Jump to content

Jagan-Cabinet-Meeting-Key-Decisions


tamu

Recommended Posts

1. జగనన్న అమ్మఒడి పథకానికి మంత్రి వర్గం ఆమోదం:

 



•  దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 1వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్మీడియట్) చదువుతున్న పిల్లల  తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి పథకం కింద ఏటా రూ.15వేలు జమ చేయాలని కేబినెట్ నిర్ణయం

•  అర్హులైన ప్రతి తల్లికి పథకం వర్తింపు చేయాలన్న కేబినెట్

•  పిల్లలకు తల్లిలేని పక్షంలో సంరక్షకులకు నగదు అందజేసేందుకు కేబినెట్ నిర్ణయం

•  రెసిడెన్షియల్ స్కూల్స్ - కాలేజీలు సహా ప్రభుత్వ పాఠశాలలు - ప్రైవేట్ పాఠశాలలు - ఎయిడెడ్ స్కూళ్లు - అన్ ఎయిడెడ్ స్కూళ్లు - జూనియర్ కాలేజీల్లో చదువుతున్న పిల్లలకు పథకం వర్తింపు

•  అమ్మఒడి కోసం తెల్లరేషన్ కార్డు -  ఆధార్ కార్డు తప్పనిసరి. లేని పక్షంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న  అర్జీ దారులకు కూడా పథకం వర్తించేలా నిర్ణయం. ఆర్టీజీఎస్ డేటా లో అప్ లోడ్ అయి ఉన్నా స్వీకరించాలని నిర్ణయం.

•  వీధిబాలలు - అనాథ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే వారికి పథకాన్ని వర్తింపు చేసే విషయమై సంబంధిత శాఖను సంప్రదించాల్సి ఉంటుంది

•   ప్రతి ఏటా జనవరిలో నేరుగా అన్ ఇన్ కంబర్డ్ బ్యాంక్ అకౌంట్లలో జమ

•   స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక వెబ్ సైట్

•   జగనన్న అమ్మఒడికి రూ.6.455 కోట్ల నిధులు ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఖర్చు  చేయనుంది.

2.    ఇతర రాష్ట్రాల్లో  వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు :

•    నవంబర్ 1 నుండి హైదరాబాద్ - చెన్నై - బెంగుళూరు రాష్ట్రాల్లో గుర్తించిన 130 ఆస్పత్రుల్లో  వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సూపర్ స్పెషాల్టీ సేవలు అందించాలని మంత్రి వర్గం నిర్ణయం

•    తలసేమియా - సికిల్ సెల్ ఎనీమియా - హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10 వేలు పెన్షన్ - పక్షవాతం - కండరాల క్షీణత - కదల్లేని స్థితిలో మంచాన పడ్డవారికి - బోధకాలు - కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 3 - 4 - 5 దశల్లో ఉన్నవారికి నెలకు రూ.5 వేలు అందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

•    వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం విశ్రాంతి సమయంలో రోగులు కోలుకునే వరకు డాక్టర్ నిర్ధేశించిన ప్రకారం రోజువారీ అయితే రోజుకు రూ.225 - లేదా నెలవారీ అయితే నెలకు రూ.5 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం

•    ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.16వేలు వేతనం పెంపు

3.    అదనపు పౌష్ఠికాహారం  అందించాలని కేబినెట్ నిర్ణయం:

•    6 నెలల నుంచి 6 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు - గర్భవతులకు - బాలింతలకు అదనపు పౌష్టికాహారం అందించాలని కేబినెట్ నిర్ణయం

•    పౌష్ఠికాహార లోపం - రక్తహీనత అధికంగా ఉన్న 77 మండలాల్లో అమలుకు మంత్రివర్గం ఆమోదం

•    కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పౌష్టికాహారానికి నిధులు అందించనుంది.

•    రాష్ట్రంలో అత్యధిక శాతం పౌష్ఠికాహార లోపం - రక్తహీనత  ఉన్న పిల్లలకు అదనంగా రూ.128 కోట్లు ఇవ్వాలని నిర్ణయం. దీనిపై వెచ్చించేది మొత్తం రూ. 305 కోట్లు కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.47 కోట్లుగా ఉంది.

4.    కృష్ణా - గోదావరి నదుల పరిధిలోని కాల్వల శుద్ధి మిషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం

•    కృష్ణా - గోదావరి కాల్వల శుద్ధి మిషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం

•    కృష్ణా - గోదావరి కాల్వల శుద్ధి మిషన్ కు సీఎం ఛైర్మన్ గా - సీఎస్ వైస్ ఛైర్మన్ గా ఉంటారు. ఇందులో పురపాలక పరిపాలన - పట్టణాభివృద్ధి శాఖ - పంచాయతీరాజ్ - పర్యావరణం - అటవీ శాఖ - శాస్త్ర సాంకేతిక శాఖ - జలవనరుల శాఖ మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు - వివిధ స్వచ్ఛంధ సంస్థలు (ఎన్జీవో) సభ్యులుగా ఉంటారు.

•    కృష్ణా - గోదావరి నదుల పరిధిలోని కాల్వల శుద్ధి మిషన్ ఏర్పాటుకుగానూ ఉభయగోదావరి జిల్లాలు - కృష్ణా - గుంటూరు జిల్లాల్లో మురుగు కాలువలు - పంటకాలువలు కలిసేవి 130 గా గుర్తించారు.

•    సివరేజ్ ప్లాంట్స్ ద్వారా మురుగు నీటిని శుద్ధి చేసి మంచి నీటి కాలవల్లో కలిపేలా చేయనున్నారు.

5.    షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు:

•    షెడ్యూల్ కులాల్లోని మాల - మాదిగ - రెల్లీ ఇతర ఉప కులాలకు వేరువేరుగా 3 కార్పొరేషన్ లు ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం

•    ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా నిర్ణయం

6.    హజ్ - జెరూసలెం యాత్రికులకు ఆర్థికసాయం పెంపు :

•    హజ్ - జెరూసలెం  వెళ్తున్న యాత్రికుల కోసం గతంలో ఇస్తున్న  ఆర్థిక సాయాన్ని పెంచేందుకు మంత్రి వర్గం నిర్ణయం

•    వార్షికాదాయం రూ.3 లక్షల లోపు ఉన్న వారికి రూ.60 వేలు - 3 లక్షలు పైబడిన వారికి 30 వేలు రూపాయల ఆర్థికసాయాన్ని అందించాలని నిర్ణయం

7.    ఎం.శాండ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు అందించేందుకు మంత్రివర్గం ఆమోదం

•    ప్రస్తుతం కంకర ఉత్పత్తి కేంద్రాల్లో రానున్న 6 నెలల కాలంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆర్ శాండ్ - ఎం శాండ్ ఉత్పత్తికి ముందుకు వచ్చిన యజమానులకు 50 లక్షల నుండి కోటిన్నర వరకు మిషన్ ల కొనుగోలుకై పావలా వడ్డీకే రుణాలు మంజూరు కేబినెట్ ఆమోదం.

•    ఉత్పత్తి చేసిన ఇసుకను 50 కి.మీ పరిధిలో ఉన్న కేంద్రాల నుండి ప్రభుత్వ అవసరాల నిమిత్తం 20 శాతానికి వినియోగానికి కేబినెట్ ఆమోదం

8.    వివిధ రంగాల ద్వారా ప్రజా సేవ అందించే ప్రతిభావంతులకు వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు :

•    వైద్య - విద్య - సాంకేతిక విద్య - సామాజిక సేవ - పరిశ్రమలు - సేవా రంగం - వాణిజ్యం - సాహిత్యం - కళా రంగాలు - క్రీడలలో ప్రతిభ చూపిన వారికి ప్రతి ఏటా జనవరి 26న 50 మంది - ఆగస్ట్ 15న 50 మంది మొత్తం 100 మంది ప్రతిభావంతులకు  వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో పాటు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం

9.    అభ్యంతరాలు లేని అక్రమ కట్టడాల క్రమబద్ధీరణ:

•    అభ్యంతరాలు లేని అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

•    దారిద్ర్య రేఖకు దిగువన ఉండి 300 చదరపు గజాలలోపు స్థలంలో 100 చదరపు గజాల్లో నిర్మాణం చేపట్టిన ఇళ్లను క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయం. వీరి ఇళ్లను రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయం

•    దారిద్ర్య రేఖకు ఎగువన ఉండి 0 గజాల నుండి 300 చదరపు గజాల వరకు గ్రామీణ - పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను మార్కెట్ విలువననుసరించి కలెక్టర్ నిర్ణయించిన ప్రక్రియ ద్వారా క్రమబద్ధీకరించాలని నిర్ణయం

•    300 చదరపు గజాలలో ఉన్న ఇళ్లను రెగ్యులరైజ్ చేసిన 5 సంవత్సరాల వరకు అమ్ముకునే హక్కు ఉండదని - 5 యేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు పొందుతారన్న కేబినెట్

•    గతంలో పేదలకు మంజూరు చేసిన స్థలాలను మరొక పేదలు కొనుగోలు చేసిన యెడల వాటిని కూడా క్రమబద్ధీకరించుటకు కేబినెట్ ఆమోదం

10.    రాష్ట్రంలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు :

•    రాష్ట్రవ్యాప్తంగా  147 గ్రామీణ నియోజకవర్గాల్లో - 13 జిల్లా కేంద్రాల్లో - 4 రీజినల్ సెంటర్లలో అగ్రి ల్యాబ్ లు ఏర్పాటు

•    అగ్రి ల్యాబ్ లు ఏర్పాటు ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు - భూసార పరీక్షలు - ఎరువుల కొనుగోలు వంటి విషయాల్లో ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు కేబినెట్ ఆమోదం

•    9 కోస్తా జిల్లాల్లో 46 ఆక్వా ల్యాబ్ లు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

11.    న్యాయవాదుల సంక్షేమం నిధికి సంబంధించిన సవరణలకు కేబినెట్ ఆమోదం:

•    న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ అయ్యే న్యాయ సేవ కార్యకలాపాలకు ఉపయోగించే రెండు రూపాయల తోక బిల్లులను(స్టాంపులు)  ఇక నుంచి 20 రూపాయలు పెంచుతూ కేబినెట్ నిర్ణయం

12.    గ్రామ/వార్డు సచివాయాల్లో ఖాళీగా ఉన్న 397 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

13.    కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో రసాయన కర్మాగారం కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన 498 ఎకరాల భూకేటాయింపు రద్దుకు మంత్రివర్గం నిర్ణయం

14.    విశాఖలోని బీచ్ రోడ్డులో కన్వెన్షన్ సెంటర్ కోసం లులూ గ్రూప్నకు కేటాయించిన 13.6 ఎకరాల లీజ్ ను రద్దు చేసిన మంత్రివర్గం

15.    ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థలకు ఊపిరి అందించేందుకు బ్యాంకుల నుంచి రుణాలు - బాండ్లు జారీ చేసేందుకు అనుమతి.

16.    హోంశాఖలో అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం

17.    ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన రాజ్ భవన్ లో 35 మంది సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదం

18.    నవంబర్ 21న జాతీయ మత్స్యకార దినోత్సవం  పురస్కరించుకొని మత్స్యకారుల అభ్యున్నతి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదం :

•    వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం

•    నిర్ధేశిత పెట్రోలు బంకుల్లో మత్స్యకారులకు లీటర్ డీజీల్ పై ఇచ్చే రూ.9 సబ్సిడీని కొనుగోలు సమయంలో ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం

•    తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ప్రాంతంలో చమురు - సహజవాయువుల కోసం జరిపిన తవ్వకాల కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.80 కోట్ల నష్టపరిహారం అందజేసేందుకు కేబినెట్ ఆమోదం

19.    రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన పేమెంట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం

•    రూ. 10వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు నవంబర్ 7న 3 లక్షల 69వేల 655 మంది బాధితులకు రూ.264 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసేందుకు కేబినెట్ నిర్ణయం

•    రూ.20 వేల లోపు డిపాజిట్ దారులకు కూడా నష్టపరిహారం అందిస్తామని కేబినెట్ వెల్లడి

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

phukat la panchipetanika paisal edikelli vastayi vaa...

munduoonudu ae motham udichi petti poindu...eedu vunnadi antha petti dobbutunadu

Bro nuvvu kuda jagan tidithe ela

Link to comment
Share on other sites

6 minutes ago, AndhraneedSCS said:

andariki panchamanandi ... malli daridya rekha diguva tokka enduku 

Ade chesetodu, kani intak mundu vunna CM motham nakichesindu, evadiki padithe vadiki panchdaniki inkemi migalaledu...only daridraniki degara ga vunna vallu tapithe

Link to comment
Share on other sites

2 hours ago, Android_Halwa said:

phukat la panchipetanika paisal edikelli vastayi vaa...

munduoonudu ae motham udichi petti poindu...eedu vunnadi antha petti dobbutunadu

Ne badha edu panchutunnadu ani kadu mundhu vunnodu udichesadu ane ! Money vundi vunte panchi mingamane type e nuvvu ! AP mingipote TG ki advantage ani ne inner feeling 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...