Jump to content

India-Square-in-New-Jersey-littered-with-trash-During-this-Diwali


tamu

Recommended Posts

వెలుగు జిలుగుల పండుగ దీపావళి సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాలో మనవాళ్లు చేసిన చర్య...సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా న్యూజెర్సీలోని ఇండియా స్క్వేర్ దగ్గర భారీగా జనాలు చేరి ధూంధాంగా టపాసులు కాల్చి ఎంజాయ్ చేశారు. కానీ క్రాకర్స్ కాల్చాక ఆ చెత్తనంతా ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వీధుల్లో ఖాళీ క్రాకర్స్ బాక్సులు - పేల్చాక ఎగిరిపడిన చెత్త అంతా పడిపోయింది. ఆ చెత్తను న్యూజెర్సీ పోలీసులు శుభ్రం చేయాల్సి వచ్చింది. వాళ్లు వాటర్ కెనాల్స్ తో రోడ్లు క్లీన్ చేసిన వీడియోను ఓ భారతీయురాలు పోస్ట్ చేయగా...ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై తోటి ఇండియన్సే మనవాళ్లను విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయంలో మరో కోణాన్ని సైతం పలువురు ప్రస్తావిస్తున్నారు.

 



భారతీయురాలినని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నానంటూ  సంధ్య అనే యువతి ట్విటర్ లో షేర్ చేసింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ...పండుగ చేసుకుని చెత్త ఇలా వదిలేసి పోవడం షేమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మన వాళ్లందరికీ  శుభ్రత మీద క్లాసులు తీసుకోవాలంటూ మరికొందరు ట్విట్లు చేశారు. తాను యూకేలోనూ ఇలాంటి ఘటనలు చూశానని - స్వచ్ఛతపై పట్టకుండా వ్యవహరించడం దారుణమని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై మరికొందరు ఇంకో వాదన వినిపిస్తున్నారు. విదేశాల్లో మన పండుగల నిర్వహణ పట్ల మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాల్సిందే. అన్నింటికంటే ముఖ్యంగా...స్థానిక పరిస్థితులు - పర్యావరణం దృష్టిలో ఉంచుకోవాలి. స్థానికులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం ఏమాత్రం సబబు కాదు. అదే సమయంలో..పండుగ ద్వారా శబ్ధ వాయు కాలుష్యం - అక్కడి వాతావరణాన్ని దరిద్రంగా తీర్చిదిద్దడం కూడా సరికాదు.

Link to comment
Share on other sites

oka sari beach lo choodu veella party lu ayyaka ela untayo.. inka worst with beer cans and bottles... so not just us, its everyone 

but it would be nice for our people to follow the japanese and clean up after the event, atleast some of it

Link to comment
Share on other sites

Just now, chittimallu_14 said:

oka sari beach lo choodu veella party lu ayyaka ela untayo.. inka worst with beer cans and bottles... so not just us, its everyone 

but it would be nice for our people to follow the japanese and clean up after the event, atleast some of it

india lo clean ga unde public place okati cheppu ?

Link to comment
Share on other sites

6 minutes ago, No_body_friends said:

india lo clean ga unde public place okati cheppu ?

whats your point... I never said Indians are top in keeping the surroundings clean 

Link to comment
Share on other sites

3 minutes ago, chittimallu_14 said:

whats your point... I never said Indians are top in keeping the surroundings clean 

akkada matladuthundhi indians being filthy

inkevado beach ni filthy chesadu anedhi cover drive ki saripodhu

 

Link to comment
Share on other sites

Just now, No_body_friends said:

akkada matladuthundhi indians being filthy

inkevado beach ni filthy chesadu anedhi cover drive ki saripodhu

 

topic is about place being trashy after an event... cover drive endi ra item ga... bore off you muppet 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...