Kool_SRG Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై జీఎన్ రావు కమిటీ తన నివేదికను ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అందజేశారు. ఈ నివేదికలోని అంశాల గురించి జగన్ తో చర్చించారు. కమిటీ నివేదికపై కమిటీ సభ్యులతో జగన్ చర్చించారు. కాగా, ఈ కమిటీ ఇచ్చిన నివేదికను ఈనెల 27 వ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్ లో చర్చించబోతున్నారు. క్యాబినెట్ మీటింగ్ లో చర్చించి ఆ తరువాత దానిని బహిర్గతం చేస్తారట. అప్పటి వరకు నివేదికను బహిర్గతం చేయకూడదని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవారం పాటు ఈ నివేదికపై గోప్యత ఉండబోతున్నది. రాజధాని ఒకటే ఉంటుందా లేదంటే.. మూడు చోట్ల రాజధానులు ఉంటాయా అని తెలియాలంటే మరో వారం రోజులపాటు ఆగాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో. Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted December 20, 2019 Author Report Share Posted December 20, 2019 AP Capital: సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన జీఎన్ రావు కమిటీ.. వివరాల వెల్లడి ఎప్పుడంటే? ఏపీ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ సీఎం జగన్‌కు నివేదిక సమర్పించింది. ఈ కమిటీ శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రిని కలిసింది. రాజధాని సహా ఏపీ సమగ్ర అభివృద్ధి కోసం సూచనలు చేయడానికి ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ నేడు సీఎం జగన్‌ను కలిసింది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు ఆఫీసుకు వెళ్లిన జీఎన్ రావు కమిటీ.. సీఎంను కలిసి నివేదిక సమర్పించింది. డిసెంబర్ 27న కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో చర్చించిన అనంతరం నివేదికను బహిర్గతం చేస్తారని సమాచారం. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సూచనలు ఇవ్వడం కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్ రావు అధ్యక్షతన నిపుణుల కమిటీని జగన్ సర్కారు సెప్టెంబర్ 13న ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అక్టోబర్ మూడో వారం నుంచి పని ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడంతోపాటు [email protected] ద్వారానూ అభిప్రాయాలను సేకరించింది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో ప్రకటించారు. ఈ కమిటీ పూర్తి నివేదిక ఇవ్వకముందే మూడు రాజధానులు ఉండొచ్చంటూ అసెంబ్లీలో జగన్ సంకేతాలు ఇచ్చారు. జీఎన్ రావు కమిటీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రజాసంఘాలు, మేధావులు, సామాన్య ప్రజలతో చర్చించింది. డిసెంబర్ తొలి వారంలో జీఎన్ రావు కమిటీ సీఎంకు మధ్యంతర నివేదిక సమర్పించింది. ఈ రిపోర్ట్ ఆధారంగానే సీఎం జగన్ మూడు రాజధానులు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారేమో అనే వాదన కూడా ఉంది. తాజాగా జీఎన్ రావు కమిటీ పూర్తిస్థాయి నివేదికను సీఎంకు సమర్పించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలో ఈ కమిటీ నివేదికలో పేర్కొంది. Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 Inga assembly lo cheppaka em undi le Quote Link to comment Share on other sites More sharing options...
RunRaajaRun123 Posted December 20, 2019 Report Share Posted December 20, 2019 Aathcare inko gov vasthey malli change AP will not have a standard capital it changes everytime government changes Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.