Jump to content

సెక్స్ సర్వే.. భారతీయులు చాలా హాట్ గురూ!


tamu

Recommended Posts

సెక్స్.. ఈ పదం ఒకప్పుడు చాలా గుంభనం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇండియాలో కూడా సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడేరోజులు వచ్చాయి. అక్కడితో ఆగలేదు నేటితరం. తమ పడకగదికి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు బయటపెట్టారు. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఫలితాలు ఎలా ఉన్నాయంటే.. సెక్స్ విషయంలో పాశ్చాత్య దేశాలకు భారతీయులు ఏమాత్రం తీసిపోం అనేలా ఉన్నాయి.

శీలం.. ఇండియాలో ఇది చాలా పెద్ద ఇష్యూ. కానీ ఇప్పుడీ విషయంలో పట్టింపులు పోతున్నాయి. వర్జినిటీ (శీలం) అవసరమే అని 53శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. 2007లో ఇది 80శాతంగా ఉంది. అంటే అబ్బాయి లేదా అమ్మాయి తన పార్టనర్ లో కన్యత్వాన్ని చూడడం లేదన్నమాట. అయితే ఈ విషయంలో అహ్మదాబాద్, జైపూర్ లో పట్టింపులు బాగానే ఉన్నాయి. శీలం ఉండాల్సిందేనని 82శాతం మంది అహ్మదాబాద్ లో అభిప్రాయపడితే, జైపూర్ లో 81శాతం మంది తమ పార్టనర్ వర్జిన్ అయి ఉండాలని కోరుకున్నారు.

ఇక పోర్న్ పై కూడా తమ అభిప్రాయాల్ని ఓపెన్ గా వెల్లడించింది యువత. రెగ్యులర్ గా లేదా అప్పుడప్పుడు పోర్న్ చూస్తామని 85.5 శాతం మంది సర్వేలో అభిప్రాయపడ్డారు. గడిచిన రెండేళ్లతో పోలిస్తే అటు మహిళలు, ఇటు పురుషుల్లో ఈ పర్సంటేజీ పెరిగింది. అటు శృంగారంలో కూడా భారతీయులు అడ్వాన్స్ అయ్యారు. మంచానికి కట్టేసి సెక్స్ చేయడం, కళ్లకు గంతలు కట్టేసి సెక్స్ లో పాల్గొనడం లాంటి శృంగారాలు తమకు ఆమోదయోగ్యమే అని 30శాతం మంది అభిప్రాయపడ్డారు.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రతి ముగ్గురిలో (ఆడ లేదా మగ) ఒకరు పై విధంగా శృంగారంలో పాల్గొనడానికి సిద్ధమని ఓపెన్ గా చెప్పడం. సెక్స్ లో గట్టిగా కొట్టడం లేదా కొరకడం లాంటి పనులకు 31శాతం మంది ఓకే అంటూ సమాధానం చెప్పడం కూడా ఆశ్చర్యం కలిగించే అంశమే. అవసరమైతే సెక్స్ సాధనాలు, వైబ్రేటర్స్ లాంటివి వాడడానికి ఏమాత్రం వెనకాడమని సర్వేలో 27శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. ఇలా చెప్పిన వాళ్లలో ఎక్కువమంది ఇండోర్, భువనేశ్వర్, గుర్గామ్ ప్రాంతాల నుంచి ఉన్నారు.

అయితే పాశ్చాత్య దేశాల తరహాలో సెక్స్ సమయంలో సెల్ఫీలు దిగడానికి, వీడియోలు తీసుకోవడానికి మాత్రం పూర్తి వ్యతిరేకత వ్యక్తంచేశారు భారతీయులు. దాదాపు 89శాతం మంది ఇలా చేయడాన్ని వ్యతిరేకించారు. ఇలాంటి వీడియోలు విదేశాల్లో బయటకొస్తే పెద్ద సమస్య కాదు, ఇండియాలో బయటకొస్తేనే పెద్ద సమస్య. అందుకే ఇంత వ్యతిరేకత. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే.. భారత్ లో దాదాపు 40శాతం మంది సెక్స్ లో పూర్తి సంతృప్తి పొందడం లేదట. ఈ విషయంలో ఆడ-మగ అనే తేడా లేదు.

అటు పురుషులు, ఇటు మహిళలు సమానంగా తమ అసంతృప్తిని వెల్లడించారు.  ఏం చేస్తే తమ భాగస్వామి ఫుల్ గా సంతృప్తి చెందుతారో (జీ-స్పాట్) తమకు తెలుసని 51 శాతం మంది చెప్పుకొచ్చారు. శృంగారంలో మగాడు పైన ఉండడాన్నే 40శాతం మంది మహిళలు ఇష్టపడ్డారు. ఇక పురుషుల విషయానికొస్తే.. మహిళ తమ పైన ఉండడాన్ని 22.6 శాతం మంది ఇష్టపడ్డారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సర్వేలోని ప్రతి నలుగురిలో ఒకరు తాము పనిచేసే చోట కొలీగ్ తో సెక్స్ చేయడానికి ఆసక్తి చూపించారు.

ఈ విషయంలో మహిళల కంటే మగాళ్ల కోరికే ఎక్కువగా ఉంది. ఇలా వర్క్ ప్లేస్ లో సెక్స్ ఎంజాయ్ చేసిన నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 27శాతం మంది పనిచేసే చోటే పని కానిచ్చేస్తున్నారన్నమాట. సెక్స్ చేస్తున్నప్పుడు ఆఫీస్ పని ఎక్కువగా గుర్తొస్తుందని బెంగుళూరు వాసుల్లో ఎక్కువమంది అభిప్రాయపడగా.. ఎక్స్ ట్రా తృప్తి కోసం పిల్స్ వాడే కల్చర్ జైపూర్ లో ఎక్కువగా ఉందట. ఆ తర్వాత స్థానంలో చండీగడ్ ఉంది. ఇక ఇండోర్ లో 91శాతం మంది 30 నిమిషాల్లోపే తమ పని కానిచ్చేస్తున్నారట.

జైపూర్ లో 67శాతం, ముంబయిలో 51శాతం మంది 30 నిమిషాల్లోనే శృంగారం (ఫోర్ ప్లేతో కలిపి) పూర్తిచేస్తున్నారట. ఇలా గడిచిన పదేళ్లలో భారతీయుల సెక్స్ కోరికల్లో, వాళ్ల సెక్స్ ఆలోచనవిధానంలో చాలా మార్పు వచ్చిందని వెల్లడించింది ఇండియా టుడే.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...