Jump to content

మహిళల రక్షణకోసం రూపొందించిన చట్టాలు...


Athadu007

Recommended Posts

EVERY ONE SHOULD KNOW THIS 
*మహిళల రక్షణకోసం రూపొందించిన చట్టాలు, ఐపీసీ సెక్షన్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ నేరానికి ఏ శిక్ష..?*

* సెక్షన్ 100 : ఆత్మరక్షణ కోసం ఎదుటి వారిపై దాడి చేస్తే తప్పు లేదు. ఆ సమయంలో సదరు వ్యక్తి చనిపోయినా మీకు శిక్ష పడదు. 

* 166(బీ) : ఈ సెక్షన్ ప్రకారం బాధితురాలికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఇవ్వకపోతే సిబ్బంది, యాజమాన్యం మీద కేసు వేయవచ్చు.

 * 228(ఏ) : అత్యాచారానికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు, ఫొటోలు ప్రచురించరాదు. అలా చేస్తే సదరు సంస్థపై చర్యలు తీసుకోవచ్చు.

 * 354 : స్త్రీ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, అవమానపర్చినా, అనుమతి లేకుండా ఫొటో, వీడియో తీసినా ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయవచ్చు. 

* 376 : 18 ఏళ్లలోపు ఉన్న యువతితో సెక్సులో పాల్గొంటే నేరం. ఒకవేళ ఆమె ఇష్ట ప్రకారమే చేసినా సదరు పురుషుడికి ఈ సెక్షన్ కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది.

 * 376 : వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధిస్తే ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. దీని ప్రకారం సదరు వ్యక్తి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. 

* 494 : భార్య ఉండగా మరొకరిని పెళ్లి చేసుకుంటే ఈ సెక్షన్ ప్రకారం సదరు వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. 

* 498(ఏ) : ఓ వివాహిత స్త్రీని ఆమె భర్తగానీ, భర్త బంధువులుగానీ శారీరకంగా, మానసికంగా హింసించినా, అందుకు ప్రేరేపించినా, ప్రోత్సహించినా ఈ సెక్షన్ కింద కేసు వేయవచ్చు. కనీసం మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కట్టాల్సి వస్తుంది. 

* 509 : మహిళలతో అవమానంగా మాట్లాడినా, సైగలు చేసినా ఈ చట్టం ప్రకారం శిక్షకు అర్హులు. 

* 294 : రోడ్డు మీద నడుస్తుంటే, బస్టాప్‌లో, ఇంకెక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యకరంగా పాటలు పాడుతూ ఎవరైనా ఇబ్బంది పెడితే ఈ సెక్షన్ ప్రకారం వారిపై కేసు నమోదు చేయవచ్చు. కనీసం మూడునెలలకు తగ్గకుండా వారికి జైలుశిక్ష పడుతుంది. లేదా జరిమానా కట్టాల్సి ఉంటుంది. 

* 354 (డీ) : ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా వెక్కిరించినా, అనుకరించినా, వారిపై ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నిందితులకు 3 నుంచి 5 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశముంది. మీరు పనిచేసే ప్రదేశాల్లో మీ తోటి ఉద్యోగులుగానీ, మీ బాస్‌గానీ సెక్స్‌కోసం ఇబ్బంది పెడితే 2013 వేధింపుల చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.

 * 499 : ఫొటోలు మార్పింగ్ చేసి ఇబ్బందికరంగా ఇంటర్నెట్‌లో పెడుతున్న ఘటనలు ఈ మధ్య బాగా వెలుగుచూస్తున్నాయి. ఇలాంటివి మీకు ఎదురైతే ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే సదరు వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది. 

*354(బీ) :మహిళను పై నున్న దుస్తులను బలవంతంగా తొలగిస్తే (compelling her to be naked) సంబంధిత ఆ వ్యక్తికి 3 నుంచి 7 ఏళ్ల దాకా శిక్షపడుతుంది. 13/2013 సవరణ చట్టం ద్వారా ఈ సెక్షన్ అదనంగా చేర్చారు.

 * 354(సీ) : మహిళ లేదా విద్యార్థిని అనుమతి లేకుండా ఫొటోలు/వీడియోలు తీసి వాటిని ఇతరులకు పంపించినా (voyeurism) సంబంధిత వ్యక్తికి ఏడాది నుంచి 3 ఏళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. ఆ వ్యక్తి తిరిగి అదే నేరానికి పాల్పడితే 3 నుంచి 7 ఏళ్ల దాకా శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. 

* 373 : 18 ఏళ్ల మైనర్ బాలికను కొనుగోలు చేస్తే పదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తారు.

*316 : నిండు గర్భవతిని చంపితే సంబంధిత వ్యక్తిపై ప్రాణహరణం కింద (cvpable homicide) నేరం మోపుతారు. ఆమె మరణించడానికి బదులుగా గర్భంలోని శిశువు (quick unbron child) మృతిచెందితే ఈ సెక్షన్ కింద 10 ఏళ్ల దాకా జైలుశిక్ష పడుతుంది.

*376(బీ): ఒకరికన్నా ఎక్కువ మంది మహిళపై లైంగికదాడి చేస్తే, ఒక్కొక్కరికీ 20 ఏళ్లు తగ్గకుండా జీవితఖైదు శిక్ష విధించబడుతుంది. 13/2013 సవరణ చట్టం ద్వారా ఈ సెక్షన్ సవరించారు. 

*366(ఏ) : మైనర్ బాలికను వ్యభిచారానికి ప్రోత్సహించినా, ప్రలోభ పెట్టినా పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. 

*366 : స్త్రీలు, బాలికలను బలవంతంగా ఎత్తు కెళ్లి పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా పడుతుంది.

 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...