీయోషిత ఉంది. చిన్ననాటి నుంచి పడ్డ కష్టాలు మరిచి పోయి ఆనందంగా సాగిపోతోంది. కుటుంబంతో కలిసి పట్టణంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న చందు మండపేట రూరల్‌లో ఇటీవల సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు స్థలం కొనుగోలు చేసుకున్నాడు. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాన్ని డెంగీ జ్వరం అతలాకుతలం చేసింది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఈ నెల 5వ తేదీన రాజమహేంద్రవరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో శ్రీనవ్య కన్నుమూసింది. ఆమె ఆశయం మేరకు చందు ఆమె కళ్లను దానం చేశాడు. నాటి నుంచి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్న చందు భార్య లేని జీవితం ఊహించుకోలేకపోయాడు. మరో వివాహం చేసుకున్నా తన కుమార్తెకు తల్లి ప్రేమ దక్కదని, చిన్నతనంలో తాము పడ్డ ఇబ్బందులు తన కుమార్తె పడాల్సి వస్తుందని భావించి ఈ ఘెరానికి పాల్పడ్డాడు.
chandu.jpg
నా భార్య వద్దకే మేమిద్దరం వెళ్లిపోతున్నామంటూ లేఖ రాసి తన కుమార్తెను కడతేర్చి, తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో భార్య చీరను ముఖానికి కట్టుకుని మెడకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కోరుకొండలో నివాసముంటున్న సోదరి పుష్పలత ఉదయం నుంచి పలుమార్లు ఫోన్‌ చేసినా చందు ఫోన్‌ ఎత్తకపోవడంతో పక్క వ్యాపారికి చెప్పగా అతను ఇంటికి వచ్చి చూసే సరికి ఈ ఘోరం వెలుగుచూసింది. చందు ఉరివేసుకుని ఉండటం, పక్కనే అభంశుభం తెలీని చిన్నారి శ్రీయోíÙత విగతజీవిగా పడి ఉండటం చూపరుల హృదయాలను కలచివేసింది. తమ అన్యోన్య దాంపత్య, తాను పడుతున్న ఆవేదన, తనకు సంబంధించిన స్థలం, వ్యాపారంలోని సామగ్రి, ఎల్‌ఐసీ ఇన్సూరెన్స్‌ సొమ్ములు తన తండ్రి, సోదరి, తన భార్య తల్లికి చెందాలనే విషయాలను వివరిస్తూ చందు రాసిన ఆరు పేజీల సూసైడ్‌ నోట్‌ను సంఘటన స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
suicide-note.jpg
చందు రాసిన సూసైడ్‌ నోట్‌
భార్యకు మాట ఇచ్చినట్టుగానే... 
నేను ముందు పోతే ఏం చేస్తావు అని తన భార్య అన్నప్పుడు... నీ వెంటే నేను వచ్చేస్తానని చెబితే అలా కాదు కనీసం నా దినం కూడా చేయవా అని అడిగేది. చేశాక రా అనేది. అది సరదాకో నిజంగానో తెలీదు కానీ ఇప్పుడు తనే ముందు వెళ్లిపోయింది. అందుకే తన కోరిక ప్రకారం నా శక్తి మేర ఆమె కార్యక్రమాన్ని పూర్తి చేసి అప్పగించాల్సిన వన్ని అప్పగించేసి నేను తన వద్దకి వెళ్లిపోతున్నానంటూ చందు లేఖలో పేర్కొనడం అందరినీ కలచివేస్తోంది.
chandu2.jpg
సచివాలయ ఉద్యోగినిగా... 

ఇటీవల మృతి చెందిన శ్రీనవ్య సెప్టెంబరులో జరిగిన సచివాలయ ఉద్యోగుల పరీక్షకు హాజరైంది. సెకెండ్‌ లిస్ట్‌లో తన భార్య పేరు వచ్చినట్టు బుధవారం చందు చెప్పాడని స్థానికులు అంటున్నారు. తన భార్య జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నానని, మండపేటలో వ్యాపారం మానేసి కుమార్తెను తీసుకుని కోరుకొండలోని తన సోదరి ఇంటికి వెళ్లిపోయి ఏదో పనిచేసుకుంటానని సన్నిహితుల వద్ద చెప్పేవాడని అంటున్నారు. కాగా ఇంతలోనే ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఊహించలేదని స్థానికులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. మండపేట సీఐ నాగ మురళీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

చదవండి: నా భార్య వద్దకే వెళ్లిపోతున్నాం..

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter 
తాజా సమాచారం కోసం   Sakshi App   లోడ్ చేసుకోండి
Load Comments 
సంబంధిత వార్తలు
default_295x200.jpg

ధర్మాడి సత్యం బృందంపై కలెక్టర్‌ ప్రశంసలు

default_295x200.jpg

కేంద్రం ఇస్తున్న బడ్జెట్‌ సరిపోదు : ఎంపీ

default_295x200.jpg

అనపర్తి మాజీ ఎమ్మెల్యే మృతి

default_295x200.jpg

మట్టి మూకుడు రొట్టె రుచే వేరు..

మరిన్ని వార్తలు
default_295x200.jpg

కోర్టులో లొంగిపోయిన అచ్చెన్నాయుడు

default_295x200.jpg

రూ. 7లక్షల నగదుకు అరకిలో బంగారు నాణేలు

default_295x200.jpg

ఆ బస్సు అటు ఎందుకు వచ్చినట్టు? 

default_295x200.jpg

షార్ట్‌ సర్క్యూట్‌తో పేలిన టీవీ

default_295x200.jpg

హయత్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

default_295x200.jpg

కన్నకొడుకుని కాల్చిచంపాడు..

default_295x200.jpg

వైరాలో ముసుగుదొంగ 

default_295x200.jpg

మెట్రోలో రూ. కోటి తీసుకెళుతూ..

default_295x200.jpg

టార్గెట్‌ ఏటీఎం

default_295x200.jpg

టిక్‌–టాక్‌పై మోజుతో...

default_295x200.jpg

ప్రియురాలి కారుతో ప్రియుడు పరారీ

default_295x200.jpg

పోలీసుల అదుపులో కోడెల బినామీ! 

default_295x200.jpg

టీవీ సీరియల్‌ కెమెరామెన్‌ ఆత్మహత్య

default_295x200.jpg

సైనేడ్‌ కిల్లర్‌కు మరణశిక్ష

default_295x200.jpg

నా భార్య వద్దకే వెళ్లిపోతున్నాం..

default_295x200.jpg

బస్టాండ్‌లో నాలుగేళ్ల చిన్నారిపై.. 

default_295x200.jpg

అక్రమ రవాణాపై ప్రభుత్వ కొరడా..

default_295x200.jpg

భీతిల్లుతున్న మన్యం

default_295x200.jpg

ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ...

default_295x200.jpg

బండ్ల గణేష్‌కు రిమాండ్‌, కడప జైలుకు తరలింపు

default_295x200.jpg

దర్శకుడిపై హీరోయిన్‌ ఫిర్యాదు

default_295x200.jpg

వారిని గోదారమ్మ మింగేసిందా?

default_295x200.jpg

తప్పుడు పనులు చేయిస్తున్నారు..

default_295x200.jpg

విప్రోలో టీం లీడర్‌గా హరీష్‌ బిల్డప్‌..

default_295x200.jpg

కూతురి వెంటే తల్లి..

default_295x200.jpg

ర్యాగింగ్‌కు రాలిన విద్యాకుసుమం

default_295x200.jpg

చితిని పేర్చుకుని వృద్ధుడు ఆత్మాహుతి

default_295x200.jpg

ప్రిన్సిపాల్‌ సహా 10 మందిపై కేసు

default_295x200.jpg

మందలించారని విద్యార్థుల బలవన్మరణం 

 
default_295x200.jpg

సీఎం జగన్‌పై ఆర్‌.నారాయణమూర్తి ‍ప్రశంసలు

default_295x200.jpg

బిగ్‌బాస్‌: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!

default_295x200.jpg

మహాభారతం : ద్రౌపది పాత్రలో దీపిక

default_295x200.jpg

స్టార్‌ హీరో బర్త్‌ డే: ఆటపట్టించిన భార్య!

default_295x200.jpg

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

default_295x200.jpg

కృష్ణగిరిలో హీరో ఫ్యాన్స్‌ బీభత్సం

Link to comment
Share on other sites

Just now, Biskot2 said:

intha chadhavadam chala kastam ..

matter in 3 lines lo cheppu..

He was brought up motherless and affection less

after papa birth,  wife died because of dengue

He did not want same future for his daughter (mother less), so killed himself and papa 

  • Sad 1
  • Upvote 2
Link to comment
Share on other sites

15 minutes ago, Scada said:

He was brought up motherless and affection less

after papa birth,  wife died because of dengue

He did not want same future for his daughter (mother less), so killed himself and papa 

When he born ..valla amma cachi poyindhi. Valla nanna vere pelli chesukunadu.

So he took care of his sister since he was 5 with help of relatives.

After marriage he felt life is back but again wife expired and he dont wana remarry as his daughter will be alone. And again single father is not possible from myside.

Letter lo rasadu oka point ...

Sagam life gadichaka malli 1 nunchi start cheyali ante kastam ani. Papam yentha kastapdi e decision tesukunado.

To be honest cant comment on daughter part but he did himself right decision ...life long kasta pade life vuna okate leka poyina okate.

  • Sad 1
Link to comment
Share on other sites

తాను దోమలపై దండయాత్ర కార్యక్రమం పెడితే దోమలపై యుద్ధమా? అంటూ పారిశుద్ధ్య చర్యలను అపహాస్యం చేశారని మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. అప్పుడు ప్రజాచైతన్యాన్ని తప్పుపట్టిన వాళ్లు.. ఈ రోజు ఒక్క దోమను కూడా చంపలేని స్థితిలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. డెంగీ మహమ్మారికి ప్రజలను బలి పెడుతున్నారని వ్యాఖ్యానించారు. నమ్మిన ప్రజల పట్ల ప్రభుత్వం ఇంత బాధ్యతారాహిత్యంతో ఉండకూడదని చంద్రబాబు సూచించారు.
 
 
భార్య డెంగీతో మరణిస్తే బాధ తట్టుకోలేని భర్త కన్న కూతురిని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డారంటే తప్పు వైసీపీ ప్రభుత్వానిది కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలు ఇంత బాధపడుతున్నప్పుడు వారికి అండగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నేత ఉండాలన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాడాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.
Link to comment
Share on other sites

2 hours ago, Scada said:

He was brought up motherless and affection less

after papa birth,  wife died because of dengue

He did not want same future for his daughter (mother less), so killed himself and papa 

em chettanakoduku ra babu.....there are thousands waiting to adopt babies and this guy killed her  

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, Hydrockers said:
తాను దోమలపై దండయాత్ర కార్యక్రమం పెడితే దోమలపై యుద్ధమా? అంటూ పారిశుద్ధ్య చర్యలను అపహాస్యం చేశారని మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. అప్పుడు ప్రజాచైతన్యాన్ని తప్పుపట్టిన వాళ్లు.. ఈ రోజు ఒక్క దోమను కూడా చంపలేని స్థితిలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. డెంగీ మహమ్మారికి ప్రజలను బలి పెడుతున్నారని వ్యాఖ్యానించారు. నమ్మిన ప్రజల పట్ల ప్రభుత్వం ఇంత బాధ్యతారాహిత్యంతో ఉండకూడదని చంద్రబాబు సూచించారు.
 
 
భార్య డెంగీతో మరణిస్తే బాధ తట్టుకోలేని భర్త కన్న కూతురిని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డారంటే తప్పు వైసీపీ ప్రభుత్వానిది కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలు ఇంత బాధపడుతున్నప్పుడు వారికి అండగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నేత ఉండాలన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాడాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.

matter ki sambhandam undadu manaki.. mana munja edupu mande.

jai crosstian 

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, bostonBOSS said:

matter ki sambhandam undadu manaki.. mana munja edupu mande.

jai crosstian 

Telugu vacha uncle niku

Telugu vaste aa news chaduvuko

Ahh ledu ma..dream Machine meda anthe untam ante ni karma anukoni vadilestam 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...