AndhraneedSCS Posted December 9, 2019 Report Share Posted December 9, 2019 హైదరాబాద్: ఎన్‌కౌంటర్‌తో హీరోయిజమే కాదు.. కష్టాలు కూడా వస్తాయి. జస్టిస్ ఫర్ దిశ లాంటి కేసుల్లో జరిగే ఎన్‌కౌంటర్లతో పోలీసులు హీరోలు అవుతుంటారు. ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి ఇంటాబయట ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, ఆ తరువాతే అసలు కష్టాలు మొదలవుతాయి. 2014లో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. తమను తాము నిర్దోషులుగా నిరూపించుకునే ప్రక్రియలో పోలీసులకు తల ప్రాణం తోకకు వస్తుంది. ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే సంబంధిత పోలీసులపై సెక్షన్ 302 కింద హత్యానేరం నమోదవుతుంది. నిబంధనల మేరకు ప్రభుత్వం నుంచి గానీ, పోలీసు శాఖ నుంచి గానీ వారికి న్యాయ సాయం అందదు. కేసు సుప్రీంకోర్టు వరకు వెళితే.. ఢిల్లీకి వచ్చిపోయే ఖర్చులతో పాటు భారీగా పుచ్చుకునే సుప్రీంకోర్టు అడ్వకేట్లకు ఫీజులు కట్టాల్సి ఉంటుంది. కొంతమందికైతే రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్‌కౌంటర్ తాలూకు ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. ఉద్యోగాలు పోగోట్టుకుని.. జైలుపాలై.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులోనూ పోలీసులపై హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. ఎన్‌హెచ్ఆర్‌సి కూడా విచారణ జరుపుతోంది. ఈ విచారణ పూర్తయి నిర్దోషులుగా తేలే వరకు సదరు పోలీసులకు పదవి విరమణ ప్రయోజనాలు దక్కవు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులతో పాటు.. కేసును పర్యవేక్షించే అధికారులకు కూడా వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉంటాయి. పర్యవేక్షించే అధికారులకు కూడా కేసు తేలే వరకు పదవీ విరమణ ప్రయోజనాలు అందవు. కొన్ని సందర్భాల్లో తమను తాము నిరూపించుకోలేక ఉద్యోగం పోగొట్టుకుని జైలుపాలైన పోలీసు అధికారులు కూడా ఉన్నారు. జైలు శిక్షతో పాటు పదవీ విరమణ ప్రయోజనాల నుంచి బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని తీర్పులు కూడా వచ్చాయి. ఎందరో చిక్కి శల్యమైపోయారు..! మామూలుగా అయితే ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఉన్నతాధికారుల అండదండలు ఉంటాయి. కానీ తమకు మద్దతు ఇచ్చే ఉన్నతాధికారుల స్థానంలో తమకు గిట్టనివాళ్లు వస్తే ఇక అంతే సంగతులు. ప్రొఫెషనల్ ఈగోలు, వ్యక్తిగత కక్షలు లాంటివి తోడై కొత్త ఇబ్బందులు వస్తాయి. గుజరాత్‌లో సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో ఎనిమిదేళ్ల తరువాత అమిత్ షా అరెస్ట్ అవడానికి కారణం అదే. ఆ ఎన్‌కౌంటర్‌తో సంబంధం ఉన్న ఆరుగురు పోలీసులు కూడా ఐదేళ్లకు పైగా జైళ్లో ఉన్నారు. గుజరాత్‌లోనే జరిగిన సమీర్ ఖాన్, ఇస్మాయిల్, జాఫర్ ఎన్‌కౌంటర్ కేసుల్లో తొమ్మిది మంది పోలీసులను సుప్రీం కోర్టు దోషులుగా ప్రకటించింది. ఇక మందమర్రిలో జరిగిన ఎన్‌కౌంటర్ కేసులో ఒక ఎన్‌స్పెక్టర్ నాలుగేళ్లు ప్రత్యక్ష నరకం అనుభవించారు. జీతం లేక, కోర్టు ఖర్చులు భరించలేక ముప్పుతిప్పలు పడ్డారు. ఆ విధంగా ఇలాంటి కేసుల్లో తీర్పులు వచ్చేవరకు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు చిక్కి శల్యమైపోయారు. సీపీ సజ్జనార్ పరిస్థితి ఏంటి..? దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై కూడా కేసు నమోదైంది. సజ్జనార్ లాంటి ఉన్నతాధికారులతో పాటు.. కిందిస్థాయి వరకు పలువురిపై మర్డర్ కేసు నమోదైంది. దీంతో తమను తాము నిర్దోషులమని నిరూపించుకునే భారం వారిపై పడింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో ప్రజా మద్దతు ఉంది కాబట్టి పోలీసులకు ఇంటాబయట ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ప్రతి ఎన్‌కౌంటర్‌కు ఇలాంటి పూర్తిస్థాయి మద్దతు దొరకాలని ఏమీ లేదు. ముంబైలో దావూద్ ఇబ్రహీం హవా నడిచిన రోజుల్లో నేరాలను తగ్గించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో మహారాష్ట్ర పోలీసులు వరుస ఎన్‌కౌంటర్లకు తెరలేపారు. పోలీసు అధికారి ప్రదీప్ శర్మ ఒక్కడే వందకుపైగా ఎన్‌కౌంటర్లు చేయగా.. దయా నాయక్ అనే మరో పోలీసు అధికారి 83, ప్రఫుల్ 84 ఎన్‌కౌంటర్లు చేశారు. ఇక ఢిల్లీలో భూమాఫియాతో సంబంధం ఉన్న సుమారు 50 మందిని వేరువేరు ఎన్‌కౌంటర్లతో రాజ్‌బీర్ సింగ్ హతమార్చాడు. అలీఘడ్ ఎస్పీ రాజేష్ పాండే యాభై మంది నేరగాళ్లను హతమార్చగా.. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన అమితాబ్ వ్యాస్ 36 ఎన్‌కౌంటర్లు చేశాడు. ఖాకీ యిజం ఇక్కడ పనిచేయదు.. అయితే.. వీరి స్థాయి, వీరికి ఉండే అంగ, అర్థ బలాలను కాసేపు పక్కన బెడితే.. పీత కష్టాలు పీతవి అన్న సామెత వీరికి కూడా వర్తిస్తుంది. కేసు ఓడిపోయిన వాళ్లు కోర్టులో ఏడిస్తే.. గెలిచిన వాళ్లు ఇంటికి వచ్చాక ఏడుస్తారని స్వయంగా అడ్వకేట్లే చెబుతుంటారు. ఎందుకంటే న్యాయప్రక్రియ అంత జఠిలంగా ఉంటుంది. పేషీల కోసం కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి.. అడ్వకేట్లకు ఫీజులు చెల్లించి చెల్లించి ఇళ్లు, ఒళ్లు గుల్లయిపోవాల్సిందే. ముఖ్యంగా బెంచ్‌మీదకు తమ కేసు ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. తమకంటే ముందు సాగుతున్న కేసు విచారణ ముగియగానే వెంటనే కోర్టు హాలులో ప్రత్యక్షమవ్వాలట. ఖాకీ ఇజం ఇక్కడ పనిచేయదు. ఎంత పెద్ద పోలీసు బాస్ అయినా ఒక్క నిమిషం కోర్టు హాలులోకి ఆలస్యంగా వచ్చారంటే న్యాయమూర్తి నుంచి అక్షింతలు పడుతుంటాయి. బయట ఖాకీలను చూసి అంతా బయపడితే.. కోర్టు హాలులో జడ్జిలకు పోలీసులకు భయపడుతారు. న్యాయపీఠంపై కూర్చున్న జడ్జి అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంత పెద్ద పోలీసు బాస్ అయినా వినయంగా, విధేయంగా, వినమ్రంగా సమాధానం చెప్పాల్సిందే. పోలీస్ స్టేషన్‌లో చూపించే సింగం ఇమేజ్‌కు ఇక్కడ పూర్తి భిన్నమైన ప్రవర్తన చూపించాల్సిందే. ఈగోలు, పౌరుషాలు ఇక్కడ పనికిరావు. ఎందుకంటే అసలే ఎన్‌కౌంటర్ కేసు. జడ్జికి ఆగ్రహం వస్తే అసలుకే మోసం వస్తుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఒక్కో పోలీసు అధికారి పదుల సంఖ్యలో ఎన్‌కౌంటర్లు చేశారు. ఒక్క కేసుకే ఎన్నిసార్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందో అందరికీ తెలిసిందే. పైగా సహజంగా ఎన్‌కౌంటర్ వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతుంది. బదిలీ అయితే అక్కడి నుంచి ఇక్కడి కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇదీ అసలు విషయం.. నాణెనికి రెండువైపులు ఉన్నట్లు.. ప్రతి ఘటనకు లాభ నష్టాలు రెండూ ఉంటాయి. ఓ సినిమాలో చెప్పినట్లు ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి అన్నట్లు పోలీసు కొలువులో కలకాలం నెగ్గుకురావాలంటే అన్ని విద్యలు వంటపట్టాల్సిందే. బుల్లెట్లతో తీర్పులు చెప్పడం నుంచి తీర్పులు చెప్పే కోర్టుల ముందు జీ హుజూర్ అని నిలబడేంత లౌక్యం ఉండాల్సిందే. ఇదీ పోలీసుల హీరోయిజం వెనుక ఉన్న కష్టం. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted December 9, 2019 Report Share Posted December 9, 2019 Sajjanar ki 2008 lo debba padindi, but thank god state government support tho 2 years edo non important post ki demote ayi back to normal...malli I think old case la malli edo lolli ayindi, anti na al operations la.. Nayeem gadi encounter inka meda ki vundi, of course vadu pedda criminal gadu and sarkar support tho bayapapadochu easy ga...kani ie disha encounter case la matram final promotion ki deba padinatte Quote Link to comment Share on other sites More sharing options...
Kalam_Youtheman Posted December 9, 2019 Report Share Posted December 9, 2019 1 hour ago, AndhraneedSCS said: హైదరాబాద్: ఎన్‌కౌంటర్‌తో హీరోయిజమే కాదు.. కష్టాలు కూడా వస్తాయి. జస్టిస్ ఫర్ దిశ లాంటి కేసుల్లో జరిగే ఎన్‌కౌంటర్లతో పోలీసులు హీరోలు అవుతుంటారు. ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి ఇంటాబయట ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, ఆ తరువాతే అసలు కష్టాలు మొదలవుతాయి. 2014లో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. తమను తాము నిర్దోషులుగా నిరూపించుకునే ప్రక్రియలో పోలీసులకు తల ప్రాణం తోకకు వస్తుంది. ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే సంబంధిత పోలీసులపై సెక్షన్ 302 కింద హత్యానేరం నమోదవుతుంది. నిబంధనల మేరకు ప్రభుత్వం నుంచి గానీ, పోలీసు శాఖ నుంచి గానీ వారికి న్యాయ సాయం అందదు. కేసు సుప్రీంకోర్టు వరకు వెళితే.. ఢిల్లీకి వచ్చిపోయే ఖర్చులతో పాటు భారీగా పుచ్చుకునే సుప్రీంకోర్టు అడ్వకేట్లకు ఫీజులు కట్టాల్సి ఉంటుంది. కొంతమందికైతే రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్‌కౌంటర్ తాలూకు ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. ఉద్యోగాలు పోగోట్టుకుని.. జైలుపాలై.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులోనూ పోలీసులపై హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. ఎన్‌హెచ్ఆర్‌సి కూడా విచారణ జరుపుతోంది. ఈ విచారణ పూర్తయి నిర్దోషులుగా తేలే వరకు సదరు పోలీసులకు పదవి విరమణ ప్రయోజనాలు దక్కవు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులతో పాటు.. కేసును పర్యవేక్షించే అధికారులకు కూడా వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉంటాయి. పర్యవేక్షించే అధికారులకు కూడా కేసు తేలే వరకు పదవీ విరమణ ప్రయోజనాలు అందవు. కొన్ని సందర్భాల్లో తమను తాము నిరూపించుకోలేక ఉద్యోగం పోగొట్టుకుని జైలుపాలైన పోలీసు అధికారులు కూడా ఉన్నారు. జైలు శిక్షతో పాటు పదవీ విరమణ ప్రయోజనాల నుంచి బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని తీర్పులు కూడా వచ్చాయి. ఎందరో చిక్కి శల్యమైపోయారు..! మామూలుగా అయితే ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఉన్నతాధికారుల అండదండలు ఉంటాయి. కానీ తమకు మద్దతు ఇచ్చే ఉన్నతాధికారుల స్థానంలో తమకు గిట్టనివాళ్లు వస్తే ఇక అంతే సంగతులు. ప్రొఫెషనల్ ఈగోలు, వ్యక్తిగత కక్షలు లాంటివి తోడై కొత్త ఇబ్బందులు వస్తాయి. గుజరాత్‌లో సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో ఎనిమిదేళ్ల తరువాత అమిత్ షా అరెస్ట్ అవడానికి కారణం అదే. ఆ ఎన్‌కౌంటర్‌తో సంబంధం ఉన్న ఆరుగురు పోలీసులు కూడా ఐదేళ్లకు పైగా జైళ్లో ఉన్నారు. గుజరాత్‌లోనే జరిగిన సమీర్ ఖాన్, ఇస్మాయిల్, జాఫర్ ఎన్‌కౌంటర్ కేసుల్లో తొమ్మిది మంది పోలీసులను సుప్రీం కోర్టు దోషులుగా ప్రకటించింది. ఇక మందమర్రిలో జరిగిన ఎన్‌కౌంటర్ కేసులో ఒక ఎన్‌స్పెక్టర్ నాలుగేళ్లు ప్రత్యక్ష నరకం అనుభవించారు. జీతం లేక, కోర్టు ఖర్చులు భరించలేక ముప్పుతిప్పలు పడ్డారు. ఆ విధంగా ఇలాంటి కేసుల్లో తీర్పులు వచ్చేవరకు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు చిక్కి శల్యమైపోయారు. సీపీ సజ్జనార్ పరిస్థితి ఏంటి..? దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై కూడా కేసు నమోదైంది. సజ్జనార్ లాంటి ఉన్నతాధికారులతో పాటు.. కిందిస్థాయి వరకు పలువురిపై మర్డర్ కేసు నమోదైంది. దీంతో తమను తాము నిర్దోషులమని నిరూపించుకునే భారం వారిపై పడింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో ప్రజా మద్దతు ఉంది కాబట్టి పోలీసులకు ఇంటాబయట ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ప్రతి ఎన్‌కౌంటర్‌కు ఇలాంటి పూర్తిస్థాయి మద్దతు దొరకాలని ఏమీ లేదు. ముంబైలో దావూద్ ఇబ్రహీం హవా నడిచిన రోజుల్లో నేరాలను తగ్గించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో మహారాష్ట్ర పోలీసులు వరుస ఎన్‌కౌంటర్లకు తెరలేపారు. పోలీసు అధికారి ప్రదీప్ శర్మ ఒక్కడే వందకుపైగా ఎన్‌కౌంటర్లు చేయగా.. దయా నాయక్ అనే మరో పోలీసు అధికారి 83, ప్రఫుల్ 84 ఎన్‌కౌంటర్లు చేశారు. ఇక ఢిల్లీలో భూమాఫియాతో సంబంధం ఉన్న సుమారు 50 మందిని వేరువేరు ఎన్‌కౌంటర్లతో రాజ్‌బీర్ సింగ్ హతమార్చాడు. అలీఘడ్ ఎస్పీ రాజేష్ పాండే యాభై మంది నేరగాళ్లను హతమార్చగా.. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన అమితాబ్ వ్యాస్ 36 ఎన్‌కౌంటర్లు చేశాడు. ఖాకీ యిజం ఇక్కడ పనిచేయదు.. అయితే.. వీరి స్థాయి, వీరికి ఉండే అంగ, అర్థ బలాలను కాసేపు పక్కన బెడితే.. పీత కష్టాలు పీతవి అన్న సామెత వీరికి కూడా వర్తిస్తుంది. కేసు ఓడిపోయిన వాళ్లు కోర్టులో ఏడిస్తే.. గెలిచిన వాళ్లు ఇంటికి వచ్చాక ఏడుస్తారని స్వయంగా అడ్వకేట్లే చెబుతుంటారు. ఎందుకంటే న్యాయప్రక్రియ అంత జఠిలంగా ఉంటుంది. పేషీల కోసం కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి.. అడ్వకేట్లకు ఫీజులు చెల్లించి చెల్లించి ఇళ్లు, ఒళ్లు గుల్లయిపోవాల్సిందే. ముఖ్యంగా బెంచ్‌మీదకు తమ కేసు ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. తమకంటే ముందు సాగుతున్న కేసు విచారణ ముగియగానే వెంటనే కోర్టు హాలులో ప్రత్యక్షమవ్వాలట. ఖాకీ ఇజం ఇక్కడ పనిచేయదు. ఎంత పెద్ద పోలీసు బాస్ అయినా ఒక్క నిమిషం కోర్టు హాలులోకి ఆలస్యంగా వచ్చారంటే న్యాయమూర్తి నుంచి అక్షింతలు పడుతుంటాయి. బయట ఖాకీలను చూసి అంతా బయపడితే.. కోర్టు హాలులో జడ్జిలకు పోలీసులకు భయపడుతారు. న్యాయపీఠంపై కూర్చున్న జడ్జి అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంత పెద్ద పోలీసు బాస్ అయినా వినయంగా, విధేయంగా, వినమ్రంగా సమాధానం చెప్పాల్సిందే. పోలీస్ స్టేషన్‌లో చూపించే సింగం ఇమేజ్‌కు ఇక్కడ పూర్తి భిన్నమైన ప్రవర్తన చూపించాల్సిందే. ఈగోలు, పౌరుషాలు ఇక్కడ పనికిరావు. ఎందుకంటే అసలే ఎన్‌కౌంటర్ కేసు. జడ్జికి ఆగ్రహం వస్తే అసలుకే మోసం వస్తుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఒక్కో పోలీసు అధికారి పదుల సంఖ్యలో ఎన్‌కౌంటర్లు చేశారు. ఒక్క కేసుకే ఎన్నిసార్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందో అందరికీ తెలిసిందే. పైగా సహజంగా ఎన్‌కౌంటర్ వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతుంది. బదిలీ అయితే అక్కడి నుంచి ఇక్కడి కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇదీ అసలు విషయం.. నాణెనికి రెండువైపులు ఉన్నట్లు.. ప్రతి ఘటనకు లాభ నష్టాలు రెండూ ఉంటాయి. ఓ సినిమాలో చెప్పినట్లు ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి అన్నట్లు పోలీసు కొలువులో కలకాలం నెగ్గుకురావాలంటే అన్ని విద్యలు వంటపట్టాల్సిందే. బుల్లెట్లతో తీర్పులు చెప్పడం నుంచి తీర్పులు చెప్పే కోర్టుల ముందు జీ హుజూర్ అని నిలబడేంత లౌక్యం ఉండాల్సిందే. ఇదీ పోలీసుల హీరోయిజం వెనుక ఉన్న కష్టం. 31 minutes ago, Android_Halwa said: Sajjanar ki 2008 lo debba padindi, but thank god state government support tho 2 years edo non important post ki demote ayi back to normal...malli I think old case la malli edo lolli ayindi, anti na al operations la.. Nayeem gadi encounter inka meda ki vundi, of course vadu pedda criminal gadu and sarkar support tho bayapapadochu easy ga...kani ie disha encounter case la matram final promotion ki deba padinatte central govt support lekaapothe state givt eee decisions theeesukovuuu.... Kishan kuda chepppadu by dec end edho . okkka sikha pakka MODI cheppadu ani... more over eee police suspension all this drama just for 2 months.. then CM has the authority to revert the suspension.. so matter calm avvagane CM will revert... Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted December 9, 2019 Report Share Posted December 9, 2019 2 minutes ago, Kalam_Youtheman said: central govt support lekaapothe state givt eee decisions theeesukovuuu.... Kishan kuda chepppadu by dec end edho . okkka sikha pakka MODI cheppadu ani... more over eee police suspension all this drama just for 2 months.. then CM has the authority to revert the suspension.. so matter calm avvagane CM will revert... And moreover janallo kuda ee police hero ippudu. Aayanaki favor ga yem chesina KCR ni pogadatame thappa janallo asalu - ve ne radu. Opposition kuda sappudu cheyyadu. Badha antha just Human rights and courts anthe. Avi kuda inkoka 2 weeks lo sallabadathayi. Ficha light topic idi. Quote Link to comment Share on other sites More sharing options...
Joker_007 Posted December 9, 2019 Report Share Posted December 9, 2019 sajjanar ki aa problem ledu endukante thana case thane vaadinchukovachu.. 1 year diploma course cheste chaalu ..... Quote Link to comment Share on other sites More sharing options...
Jailjagan_CM Posted December 9, 2019 Report Share Posted December 9, 2019 1 hour ago, Android_Halwa said: Sajjanar ki 2008 lo debba padindi, but thank god state government support tho 2 years edo non important post ki demote ayi back to normal...malli I think old case la malli edo lolli ayindi, anti na al operations la.. Nayeem gadi encounter inka meda ki vundi, of course vadu pedda criminal gadu and sarkar support tho bayapapadochu easy ga...kani ie disha encounter case la matram final promotion ki deba padinatte Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.