Jump to content

నటుడు గొల్లపూడి మారుతీ రావు కన్నుమూత

Kool_SRG

Recommended Posts

image_default_551965df1f23078113.jpg

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు(80) తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపొలో ఆస్పత్రిలో కన్నుమూశారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతీరావు రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాతగా రాణించారు. గొల్లపూడి మారుతీరావు నటించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య(1982) కాగా గొల్లపూడి నటించిన చివరి చిత్రం జోడి(ఆది సాయికుమార్). 42 ఏళ్ల వయస్సులో మొదటి సినిమాలో నటించిన గొల్లపూడి మూడున్నర దశాబ్దాలకుపైగా సినీరంగంలో ఎన్నో పాత్రలు పోషించి విభిన్నమైన నటుడిగా పేరు సాధించారు. సుమారు 290కిపైగా చిత్రాల్లో నటించిన గొల్లపూడి మారుతీరావు ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా నటించి మెప్పించారు. గొల్లపూడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్, అయితే ప్రేమ పుస్తకం చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిన్నకుమారుడు శ్రీనివాస్ చనిపోగా శ్రీనివాస్ జ్ఞాపకార్థం గొల్లపూడి శ్రీనివాస స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేసిన గొల్లపూడి అప్పటి నుండి అవార్డులు ఇస్తూ వస్తున్నారు.

Link to comment
Share on other sites

50 ఏళ్ల వయసులో నటుడైన గొల్లపూడి... తొలి సినిమాతోనే...

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాకు ముందు రచయితగా 80 సినిమాలకు పని చేసిన గొల్లపూడి... ఈ సినిమా తరువాత నటుడిగా ఫుల్ బిజీ అయిపోయారు.

gollapudi.jpg

తెలుగులో ఎంతోమంది గొప్ప నటులు ఉన్నారు. ఎవరికి వారు తెలుగు తెరపై, ప్రేక్షకుల హృదయాల్లో తమదైన ముద్ర వేశారు. అలాంటి వారిలో గొల్లపూడి మారుతీరావుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గొల్లపూడి నటించిన తొలి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ సినిమాలో సుబ్బారావు పాత్రలో స్త్రీలోలుడిగా కనిపించిన గొల్లపూడి పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అప్పటివరకు అలాంటి పాత్రలు పోషించిన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ గొల్లపూడి అలాంటి పాత్రలో తనదై శైలిని చూపించారు. ఆ సినిమా చూసినవాళ్లెవరూ... నటుడిగా గొల్లపూడికి ఇదే తొలి సినిమా అంటే అస్సలు నమ్మరు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఆ పాత్రకు ప్రాణం పోశారు. సినిమా ఘన విజయంలో ఆయన పాత్ర కీలకం. 

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాకు ముందు రచయితగా 80 సినిమాలకు పని చేసిన గొల్లపూడి... ఈ సినిమా తరువాత నటుడిగా ఫుల్ బిజీ అయిపోయారు. ఎంతలా అంటే గొల్లపూడి కోసమే చాలామంది దర్శకులు తమ సినిమాల్లో పాత్రలు సృష్టించేంతగా. విలనిజం, క్యారెక్టర్ రోల్స్, కామెడీ పాత్రలు... ఇలా ఎవైనా గొల్లపూడికి ఒకటే. అభిలాష, సంసారం ఒక చదరంగం, ఛాలెంజ్, స్వాతిముత్యం ఇలా ఎన్నెన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. చివరగా తెలుగులో 2019లో వచ్చిన జోడి అనే సినిమాలో కనిపించారు

Link to comment
Share on other sites

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గొల్లపూడి మారుతీరావు... కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. నటుడిగా, రచయితగా, సాహితీవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న గొల్లపూడి మారుతిరావు మరణంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. తెలుగులో 250కి పైగా సినిమాల్లో నటించిన గొల్లపూడి... తనదైన నటనతో అనేక అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో ఆయన సినిమాల్లో అడుగుపెట్టారు. తనదైన నటనతో ఆరు నంది అవార్డులు సొంతం చేసుకున్న గొల్లపూడి... మరెన్నో ఇతర అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. 

మారుతీరావు కొన్నాళ్లు విశాఖలో మరికొంతకాలం చెన్నైలో గొల్లపూడి ఉంటూ వచ్చారు. నటనా, రచనా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. సాహితీ రంగంలోనూ ఆయన విశిష్ట కృషి చేశారు. రేడియో వ్యాఖ్యతగా కెరీర్‌ మొదలుపెట్టిన ఆయన.. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. స్వాతిముత్యం లాంటి సినిమాలో వినూత్న విలనిజం చూపించి మెప్పించారు తనయుడు శ్రీనివాస్‌ పేరుతో కొత్త దర్శకులకు విశిష్ట ప్రోత్సాహాకాలు, అవార్డులను గొల్లపూడి అందించారు. నాటకాలు, నాటికలు, కథానికలు, సినిమా కథలు పత్రికా వ్యాసాల్లో గొల్లపూడి మారుతీరావు ముద్ర కనిపిస్తుంది.

Link to comment
Share on other sites

అప్పట్లో గొల్లపూడికి మొద్దు శీను లేఖ.. ఏమన్నాడో తెలుసా..?

సాధారణ పాఠకులు,సాహిత్య అభిలాష ఉన్నవాళ్లు గొల్లపూడి రచనలపై స్పందించడం సాధారణమే కావచ్చు.కానీ ఓ జైలు ఖైదీ సైతం ఆయన నవలను చదివి అభిమానించడం.. దానిపై ఆయనకో లేఖ రాయడం విశేషమనే చెప్పాలి.

gollapudi.jpg

గొల్లపూడి మారుతీరావు రచయితగా,నవలకారుడిగా తెలుగు సాహిత్యంపై కూడా చెరగని ముద్ర వేశారు.అప్పట్లో ఆయన రచించిన 'సాయంకాలమైంది' నవల ఆయనకు ఎంతోమంది సాహిత్య అభిమానులను
సంపాదించి పెట్టింది. మాజీ ప్రధాని పీవి నరసింహారావు దగ్గరి నుంచి ఎందరో పాఠకులు,సాహితీవేత్తలు ఆ నవలను ప్రశంసించారు.

సాధారణ పాఠకులు,సాహిత్య అభిలాష ఉన్నవాళ్లు గొల్లపూడి రచనలపై స్పందించడం సాధారణమే కావచ్చు.కానీ ఓ జైలు ఖైదీ సైతం ఆయన నవలను చదివి అభిమానించడం.. దానిపై ఆయనకో లేఖ రాయడం విశేషమనే చెప్పాలి. ఆ ఖైదీ మరెవరో కాదు.. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను.'విప్లవం అంటే గతంలో ఆయుధాలతో అడవుల్లో తిరిగేవారు చేసే పని అని ఒక అభిప్రాయం ఉండేది నాకు. మీరు మీ మీ ఆయుధాలతో సమాజాన్ని కొత్తగానయినా చక్కటి బాటలో నడిపిస్తున్నారు. అందుకు గురువు గారైన మీకు,మీ అనుమతి లేకుండానే మీ శిష్యుడిగా ప్రకటించుకుంటున్నాను.'అని ఆ లేఖలో పేర్కొన్నాడు.

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

50 ఏళ్ల వయసులో నటుడైన గొల్లపూడి... తొలి సినిమాతోనే...

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాకు ముందు రచయితగా 80 సినిమాలకు పని చేసిన గొల్లపూడి... ఈ సినిమా తరువాత నటుడిగా ఫుల్ బిజీ అయిపోయారు.

gollapudi.jpg

తెలుగులో ఎంతోమంది గొప్ప నటులు ఉన్నారు. ఎవరికి వారు తెలుగు తెరపై, ప్రేక్షకుల హృదయాల్లో తమదైన ముద్ర వేశారు. అలాంటి వారిలో గొల్లపూడి మారుతీరావుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గొల్లపూడి నటించిన తొలి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ సినిమాలో సుబ్బారావు పాత్రలో స్త్రీలోలుడిగా కనిపించిన గొల్లపూడి పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అప్పటివరకు అలాంటి పాత్రలు పోషించిన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ గొల్లపూడి అలాంటి పాత్రలో తనదై శైలిని చూపించారు. ఆ సినిమా చూసినవాళ్లెవరూ... నటుడిగా గొల్లపూడికి ఇదే తొలి సినిమా అంటే అస్సలు నమ్మరు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఆ పాత్రకు ప్రాణం పోశారు. సినిమా ఘన విజయంలో ఆయన పాత్ర కీలకం. 

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాకు ముందు రచయితగా 80 సినిమాలకు పని చేసిన గొల్లపూడి... ఈ సినిమా తరువాత నటుడిగా ఫుల్ బిజీ అయిపోయారు. ఎంతలా అంటే గొల్లపూడి కోసమే చాలామంది దర్శకులు తమ సినిమాల్లో పాత్రలు సృష్టించేంతగా. విలనిజం, క్యారెక్టర్ రోల్స్, కామెడీ పాత్రలు... ఇలా ఎవైనా గొల్లపూడికి ఒకటే. అభిలాష, సంసారం ఒక చదరంగం, ఛాలెంజ్, స్వాతిముత్యం ఇలా ఎన్నెన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. చివరగా తెలుగులో 2019లో వచ్చిన జోడి అనే సినిమాలో కనిపించారు

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో మారుతీ రావు గారి నటన మాములుగా ఉండదు అసలు మొదటి సినిమా లాగే ఉండదు ... మాములు నటుడు కాదు .... ఈ మధ్య కాలంలో ఒక్క "లీడర్ " సినిమాలో తప్ప ఆయన్ని మన దర్శకులు నిర్మాతలు సరిగ్గా ఉపయోగించుకోలేదు అని నా అభిప్రాయం ... బహుశా ఆయనే వొద్దు అని ఉండొచ్చు

Link to comment
Share on other sites

5 minutes ago, lokesh1729 said:

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో మారుతీ రావు గారి నటన మాములుగా ఉండదు అసలు మొదటి సినిమా లాగే ఉండదు ... మాములు నటుడు కాదు .... ఈ మధ్య కాలంలో ఒక్క "లీడర్ " సినిమాలో తప్ప ఆయన్ని మన దర్శకులు నిర్మాతలు సరిగ్గా ఉపయోగించుకోలేదు అని నా అభిప్రాయం ... బహుశా ఆయనే వొద్దు అని ఉండొచ్చు

Aayanadoh different type of vilanism superb actor and aah leader movie lo aayana scene unnadhi short time but very impactful..

Challenge movie lo kuda idiot of India alanti prasalu vaadaru manchi modulation..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...