Kool_SRG Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 ఐపీఎల్ 2020 సీజన్‌లో హైదరాబాద్ యువకుడికి చోటు దక్కింది... రాంనగర్‌కి చెందిన సందీప్‌ని ఐపీల్ 2020లో రూ. 20 లక్షలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. దీంతో రాంనగర్‌లోని సందీప్ నివాసం వద్ద సందడి నెలకొంది. సందీప్ ఐపీఎల్‌కు ఎంపిక కావడంతో తల్లి తండ్రులు ఆనందంలో మునిగిపోయారు సందీప్ ఐపీఎల్‌కు ఎంపికైనట్టు తెలుసుకున్న స్నేహితులు, ఇరుగుపొరుగువారు అతని ఇంటికి చేరుకొని స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, రంజీల్లో సెంచరీల మోత మోగించాడు సందీప్.. 18 ఏళ్ల వయస్సులో రంజీ మ్యాచ్‌లో రంగప్రవేశం చేసిన సందీప్ ఇప్పటి వరకు 54 రంజీ మ్యాచ్‌లు ఆడి 48.5 సగటుతో సత్తా చాటాడు. ఇప్పటి వరకు తన కేరీర్‌లో 7 సెంచరీలు, ఒక డబుల్‌సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ రంజీ జట్టుకు వైస్‌కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా సందీప్ బౌలర్ కూడా విజయ్ హజారే టోర్నీలో హైదరాబాద్ నుంచి 14 వికెట్లు తీసి ఆల్‌రౌండర్ ప్రతిభను చాటాడు. బీటెక్ పూర్తిచేసి స్పోర్ట్స్ కోటాలో ఇన్‌కంటాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. ఇక, సందీప్ తండ్రి దేశవాళీయ క్రికెట్ మ్యాచ్‌లకు అంపైర్‌గా వీధులను నిర్వహించాడు. తన తండ్రి అనుభవంతో చిన్నతనం నుండే సందీప్ క్రికెట్ లో శిక్షణ పొందాడు. ఐపీఎల్‌కు అవకాశం రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన సందీప్.. తన తండ్రి కష్టానికి ఫలితం దక్కిందని భావోద్వేగానికి గురయ్యాడు. Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted December 20, 2019 Author Report Share Posted December 20, 2019 Bavanaka Parameswar Sandeep.... Oh good he is local hyderabad guy... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.